విశాఖ‌ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు


విశాఖ‌ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు

విశాఖ‌

12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఆమెకు సహకరించాడనే ఆరోపణలపై మల్లాడి రఘునాథ్ కు కూడా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన్ను కలిసి నోటీసులు అందించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఎ కింద ఇప్పుడు రఘునాథ్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. కుట్రపూరితంగానే సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నోటీసుల నేపథ్యంలో త్వరలో రఘునాథ్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన విచారణలో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు కొందరిపై చర్యలకు సిద్ధమయ్యారు.

LG పాలిమర్స్‌ ప్రమాదంపై ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరు లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. IPC సెక్షన్లు 505 ఆఫ్‌ టు, 153 (ఎ), 188, 120-బి రెడ్‌విత్ 34…ఐటీ చట్టం 67 ప్రకారం కేసులు నమోదు చేశారు. సోషల్ ‌మీడియాలో వైరల్‌ అయిన పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత.. వాటిని రంగనాయకమ్మే పోస్ట్ చేసినట్లు గుర్తించామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆమెకు CRPC సెక్షన్ 41-A ప్రకారం నోటీసులు అందజేశారు. రంగనాయకమ్మకు సహకరించారనే ఆరోపణలతో మల్లాది రఘునాథ్‌ గురించి కూడా దర్యాప్తు చేపట్టి నిన్న ఆయనకు కూడా నోటీసులు అందించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం కేసులో రంగనాయకమ్మ ఏ1 కాగా రఘునాథ్ ఏ2 అని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి 3 ఏళ్ల జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు.. 10 లక్షల జరిమానా ఉంటుందని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు రంగనాయకమ్మను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోయారు. 5 గ్రామాల్లోని 15 వేల మంది ప్రజలు మృత్యువుతో సహజీవనం చేస్తున్నట్లు భయపడాల్సిన దుస్థితి. 15 వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎల్జీ పాలిమర్స్ పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం 12 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి కూడా నామమాత్రపు కేసులతో చేతులు దులిపేసుకున్నారు. కానీ, అదే ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం పగ సాధిస్తోందంటూ ప్రతిపక్షాలు, మానవహక్కుల వేదిక, ఐద్వా మండిపడ్డాయి. ఇది దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో దుర్ఘటనపై 20 ప్రశ్నలను ఫేస్బుక్ రంగనాయకమ్మ షేర్ చేశారు. ఆ ప్రశ్నలకు బదులివ్వలేని ప్రభుత్వం..తమపై దుష్ఫ్రచారం చేస్తున్నారంటూ ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని కూడా పగబట్టి మరీ కేసులతో వేధిస్తోందంటూ సీపీఐ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయకమ్మకు అండగా ఉంటామన్నారు. నియంతృత్వపు పోకడలతో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. అదేంటని తప్పులను ప్రశ్నిస్తే..వాటిని సరిదిద్దుకోవటం మానేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్ అయ్యారు.

ఆమె లేవనెత్తిన కీలకాంశాలు

1: ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు
2: కంపెనీ సీజ్ చేయలేదు.
3: చాలా తెలివిగా కంపెనీ లిక్విడ్ ఎస్సెట్ అయిన స్టెరీన్ ను వెనక్కు తరలించారు
4:పోలీసు బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును ఏమార్చారు.
5:క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు సేకరించే అవకాశం లేకుండా చేశారు.
6: స్టెరీన్ ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దానిని వేగంగా దేశం దాటించారు.
7: స్టెరీన్ లో మిక్సింగ్ చేయటానికి తెచ్చిన కెమికల్ మాయం చేశారు
8: అసలు కంపెనీని యల్ జి. పాలిమర్ నడుపుతున్న దా లేక వేరే కంపెనీకి ఉత్పత్తి చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారా?
9: ఇప్పుడు వెనక్కు పంపుతున్న వందల కోట్ల ఖరీదైన లిక్విడ్ స్టెరీన్ కొనుగోలుకు ఏ బాంకు ఋణం తీసుకున్నారు.
10: ఆ బాంకు ఇంత వరకు కంపెనీకి ఎందుకు షో కాజ్ నోటీసులు ఇవ్వలేదు. రేపు కంపెనీ తరలి పోయాక మాకు బాకీ ఉందని ప్రకటించినట్లయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు.
11: కంపెనీ తరలి పోతుందని ప్రభుత్వం ప్రకటించటం వెనక రహస్యం ఏమిటి?అది చేయవలసినది కంపెనీ యాజమాన్యం కదా?
12:ఒక మల్టీనేషనల్ కంపెనీ తన సంస్ధను ఎత్తి వేస్తున్నట్లు ముందుగా కేంద్రానికి కదా తెలియ చెయ వలసినది. రాష్ట్రానికెందుకు అంత తొందర.
13: ఇప్పుడు ఈ స్ధాయిలో ఆధారాలు ధ్వంసం చేశాక యు. యన్ ఓ . కానీ సు. కో. గానీ హై. కో. గానీ ఏమి పరిశోధించి నిజాలు నిగ్గు తేల్చగలరు.
14:హై. కో. నిజంగా విచారణ చేయాలనుకుంటే వెంటనే సి. బి. ఐ. విచారణ కు ఆదేశించి ఉండేది. అలా చేయకుండా తాత్సారం జరిగింది అంటే ఏమిటి అర్ధం.
15: గతంలో ఎప్పుడూ బాధితులను గుర్తించి ఇంత వేగంగా పరిహారం చెక్కులు ఇవ్వలేదు.
16:ఇంత వ్యూహాత్మకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతుంటే ఏ రాజ్యాంగ బద్ద సంస్ధలూ కోర్టు లూ ఏమీ చేయలేవు.
17: గంటల వ్యవధిలో కేంద్రం స్టెరీన్ ను తరలించేందుకు నౌకలను సమకూర్చటము కూడా ఈ కుట్రలో భాగమే. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితులలో ఒక దేశం నుంచి మరో దేశానికి అసలు సరకు రవాణా యే లేదు. మరి వీళ్ళకెలా అనుమతి లభించింది.
18: వారం రోజులు కావస్తున్నా కనీసం కంపెనీ ప్రతినిధులు బయట నిర్భయంగా తిరగ గలగటమూ బాధితులు అరెస్టు కాబడటమూ ఈ దేశంలో ఇదే మొదటిసారి.
19: సంఘటనానంతరం కంపెనీ ని సందర్శించిన పోలీసు అధికారి అరెస్టు లు మా పని కాదు అని ప్రకటించటం దేనిని సూచిస్తుంది
20: ఆ అయిదు గ్రామాలప్రజలు ఇక ఆశ ఒదిలేసుకోవటమే మిగిలింది.
ఇక ఈ రాష్ట్రంలో బాధితులకు న్యాయం జరగటం అనేది ఎక్కడా ఏ సందర్భంలో నూ సాధ్యం కాదు.

Keywords : ranganayakamma, ys jagan, andhrapradesh, cid, case,
(2020-07-02 02:28:39)No. of visitors : 255

Suggested Posts


తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?

ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో

మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్‌ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు.

నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...

సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే

గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట‌...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట‌ !

గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.

డేటా చౌర్యంలో దోషులెవరు ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్‌ (6) ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌ (మార్చ్‌ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది.

Search Engine

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
మహారాష్ట్ర సీఎంకు 14మంది ఎంపీల లేఖ‌ - వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన
14 MPs sought better treatment for varavara rao...wrote a letter to Maha CM
CRPF దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసులు
more..


విశాఖ‌