గాయపడ్డ తండ్రిని ఎక్కించుకొని1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన13 ఏళ్ళ చిన్నారి

లాక్ డౌన్ వలస కార్మికులను ఎన్నో కష్టాల పాలుచేస్తోంది. వాళ్ళు ఎన్ని రిస్క్ లైనా భరించి స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. కాళ్ళు నెత్తుర్లు కారుతున్నా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. సైకిళ్ళ మీద వేల కిలో మీటర్లు వెళ్తున్నారు. మధ్య దారిలో తిండి లేకున్నా ఆకలితో అలసటతో వాళ్ళు పోతూనే ఉన్నారు. చచ్చినా బతికినా స్వంత ఊర్లోనే అనే భావన వాళ్ళను ప్రాణాలకు తెగించి నడిపిస్తోంది. ఓ 13 ఏళ్ళ బాలిక సైకిల్ పై గాయపడ్డ తన తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు...7 రోజులు...ప్రయాణించి ఊరికి చేరింది.

13 ఏళ్ళ జ్యోతిది బీహార్ లోని దర్భంగా. తన తండ్రితో కలిసి ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ లో ఉంటోంది. తండ్రి ఢిల్లీలో కిరాయికి తీసుకొని ఈ రిక్షా నడిపిస్తాడు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు పని పోయింది. రిక్షాను యజమానికి అప్పజెప్పాడు తండ్రి. తిండి కరువయ్యింది. రెంట్ కోసం వాళ్ళు ఉండే రూం యజమాని వత్తిడి పెరిగి పోయింది. ఏం చేయాల్నో అర్దం కాక బీహార్లోని తమ స్వంత ఊరికి పోవాలని నిర్ణయించుకున్నారు. ట్రక్కులో వెళ్దామనుకుంటే ట్రక్కు డ్రైవర్ 6 వేల రూపాయలడిగాడు. కానీ వాళ్ళదగ్గరున్నది 600 రూపాయలే. అందుకని ఆమె సెకండ్ హాండ్ లో కొన్న సైకిల్ మీద వెళ్దామని అనుకున్నారు. కాలికి గాయం వల్ల‌ జ్యోతి తండ్రి సైకిల్ నడపలేడు. ఇక జ్యోతి తానే సైకిల్ తొక్కాలని నిర్ణయించుకొని తండ్రిని తీసుకొని బయలు దేరింది. మే 10 వతేదీన గుర్గావ్ లో బయలు దేరి మే 16 న తమ ఊరికి చేరుకున్నారు.

జ్యోతి తన ప్రయాణం గురించి ఏమంటది అంటే...ʹʹ రాత్రి వేళల్లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా భయపడలేదు, ఎందుకంటే మేము వందలాది మంది వలసకూలీలు హైవేలపై నడుస్తూనే ఉన్నారు. మా ఏకైక ఆందోళన రోడ్డు ప్రమాదాలు. అదృష్టవశాత్తూ మేము ఏ ప్రమాదానికి గురికాకుండా చేరుకున్నాము. .

ఇంకా ఆమె ఏమన్నదంటే ʹʹనా తండ్రి ఢిల్లీలో ఈ-రిక్షాను నడిపేవాడు. లాక్డౌన్ అయిన తరువాత రిక్షాను దాని యజమానికి అప్పగించేశాం. దానితో నాన్నకు పని లేకుండా పోయింది. పైగా నాన్న‌ కాలికి గాయమైంది.ʹʹ

ʹʹమాకు పెద్దగా డబ్బు లేదు మేము ఉండే గది రెంట్ చెల్లించాల‌ని లేదా ఖాళీ చేయమని గది యజమాని నాన్నపై ఒత్తిడి తెచ్చాడు. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు అందువల్ల‌ మేము మా గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక ట్రక్ డ్రైవర్‌తో మాట్లాడాము, మమ్మల్ని ఢిల్లీ నుండి దర్భంగాకు తీసుకురావడానికి 6,000 రూపాయలు డిమాండ్ చేశారు. మా దగ్గర అంత సొమ్ము లేదు. చివరగా నేను 500 రూపాయలతో కొన్న సైకిల్పై నేను, నాన్నప్రయాణం ప్రారంభించాముʹʹ అంది జ్యోతి.

జ్యోతి మరియు ఆమె తండ్రి ఢిల్లీ నుండి బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర‌ కేవలం 600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. జ్యోతి పగలు రాత్రి సైకిల్ తొక్కేది రాత్రి వేళల్లో పెట్రోల్ పంపుల దగ్గర‌ 2-3 గంటలు విరామం తీసునేది. రోడ్ల మీద సహాయ శిభిరాల్లో ప్రజలు అందించిన ఆహారంతో కడుపు నింపుకున్నారు.

