కరోనా సంక్షోభంలోనూ ఆగని రైతుల ఆత్మహత్యలు


కరోనా సంక్షోభంలోనూ ఆగని రైతుల ఆత్మహత్యలు

కరోనా

కరోనా సంక్షోభంలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో సగటున రోజుకు ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. లాక్‌డౌన్‌ సమయంలో(మార్చి-ఏప్రిల్‌) 109 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఔరంగాబాద్‌ డివిజనల్‌ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు మొత్తం 231 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా మార్చిలో 73, ఏప్రిల్‌లో 36 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో దాదాపు 1.87 కోట్ల జనాభా ఉండగా, అన్ని జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పుడున్న కష్టాలకు తోడు కోవిడ్‌-19 సంక్షోభం తోడుకావడంతో రైతుల బాధలు అధికమయ్యాయని షెట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్‌ ఘన్వత్‌ అన్నారు. వ్యవసాయ రంగంపై కరోనా సంక్షోభం ప్రభావం చాలా రోజుల పాటు కొనసాగే అవకాశముందని, రైతులకు మరిన్ని కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ʹవ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ లేదు. లాక్‌డౌన్‌ సమయంలో రైతులు తమ ఫలసాయాన్ని 10 శాతం కూడా అమ్మలేకపోయారు. విత్తనాలు విత్తడానికి, వారి కుటుంబాలను చూసుకోవడానికి రైతుల వద్ద డబ్బు లేదʹని ఆయన వివరించారు.

జాతీయ మానవ హక్కుల సంఘానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం 2011 జనవరి నుంచి 2014 డిసెంబర్‌ వరకు రాష్ట్రంలో 6,268 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఈ సంఖ్య దాదాపు రెట్టింపు(11,995) ఆత్మహత్యలు 2015-18 మధ్యకాలంలో నమోదు కావడం మహారాష్ట్రలో రైతుల దుస్థితికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

Keywords : maharashtra, corona, farmers, suicides
(2020-08-14 12:58:13)



No. of visitors : 229

Suggested Posts


దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు.

ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా....

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life

DAYS AFTER he was questioned by the Maharashtra Anti Terrorism Squad (ATS) in connection with the arrests of seven alleged members of the banned Communist Party of India (Maoist), Mumbai schoolteacher Prabhakar Macha committed suicide on January 23....

Search Engine

రాముడిని విమర్షించాడనే కారణంతో కత్తి మహేష్ అరెస్ట్
ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు
ఏడు వందల ఇరవై గంటల ఆందోళన...కనుచూపు మేరలో లేని ఉపశమన ఆశారేఖ
మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
more..


కరోనా