హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌

అనేక ఏడ్లుగా సంఘ్ పరివార్ అణచివేతకు గురవుతున్న మైనారిటీలను వేటాడేందుకు ఇస్లాం మతద్వేషంతో నిండిన హిందూత్వ భారతదేశ పోలీసులు, వారి లాఠీలు సిద్ధంగా ఉన్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో హిందూ మతతత్వంతో ప్రభావితులైన, అవినీతిపాలైన పోలీసులు ముస్లిం అనుకొని ఒక హిందువు మీద దాడి చేశారు.

2020మార్చి 23, నాడు మధ్యప్రదేశ్ లోని బేతుల్ టౌన్‌లో సాయంత్రం 5:30-6 గంటల మధ్య ఆసుపత్రికి వెళ్తున్న 32 ఏళ్ల జర్నలిస్ట్, లాయర్ దీపక్ బుందేలేను ముస్లింగా భావించి దారుణంగా దాడి చేశారు. మధుమేహరోగి అయిన దీపక్ మందు కోసం ఆసుపత్రికి నడుస్తూ వెళుతున్నప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు ఆపారు. కోవిడ్ 19 వల్ల సెక్షన్ 144 అమలులో వున్నప్పటికీ తాను రోడ్డు మీదకు రావడానికి గల కారణాన్ని వివరించడానికి ముందే అతన్ని చెంపదెబ్బ కొట్టారు.

తాను న్యాయవాది కావడం వల్ల, దీపక్ పోలీసు అధికారులతో ʹరాజ్యాంగ పరిమితుల్లో పనిచేయాలనీ, ఒకవేళ ఐపిసి సెక్షన్ 188 (సంక్రమిత వ్యాధుల చట్టం) కింద తనను అదుపులోకి తీసుకోదల్చుకుంటే తాను అందుకు సిద్ధంగా ఉన్నాననిʹ అనగానే వారు సంయమనం కోల్పోయి అతన్నీ, భారత రాజ్యాంగాన్ని కూడా తిట్టడం మొదలుపెట్టారు. అలా తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు.
అంతలోనే అక్కడి చేరిన డజనుమందికి పైగా పోలీసు అధికారులు దీపక్‌ను లాఠీలతో కొట్టడం మొదలుపెట్టారు. తాను న్యాయవాదిని అని చెప్పేటప్పటికి కొట్టడం ఆపారు కానీ అప్పటికే అతని చెవుల నుంచి బాగా రక్తం కారడం మొదలైంది. దాడికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ పొందిన మరుసటి రోజు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మధ్యప్రదేశ్ పోలీసు డిఎస్పి, డిజిపిలకి దీపక్ ఫిర్యాదుకాపీలను చేశారు.

రాజ్య అణచివేత సాధనంగా వుపయోగపడే పోలీసులు కూడా రాజకీయ నాయకుల్లాగే ప్రవర్తిస్తున్నారు. దీపక్ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటే గనుక తాము ఈ సంఘటనను ఖండిస్తామనీ, క్షమాపణలు చెబుతామని మధ్యప్రదేశ్ పోలీసులు దీపక్‌తో అన్నారు. అయితే కేసును ఉపసంహరించుకోలేదని పోలీసు అధికారులు తననూ, న్యాయవాది అయిన తన సోదరుడిని కూడా బెదిరించారనీ, కల్పిత కేసులో ఇరికిస్తామని కూడా అన్నారనీ దీపక్ ఆరోపించారు.
మే 17 న ASI B.S. పటేల్, కొత్వాలి పోలీస్ స్టేషన్‌కి చెందిన మరొక అధికారి ఇంటికి వచ్చి ఫిర్యాదును వాపస్ తీసుకోమని అడిగినప్పుడు దీపక్ అందుకు ఒప్పుకోకపోతే, ఒక అధికారి, "హిందూ-ముస్లిం అల్లర్లు జరిగినప్పుడల్లా పోలీసులు హిందువుల పక్షాన ఉంటారు. ముస్లింలకు కూడా ఆ విషయం తెలుసు"అని అన్నారు. అందుకు దీపక్ ఆ ప్రాంతంలో హిందూ-ముస్లిం అల్లర్లు జరగలేదని జవాబివ్వడంతో, అంతకు ముందు కొన్ని సంఘటనలు జరిగాయనీ అందుకనే పోలీసు అధికారుల మానసిక స్థితి అలా వుండింది అని ఆ అధికారి వివరణనిచ్చాడు. ఆ తరువాత దీపక్‌కు వున్న ʹపొడుగు గడ్డంʹ ని చూసి పోలీసు అధికారులు అతన్ని ముస్లింగా పొరపాటు పడ్డారు అనే దారుణమైన అసలు నిజాన్ని ఆ ASI బయటపెట్టాడు.
ʹదీపక్‌పై దాడి చేసిన అధికారి ఒక ʹహార్డ్‌కోర్ʹ హిందువు అనీ, హిందూ-ముస్లిం అల్లర్లు జరిగినప్పుడల్లా ముస్లింలను అరెస్టు చేసి దారుణంగా కొడతాడనీʹ మరొక అధికారి తెలిపాడు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో, ముస్లింకు బదులుగా తమ ʹహిందూ సోదరుడినిʹ కొట్టారని తెలుసుకున్న తరువాత వారు సిగ్గుపడుతున్నారని అన్న ASI, సస్పెండ్ అయ్యాడు.

