లాక్ డౌన్ కాలానికి జీతాల చెల్లింపు జీవో ఉపసంహరణ... ఓ చిన్న వివరణ -ఇఫ్టూ ప్రసాద్


లాక్ డౌన్ కాలానికి జీతాల చెల్లింపు జీవో ఉపసంహరణ... ఓ చిన్న వివరణ -ఇఫ్టూ ప్రసాద్

లాక్

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు పూర్తి జీతాలివ్వాలని ఇచ్చిన ఆదేశాలను కేంద్రం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే అయితే ఉపసంహరించుకుంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సాకుగా చూపి పరిశ్రమాధిపతులు కార్మికులకు జీతాలు ఎగవేయాలనే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ ఆదేశాలు మే 18 తేదీ నుండి మాత్రమే అమలు లోకి వస్తాయని అంతకు ముందు అంటే మే 17 వ తేదీ వరకు కార్మికులకు పూర్తి జీతాలు ఇవ్వాల్సిందేనని ఇఫ్టూ నాయకుడు ప్రసాద్ రాసిన వ్యాసాన్ని మీకోసం....

లాక్ డౌన్ కాలానికి జీతాల చెల్లింపు జీవో ఉపసంహరణ -
ఓ చిన్న వివరణ!

ప్రియమైన కార్మిక సోదరులారా!

లాక్ డౌన్ కాలానికి కార్మికులకు జీతాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇచ్చిన విషయం తెల్సిందే. వాటి అమలుకై కార్మికులు సాగిస్తున్న ఆందోళనలు కూడా తెల్సిందే! ముఖ్యంగా AP లో పదివేలమంది జూట్ కార్మికవర్గం విశాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సాగిస్తున్న ఆందోళన తెల్సిందే! కొన్ని చోట్ల ఇప్పటికే విజయం సాధించిన విషయం కూడా తెల్సిందే! ఈ నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం జీతాల చెల్లింపుపై తన పాత జీవోని నిన్నగాక మొన్ననే ఉపసంహరించుకున్నది. ఇది అప్రజాస్వామికమైనదే! ఐతే ఇది దానిపై రాజకీయ వ్యాఖ్యానం కాదు. పై జీవో ఆధారంగా కొన్ని జూట్ మిల్లులు యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై వివరణ కోసమే ఈ చిన్న పోస్టింగ్!

మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని తానే తిరిగి మొన్న 17న ఉపసంహరించుకుంది. పై జీవో లో లేని అంశాన్ని ఉన్నట్లు కార్మికుల్లో అపోహల్ని సృష్టించే విధంగా కొన్ని పారిశ్రామిక యాజమాన్యాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి.
లాక్ డౌన్ కాలానికి తాము జీతాలు ఇవ్వనక్కర లేదని కార్మికులను బుకాయిస్తూ, అందుకు మొన్నటి కొత్త జీవో ని ఉదహరిస్తున్నట్లు తెలుస్తున్నది. అది నిజం కాదు. మొన్నటి తాజా ఉపసంహరణ జీవో 18-5-2020 నుండి అమలులోకి వస్తుంది. మే17 వరకూ పాత జీఓ (29-3-2020నాటి జీవో) ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొన్నటి కొత్త జీవో ప్రకారం నిన్న సోమవారం నుండి (18-5-2020 నుండి) మాత్రమే జీతాలు చెల్లించనక్కర లేదు. కానీ దాన్ని బూచిగా చూపించి మే17 వరకూ చెల్లించాల్సిన జీతాల ఎగవేతకోసం కూడా అవి కార్మికుల్ని తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నాయి. ఈ జీవో లోని క్లాజు తెలియని కొందరు కార్మికులు అపోహ పడుతున్నట్లు తెల్సింది. లాక్ డౌన్ ప్రారంభం నుండి జీతాలు చెల్లించనక్కర లేదని కొత్త జీవో లో ఉన్నట్లు ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని పారిశ్రామిక యాజమాన్యాలు చేస్తున్న తప్పుడు ప్రచారం అపోహల్ని కలిగిస్తున్నట్లు తెల్సింది. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా కార్మికుల పొట్టకొట్టే పన్నాగాల్ని చిత్తుచేసి న్యాయబద్ద జీతాలను సాధించుకోవాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

గమనిక:---నెల్లిమర్ల జూట్ మిల్ నుండి ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్! ఈ పోస్టింగ్ ని సరిగ్గా మిత్రులకు పంపించబోతున్న సమయంలో అందిన వార్త ప్రకారం నెల్లిమర్ల జూట్ మిల్లులో ఓ ధర్నా జరిగినట్లు తెల్సింది. అక్కడ జరిగిన ఓ ఆసక్తికరమైన అంశాన్ని చెప్పాల్సి వస్తోంది. జీవో వెలుగు లో లాక్ డౌన్ కాలానికి ఇతర కొన్ని జూట్ మిల్లుల కార్మికులు సాధించుకున్న జీతాల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఈరోజు A షిఫ్ట్ కి చెందిన జూట్ వర్కర్లు ఆందోళనకు సిద్ధపడ్డారు. డ్యూటీ దిగిన వెంటనే, 10AMకి నెల్లిమర్ల జూట్ మిల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఎదుట ఐదారు వందల మంది కార్మికులు ధర్నా చేశారు. ఆ సందర్భంగా నెల్లిమర్ల జూట్ మిల్ కమర్షియల్ మేనేజర్ పంకజ్ రాఠీ హడావుడిగా, ఏదో సాధించిన వాడి లా కార్మికుల ఎదుటకు వచ్చారు. వెంటనే తన సెల్ ఫోన్ లో చూస్తూ "ఇదిగొండి, ఈ కొత్తజీవో ప్రకారం మా మిల్లు యాజమాన్యం లాక్ డౌన్ కాలానికి జీతం ఇవ్వక్కర లేదు" అని విజయగర్వంతో మాట్లాడ బోయారు. మొన్నటి తాజా జీవో పట్ల స్పష్టమైన అవగాహన గల ఒక కార్మికుడు (ఇఫ్టూ యూనియన్ ఆర్గనైజర్ కూడా) వెంటనే "అది నిన్న 18వ తేదీ నుండి మాత్రమే వర్తిస్తుంది, అంతకు ముందు లాక్ డౌన్ కాలానికి వర్తించదు" అని ఘాటైన జవాబు ఇచ్చాడు. అది ఇవ్వగానే ఒక్కఅడుగు కూడా అక్కడ నిలబడకుండా పరుగున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోకి వెళ్లి పోయారు. వందలాది కార్మికుల ఎదుట భంగపడ్డ దృశ్యమిది. కార్మికుల పొట్టలు కొట్టడానికి బాధ్యత గల యాజమాన్య ప్రతినిధులే స్వయంగా ఇలాంటి వక్రీకరణలకు దిగడం గమనార్హం!

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
19-5-2020

Keywords : workers, corona, lockdown, bjp, narendra modi, iftu prasad
(2020-06-04 01:22:16)No. of visitors : 197

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


లాక్