ప్రకృతి విపత్తును మించిన పాలక దుర్మార్గం - ఎన్.వేణుగోపాల్


ప్రకృతి విపత్తును మించిన పాలక దుర్మార్గం - ఎన్.వేణుగోపాల్

ప్రకృతి

(వీక్షణం మాసపత్రిక ఏప్రిల్ – మే 2020 సంచిక కోసం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన సంపాదకీయం)

కరోనా వైరస్ పుట్టుకకూ వ్యాప్తికీ, ఆ మహావిపత్తు దుష్పరిణామాలకూ కారణాలను కొంతవరకు ప్రకృతి మీదికి నెట్టడానికి మార్చ్ దాకానైనా వీలున్నదేమో గాని, మార్చ్ నుంచి ఎనిమిది పది వారాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ ఈ దురాగతంలో పాలకుల, ప్రభుత్వాల దుర్మార్గాల పాత్ర ఎంత ఎక్కువో చెప్పడానికే నిదర్శనంగా ఉన్నాయి. జనవరి మొదటి వారానికే ప్రపంచదేశాలలో ఈ వైరస్ గురించి చర్చ మొదలైనప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30న రానున్న మహావిపత్తు తీవ్రత గురించి తొలి హెచ్చరిక చేసినప్పటికీ, భారత పాలకులు ఆ తర్వాత ఏడు వారాల పాటు నిమ్మకు నీరెత్తినట్టు కూచున్నారు. ఈ వైరస్ విదేశీ ప్రయాణికుల ద్వారా తప్ప మరొక రకంగా రావడానికి వీలులేదని స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ, కనీసం అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణికుల రాక మీద ఆంక్షలు, నియంత్రణ, ప్రయాణికుల వైద్య పరీక్షలు, క్వారంటైన్ వంటి చేయవలసిన పనుల్లో ఏ ఒక్కటీ చేయలేదు. పైగా ఈ ఏడు వారాలలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆహ్వానించి, లక్షలాది మందితో సభలు నిర్వహించడం దగ్గరి నుంచి, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించే కుట్రల దాకా సాగించారు. కేంద్ర ప్రభుత్వ ప్రవర్తనే ఇలా ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తలచుకున్నా భిన్నమార్గం పట్టే అవకాశం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, జనవరి 30 నుంచి మార్చ్ 22 దాకా భారత ప్రజల ఆరోగ్య భద్రత పట్ల పాలకులు అనుసరించినది కేవలం అలక్ష్యం, క్రియాశూన్యత, బాధ్యతారాహిత్యం మాత్రమే. సరిగ్గా ఈ ఏడు వారాల కాలమే వైరస్ ప్రవేశాన్ని, వ్యాప్తిని అడ్డుకోవడానికి కీలకమైన కాలం.

మార్చ్ 22న జనతా కర్ఫ్యూతో ప్రారంభించి ఇది రాస్తున్న మే 10న సాగుతున్న మూడో లాక్ డౌన్ దాకా సాగిన ఏడు వారాల్లో కూడ పాలకుల స్పందన యథాలాపంగా, హాస్యాస్పదంగా, బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా, దుర్మార్గంగా ఉన్నది. వైద్య ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడం, ఎక్కువ సౌకర్యాలు కల్పించడం, ఎక్కువ ఆసుపత్రులను నెలకొల్పడం, ఎక్కువ పరీక్షలు చేయడం, వ్యాధి సోకగల, వ్యాపించగల ప్రాంతాలను గుర్తించి కట్టడి చేయడం, వ్యాధి సోకినవారిని వేరు చేసి మిగిలిన వారికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వైరస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అత్యవసర చర్యల గురించి ప్రభుత్వాలు ఆలోచించనే లేదు. బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొడితే, పళ్లాలు మోగిస్తే, శంఖాలు ఊదితే కరోనా వైరస్ పారిపోతుందన్న మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడం పాలకుల మొట్టమొదటి స్పందన. అది అసలు వైరస్ పట్ల స్పందించవలసిన తీరే కాదని విమర్శలు రాగానే మర్నాటికల్లా హఠాత్తుగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, సమయం ఇవ్వకుండా, ముందస్తు ఏర్పాట్లు లేకుండా లాక్ డౌన్ ప్రకటన రెండో స్పందన. వైరస్ బారిన పడిన విదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి గనుక ఇక్కడ కూడ పాటించవలసిందే అనే అనుకరణ ధోరణి తప్ప, భారత సమాజపు వాస్తవ స్థితి ఏమిటి, ఇక్కడ ఎటువంటి వైద్య ఆరోగ్య వ్యూహం అనుసరించవలసి ఉన్నదనే ఆలోచనే లేదు. ఆ లాక్ డౌన్ ను విదేశాలు డెబ్బై రోజుల వరకూ కొనసాగించాయి కాబట్టి ఇక్కడ కూడ మార్చ్ 24న ప్రకటించిన లాక్ డౌన్ సమయాన్ని ఏప్రిల్ 14న, మే 3న పొడిగిస్తూ వచ్చి, ఇది రాస్తున్న సమయానికి మే 17 దాకా చేశారు. నీకంటే నేనొకటి ఎక్కువ అనదలచుకున్న రాష్ట్రపాలకులు, తెలంగాణాధీశుల లాగ, దాన్ని మే 29 దాకా పొడిగించారు. లాక్ డౌన్ పేరుతో పరిశ్రమలు, కార్యాలయాలు, వ్యాపారాలు, రవాణా మూసివేస్తే వాటి మీద ఆధారపడిన కోట్లాది మంది ఏమైపోతారని, వారిని ఎట్లా ఆదుకోవాలని కనీస ఆలోచన కూడ పాలకులకు లేదు. అంతరాల సమాజంలో లాక్ డౌన్ ఏ అంతస్తు ప్రజల మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది, హానికరమైన ప్రభావం పడగల వర్గాలకు ఎటువంటి సహాయం అవసరమవుతుంది వంటి కనీస ఆలోచనలు పాలకులకు తట్టనైనా లేదు. దేశంలోని మొత్తం శ్రామిక, ఉద్యోగ జనాభాలో పది శాతం కూడ సంఘటిత రంగంలో లేరు. వారిలో కొందరికి మాత్రమే ఇంటి నుంచి పని చేయడానికి వీలుంటుంది. మిగిలిన అశేష శ్రామిక జనానికి లాక్ డౌన్ ఒక్క కలం పోటుతో పని పోగొట్టింది. అంటే భుక్తి పోగొట్టింది. రోజువారీ పని వెతుక్కునే స్థితిలో ఉన్న కోట్లాది మందికి పని దొరకని స్థితి తలెత్తింది. పనులు ఆగిపోయి, కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసి దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల వలస శ్రామికుల్లో అత్యధికులు బిచ్చగాళ్లుగా మారిపోయారు.

