వలస కార్మికుడిని కొట్టి చంపిన పోలీసులు

వలస

అసలే కష్టాల్లో ఉన్న వలస కూలీలపై పోలీసుల దుర్మార్గాలు అంతులేకుండా ఉన్నాయి. గుజరాత్ లోని సూరత్ లో ఓ వలస కార్మికుడిని గురువారం సాయంత్రం పోలీసులు కొట్టి చంపారు.

30 ఏళ్ళ సత్య స్వైన్ ది ఒడిశా రాష్ట్రం గంజా‍ం జిల్లాలోని భంజనగర్ సమీపంలోని కుల్లాడ గ్రామం. బతుకుదెరువు వెతుక్కుంటూ సూరత్ కు వచ్చి 2 సంవత్సరాలుగా ఇక్కడే పని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పని కోల్పోయి అష్టకష్టాలు పడుతూ ఎలా గైనా స్వంత ఊరు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. రైలు లో వెళ్ళడం కోసం స్థానిక పోలీసు స్టేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందువల్ల సత్య తన తోటి కార్మికులతో కలిసి పోలీసు స్టేషన్ వెళ్ళాడు. అక్కడ అప్పటికే చాలా మంది కార్మికులున్నారు. వీళ్ళందరినీ తరిమికొట్టాలనుకున్న‌ పోలీసులు హటాత్తుగా కార్మికులపై లాఠీచార్జ్ మొదలుపెట్టారు. చెదరగొట్టడమే కాక వెంట్పడి మరీ కొట్టారు. కార్మికులు వాళ్ళ ఇళ్ళలోకి పారి పోయినా సరే ఇళ్ళలోకి దూరి కొట్టారు. సత్యతో పాటు అనేక మంది కార్మికులు అంజని ఇండస్ట్రీస్ ఎస్టేట్ ప్రాంతంలో ఉంటున్నారు. కార్మికుల వెంటపడి వీళ్ళ ప్లాట్ లోకి దూసుకొచ్చిన పోలీసులు దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు సత్య అక్కడే పడి పోయాడు.

"సుమారు 5-10 మంది పోలీసులుమమ్ములను వెంబడించి, లాక్ చేసిన గేటును పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి, విచక్షణారహితంగా దారుణంగా కొట్టారు మరియు మమ్మల్ని అమ్రోలి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు" అని సత్య‌ రూమ్మేట్ వివరించాడు.

పోలీసులు కనికరం లేకుండా, దుర్మార్గంగా కొట్ట‌డం వలన తీవ్రగాయాల పాలైన వలస కార్మికులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే సత్య ప్రాణాలు విడిచాడు.

సత్యకు భార్య, ఐదేళ్ల మానసిక వికలాంగ కుమారుడు ఉన్నారు. ʹʹనా భర్త మమ్ములను పోషించడం కోసం సూరత్ వెళ్ళాడు. ఇప్పుడు మా జీవితం ఏంగావాలి? నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలిʹʹ అని సత్య భార్య డిమాండ్ చేసింది.
అమాయకులను అన్యాయంగా చంపిన పోలీసులకు ఈ దేశంలో ఎప్పుడైనా..ఎక్కడైనా శిక్షలు పడ్డాయా ?

Keywords : migrants, gujarat, surat, police, Odishaʹs migrant worker brutally beaten to death by Surat police
(2024-04-17 23:18:27)



No. of visitors : 1935

Suggested Posts


ʹఏక్ పురాణి చెప్పల్ దేదో సాహెబ్... ʹ నెత్తురోడుతున్న కాళ్ళను చూపిస్తూ ఓ వలస కార్మికుడి అభ్యర్థన‌

"ఖానా తో మిల్ జాయెగా సాహిబ్.. ఏక్ పురాణి చప్పల్ దేదో" అని తిలోకి కుమార్ (32) తన కాళ్ళనుండి కారుతున్న రక్తాన్ని చూపించాడు. ఆ కాళ్ళు మొత్తం పుండులాగా ఉన్నాయి. ఇది ఇక తిలోక్ కుమా ర్ పరిస్థితే కాదు...దేశంలో పట్టణాల నుండి పల్లెలకు వెళ్తున్న అన్ని రోడ్లు ఇప్పుడు వలస కూలీల నెత్తురుతో తడుస్తున్నాయి.

మరో గత్యంతరం లేదు...కొడుకు వికలాంగుడు...క్షమించండి... మీ సైకిల్ తీసుకెళ్తున్నా...‌వలస కార్మికుడి లేఖ‌

ఓ వలస కూలీ ఆకలితో ఉన్న కుటుంభానికి కడుపు నింపే దారి లేక.... ఉండే ఇల్లు లేక.... స్వంత ఊరు నడిచే వెళ్దామనుకున్నా వికలాంగుడైన కన్న కొడుకును తీసుకొని నడిచి వెళ్ళలేక... వెళ్ళడానికి వేరే దారి లేక...‌ గత్యంతరం లేక... ఓ పాత సైకిల్ ను దొంగతనం చేశాడు.

అమృత్ మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బోరుమంటున్న యాకూబ్...వలసకార్మికుల అంతులేని దుంఖం

ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమృత్, యాకూబ్ మహ్మద్ గుజరాత్ లోని సూరత్ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పని లేదు, యజమానులు వదిలేశారు. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితి వీళ్ళిద్దరిదే కాదు అక్కడున్న వలస కార్మికులందరిదీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులంతా తలా నాలుగు వేలు ఇచ్చి తమ స్వరాష్ట్రం వెళ్ళడానికి ఓ ట్రక్ మాట్లాడుకున్నారు.

1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దగ్గర‌ కూడా పోలీసులు వారిని ఆపలేదు కాని ట్రక్ అక్కడే ఆగిపోయింది. మరోసారి, వారు నడవడం ప్రారంభించారు. 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత వారికి మరొక ట్రక్కు దొరికింది. ట్రక్కు డ్రైవర్ వారిని ఎక్కించుకున్నాడు.

ఏమి బతుకూ..ఏమిబతుకూ...వలస బతుకూ...! ఈ రాము, ధన్వంతలదీ అదే వ్యథ‌ !

శంలో కోట్లాది మంది వలస కార్మికుల వంటిదే రాము కథ. మధ్యప్రదేశ్ బాలా ఘాట్ కు చెందిన రాము భార్య ధన్వంత, పసి పిల్ల అనురాగినితో కలిసి బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసి బతికే రాముకు లాక్ డౌన్ వల్ల చేసేందుకు పనిలేక, ఇల్లుకు కిరాయి కట్టలేక, తినడానికి తిండి లేక...

వలస కూలీల ఆకలి కేకలు..అన్నం పొట్లం కోసం...!

అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వలస