ఆ ఇద్దరుపోలీసులు కల్పించిన కథ కాదు ఇది, వారు అనుకోకుండా వాస్తవాన్ని బయట పెట్టారు అంతే. పోలిస్ అధికారులకున్న ముస్లిం వ్యతిరేక వైఖరికి దీపక్‌ సంతోషించి అధికారులను క్షమిస్తాడని వాళ్ళు భావించారు. పోలీసులు చెప్పిన ఈ విషయం ʹహిందూత్వరాష్ట్రʹలో భాగమైన మధ్యప్రదేశ్ పోలీసుల లాఠీలు ఎంత ముస్లిం ద్వేషాన్ని కలిగి వున్నాయో తెలియచేస్తోంది.
కేసును ఉపసంహరించుకోవాలని పోలీసులు తమను ఇంకా బెదిరిస్తున్నారని న్యాయవాది దీపక్, అతని సోదరుడు న్యాయవాది దర్శన్‌ అంటున్నారు.
ఇటీవలి ఈశాన్యఢిల్లీలో ముస్లింలపై ఆర్ఎస్ఎస్ చేసిన హింసాత్మక దాడుల సందర్భంలో, పోలీసులు నేరస్తులు, ద్వేషోన్మాదులతో కలిసిపోయారు. మైనారిటీలపై దాడి చేయడంలో హిందు మతోన్మాద గుంపుకు పోలీసులు సహాయం చేస్తున్నట్లు అనేక వీడియోలు వచ్చాయి. దక్షిణ రాష్ట్రమైన కేరళలో శబరిమల అల్లర్ల సమయంలో, సిపిఐ (ఎం)ప్రభుత్వంలోని కేరళ పోలీసులు సంఘ్ పరివార్‌లోని కింది స్థాయి అనుచరులను కొంతమందిని కొట్టారు, అరెస్టు చేశారు, కాని మసీదులను నాశనం చేస్తామనీ ముస్లింలందరినీ చంపేస్తామని బహిరంగంగా బెదిరించిన సంఘ్ పరివార్ నాయకులను మాత్రం ఎప్పుడూ అరెస్టు చేయలేదు. వారిపై కేసులు పెట్టలేదు.
రంజాన్ సమయంలో కూడా, ముస్లిం యువకులను, గర్భిణీ స్త్రీని గుజరాత్‌లో పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టడంలాంటి కొన్ని సంఘటనలు మైనారిటీల పట్ల వారి అమానవీయ వైఖరికీ, అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నది అనేదానితో సంబంధం లేకుండా పోలీసుల్లో వున్న ఇస్లాం మతవ్యతిరేక స్వభావానికీ ఉదాహరణలు.

ʹPOLICEʹ అనే పదం యొక్క సంక్షిప్తీకరణ - మర్యాద(Politeness), విధేయత(Obedience), విశ్వసనీయత(Loyalty), తెలివి(Intelligence), ధైర్యం(Courage),సమర్థత(Effficiency).