లాక్ డౌన్ ప్రకటించిన నాలుగైదు రోజులకు మేలుకొని ఈ సమస్యలు ఉన్నాయని గుర్తించి, వాటిని తీర్చడానికనే పేరుతో ప్రకటించిన మొదటి ఆర్థిక ప్యాకేజి పాత పథకాల్లోంచి అది కొంతా ఇది కొంతా చింపి కలిపి హడావుడిగా తయారుచేసిన కలగూరగంప. నిజంగా లాక్ డౌన్ బాధితులకు ఉపయోగపడేదేదీ అందులో లేదు. నాలుగు వారాలు పోనిచ్చి రిజర్వ్ బ్యాంక్ చేత ప్రకటింపజేసిన రెండో ప్యాకేజీలో సంపన్నులకూ, బడా రుణగ్రహీతలకూ తప్ప లాక్ డౌన్ బాధితులకు పనికొచ్చేదేదీ లేదు. తమను తమ గ్రామాలకు వెళ్లనిస్తే చాలునని వలస శ్రామికులు గగ్గోలు పెడితే, చివరికి వాళ్లంతట వాళ్లే రహదారులెక్కి వందల కిలోమీటర్లు నడుస్తుంటే, వాళ్లకోసం రైళ్లు వేస్తున్నామని ప్రకటించి, కోట్ల మంది శ్రామికుల కోసం వేసిన, నడిపిన రైళ్లు ఇప్పటికి ఒక లక్ష మందికి కూడ చోటివ్వలేదు. ఈలోగా ఈ వలస శ్రామికులు వెళ్లిపోతే, ఈ చౌక శ్రామికులు, వెట్టిబానిసలు మాకెక్కడ దొరుకుతారు అని యజమానులు గద్దించగానే శ్రామికుల ప్రయాణాల మీద లెక్క లేనన్ని ఆటంకాలు.... ఇలా చెపుతూ పోతే, భారత పాలకవర్గాలు ఈ ఏడు వారాలలోనే చూపిన అలక్ష్యం, చేసిన అక్రమాలు లెక్కలేనన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాలకులు ఎంత దుర్మార్గమైనవారో చూపడానికి ఈ ఏడువారాల గాథలు చాలు.

అంతమాత్రమే కాదు, లాక్ డౌన్ అడ్డం పెట్టుకుని పాలకులు చెపుతున్న అబద్ధాలు, తీసుకువస్తున్న అక్రమ విధానాలు, ప్రజావ్యతిరేక చట్టాలు, సాగిస్తున్న కేంద్రీకరణ, ప్రజా ఉద్యమాలపై నిర్బంధం, విస్తరిస్తున్న పోలీసు రాజ్యం ఈ పాలన ఎంత కుళ్లిపోయిందో అడుగడుగునా చూపుతున్నాయి. ఈ పాలన రద్దు కావలసిన అవసరం ఎంత బలంగా ఉన్నదో చూపుతున్నాయి. ప్రజా ప్రత్యామ్నాయాన్ని చూపి, అది సాధించడానికి చిత్తశుద్ధితో, దీక్షతో కృషి సాగించవలసిన శక్తుల బలహీనతే ఈ మరణశయ్య మీద ఉన్న పుచ్చిపోయిన రాజ్యం ఇంకా మనుగడలో ఉండేలా చేస్తున్నది.
-ఎన్.వేణుగోపాల్

Keywords : corona, lockdown, migrants, narendra modi
(2020-08-04 20:38:14)No. of visitors : 415

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

Search Engine

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి...వీవీ కుటుంబం డిమాండ్
వరవరరావును విడుదల చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లో సాహితీవేత్తల ప్రదర్శన‌
గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు
more..


ప్రకృతి