వారం రోజులు సైకిల్ తొక్కుకుంటూ 1200 కిలోమీటర్లు విరామం లేకుండా ప్రయాణించి చివరకు క్షేమంగా స్వగ్రామానికి చేరారు. వాళ్ళను గ్రామ గ్రంథాలయంలో క్వారంటైన్ లో ఉంచారు. చిన్నారి జ్యోతి అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ తండ్రిని తీసుకొని వచ్చిదంటే కుటుంభ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని జ్యోతి బావ ముఖేష్ పాస్వాన్ అన్నాడు.

Keywords : migrants, delhi, bihar,15-year-old girl cycles 1,200 KMs with injured father from Delhi to Bihar
(2024-04-21 05:28:30)



No. of visitors : 4749

Suggested Posts


లాక్ డౌన్: వలస కార్మికుల ఆకలి కేకలు - స్మశానంలో పడేసిన కుళ్ళిన అరటిపళ్ళు తింటూ....

లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ నగరంలోని వేలాది మంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళకు ఉండడానికి షెల్టర్‌ లేక అల్లాడి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా యమునా నది ఒడ్డున ఫ్లై ఓవర్ ల కింద బతుకులీడుస్తున్నారు. ఆ నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు.

రైలు టిక్కట్ల పేరుతో వలస కార్మికులను దోచుకున్న బీజెపి నేత....ప్రశ్నించినందుకు కార్మికుడిపై దాడి

అసలే లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఓ బీజేపీ నాయకుడు నిలువుదోపిడీ చేశాడు. పైగా ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఓ కార్మికుడిని రక్తం కారేట్టు తీవ్రంగా కొట్టాడు.

సైకిల్ పై స్వంతూరుకు బయలు దేరిన వలస కార్మికులు... భార్యాభర్త మరణం,అనాధ‌లైన చిన్నారులు

చత్తీస్ గడ్ కు చెందిన కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు.

హైదరాబాద్ శివార్లలో.. ఆకలితో..ఆగ్రహంతో...తిరగబడ్డ వలసకార్మికులు ...రెండు నెలలుగా జీతాలివ్వని కంపెనీ

హైదరాబాద్ నగర శివార్లలో...సంగా రెడ్డి జిల్లా కంది వద్ద కడుతున్న ఐఐటీ భవన నిర్మాణాల కోసం వచ్చిన కార్మికులు ఇవ్వాళ్ళ ఆకలితో, అసహనంతో తిరగబడ్డారు. పనులు చేయించుకొని జీతాలు ఇవ్వని కంపనీ ఒకవైపు ఊరికి వెళ్ళలేని లాక్ డౌన్ మరో వైపు వాళ్ళను నిలవనివ్వలేదు. దాదాపు 2 వేల మంది కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.

వలస కూలీలు స్వంతూర్లకు పోవడానికి సహకరించిన వాళ్ళపై కేసులు...బిల్డర్ల కోసం కర్నాటక బీజేపీ ప్రభుత్వం దుర్మార్గం

వలస కార్మికులను తమ స్వంతూర్లకు వెళ్ళడానికి సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్తలపట్ల బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా కోపంగా ఉన్నారు. ఆ వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం రంగంలోకి దిగి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది.

సూరత్ లో మళ్ళీ తిరగబడ్డ వలస కార్మికులు...పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు.

కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటన సూరత్ శివార్లలోని వారెలి సమీపంలో జరిగింది. వలస‌ కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి పంపమని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగింది.

బిల్డర్లతో మీటింగ్ తర్వాత వలస కార్మికుల రైళ్లను రద్దు చేసిన కర్నాటక సీఎం !

కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప రాష్ట్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సమావేశమైన కొంత సేపటికే వలస కార్మికులను తమ సొంత పట్టణానికి తీసుకెళ్లే రైళ్లన్నింటినీ రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు... పోలీసులపై దాడి, పోలీసుల లాఠీచార్జ్

మే 4వ తేదీ నుండి వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి స్వంత గ్రామాలకు పంపిస్తామని ప్రకటించిన కేంద్రం యూటర్న్ తీసుకోవడం వలస కూలీల గుండెల్లో మరింత మంటను రాజేసింది.

ఆకలితో రోడ్డెక్కిన వలస కార్మికులపై లాఠీచార్జ్....వేయి మందిపై కేసులు...కార్మిక నాయకుడి అరెస్ట్ !

వాళ్ళు దేశంలోని ఎక్కడేక్కడినుండో ము‍ంబై వచ్చి రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కడుపు నింపుకునే వలస కార్మికులు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


గాయపడ్డ