సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు


సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు

సీఏఏ

ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో ప్రజలపై జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు అసలు దోషులను వదిలేసి బాధితులకు అండగా నిలబడ్డవాళ్ళను అరెస్టులు చేస్తున్నారు. ఒక వైపు లాక్ డౌన్ ఉండగా పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా నిన్న(23/05/2020) సాయంత్రం ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళ‌నల్లో పాల్గొన్న ʹపిన్ జ్రా తోడ్ʹ (పంజరాన్ని ధ్వంసం చేయి)అనే సంస్థ కార్యకర్తలైన దేవాంగనా కలిత, నటాషా నార్వల్ అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఫిబ్రవరి 22 సాయంత్రం పింజ్రా తోడ్ సభ్యుల అద్వర్యంలో జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద స్థానిక మహిళలు సీఏఏ వ్యతిరేక ప్రదర్శన చేసినందుకు ఈ అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.

ఈ పింజ్రా తోడ్ అనే సంస్థ జవహర్ లాల్ యూనివర్సిటి విద్యార్థినిలు, మాజీ విద్యార్థినులతో 2015 లో ఏర్పడ్డ సంస్థ ఇది న్యాయమైన, వివక్షత లేని విశ్వవిద్యాలయం కోసం పేద విద్యార్థులు భరించగలిగే ఫీజులతో కూడిన‌ వసతి కోసం పోరాడుతున్న మహిళా సంస్థ. ఈ సంస్థ సీఏఏ నిరసనల్లో చురుకుగా పాల్గొంది.

సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.దీనికి ముందు, జామియా సమన్వయ కమిటీ సభ్యురాలు సఫూరా జర్గర్ ను, జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు మీరాన్ హైదర్ను అరెస్టు చేశారు.

Keywords : CAA, NRC, Delhi, Jamia milia university, pinjra thod, police, arrest
(2020-11-24 23:50:26)



No. of visitors : 382

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్

పౌరసత్వ సవరణ చట్టం, ఏన్నార్సీ రెండూ కలిపి అమలు చేయడంలోనే ప్రమాదముందని భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Search Engine

వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
more..


సీఏఏ