అయితే కులతత్వాన్ని, ఇస్లాం వ్యతిరేకతను కలిగివున్న అగ్రకుల ఐపిఎస్ ఉన్నతాధికారులు లేదా దిగువస్థాయి అధికారులు ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? ʹముల్క్ʹ సినిమాలో లాగా, ముస్లిం అధికారులకు కూడా ఈ హిందుత్వ మతతత్వ మనస్తత్వం వుంది. పోలీసు అధికారులు న్యాయ చట్టాలకు ʹవిధేయులుగావున్నారాʹ? వారికి రాజ్యాంగం పట్ల ʹవిశ్వసనీయతʹ ఉన్నదా? సమాజంలోని నిజమైన ముప్పును (సంఘ్ పరివార్) గుర్తించడానికి వారి ʹతెలివిʹ సరిపోతుందా? మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా హింసను ప్రేరేపించే సంఘ్‌పరివార్ నాయకులను అరెస్టు చేయడానికి ʹధైర్యంʹ సరిపోతుందా? భారతదేశంలో లౌకిక విలువలను కాపాడే ʹసమర్థతʹ వున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే పెద్ద సమాధానం ʹలేదుʹఅని. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ ఖాకీ దుస్తులు బూట్లకీ -పోలీసుల ఖాకీ దుస్తులు - బూట్లకీ మధ్య ఏ మాత్రం తేడా లేదు. భారతదేశం వంటి అర్ధ-భూస్వామ్య, వలసరాజ్యాల హిందుత్వ ఫాసిస్ట్ రాజ్యం ఉన్నంతవరకు పోలీసుల పనితీరు ఇలాగే ఉంటుంది.
అర్నాబ్ గోస్వామి టీవీ చర్చల్లో మధ్యప్రదేశ్‌లో లౌకిక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వుంది అని ఉదారవాదులు వాదించవచ్చు. కానీ చేదునిజం ఏమిటంటే ప్రధానస్రవంతి పార్లమెంటరీ రాజకీయ పార్టీలు పుట్టుకతోనే ఇస్లామ్‌, దళితద్వేష స్వభావాన్ని కలిగినవి. బీమపాలి కాల్పుల సంఘటన, సిరాజునిసా హత్య, మారిచ్జాపి సంఘటనలో పోలీసుల ప్రమేయం వుంది కాబట్టి సిపిఐ(ఎం)తో సహా వామపక్ష పార్లమెంటరీ పార్టీలన్నీ కూడా ఈ విషయాన్ని తిరస్కరించలేవు. కొన్ని వారాల క్రితం కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ఎస్ఎస్ లాగానే మాట్లాడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ బులెటిన్ (పిఎస్సి పరీక్షలకుతయారయ్యే వారికోసం తాజా విషయాలను తెలియచేసే పత్రిక)లో 19 వ పాయింట్ ఇలా వుంది. ʹఅనేక మంది భారతీయ పౌరులకు కోవిడ్ -19ని సంక్రమింపచేసిన తబ్లిఘి జమాత్ మతపరమైన సమావేశం నిజాముద్దీన్(న్యూఢిల్లీ)లో జరిగిందిʹ. ప్రభుత్వం, పిఎస్సిల మీద ప్రజాగ్రహం పెల్లుబికిన తరువాత దానిని సరిదిద్దారు. అయితే ఆ తప్పును సరిదిద్దినప్పటికీ, ప్రభుత్వం అసలు రంగును ఇది బహిర్గతం చేసింది.
దీపక్ పట్ల జరిగిన దురదృష్టకర సంఘటన పరోక్షంగా ఇస్లామిక్ శైలిగా పరిగణించబడని గడ్డము/దుస్తుల శైలిని అనుసరించాలని చెబుతోందా? పొడవాటి గడ్డం ఉండకూడదా? వ్యక్తిగత భద్రత కోసం భారతీయులు ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించే ద్వేష చిహ్నాలను, పట్టీలను, దారాలను ధరించాలా? పోలీసుల లాఠీ, తుపాకుల నుండి తప్పించుకోవడానికి ఈ హిందుత్వ ఉపకరణాలు, శైలి భారతీయులకు సహాయపడవచ్చు. చర్మం రంగు, గడ్డం లేదా తలపాగా/టోపీ ధారణ వల్ల ముస్లింగా భావించిన నాస్తికులతో సహా అనేకమంది ముస్లిమేతరులు కూడా ప్రపంచవ్యాప్తంగా లక్ష్యం గావించబడుతున్నారు. దీపక్‌ను ముస్లిం అని పోలీసులు ఎలా పొరబడ్డారు? అతని ఆకృతి, అతని గడ్డం పోలీసులకు ముస్లింలా కనిపించింది.
వాస్తవానికి ఫ్యాషన్ ప్రపంచంలో ఇస్లామిక్ గడ్డం లేదా శైలి అని ప్రత్యేకంగా ఏమీ లేదు. పొడవాటి గడ్డం, మీసాలు లేని గడ్డం, తెలుపు/ఆకుపచ్చ దుస్తులు ఉన్న వ్యక్తులను ముస్లింలుగా అనుకునేట్లు సమాజం చేస్తుంది. ఆర్ఎస్ఎస్, ఇస్లామ్ వ్యతిరేక దేశాలు వారిని ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రిస్తాయి. సంఘ్‌పరివార్ సృష్టించిన ఈ భావన ఉదారవాద ముస్లింల మనస్సులను కూడా భ్రష్టుపట్టించడంలో విజయవంతమైంది.
అఫ్జల్ గురు దుస్తుల శైలి, గడ్డం చిత్రాలను RSS అందుకోసం ఉపయోగించింది. అలాగే కేరళలో వలె, ఇస్లామోఫోబియాను ప్రచారం చేయడానికి అబ్దుల్ నాసర్ మదాని ఫోటోలు, నలుపు స్కల్ క్యాప్, గడ్డం ఉపయోగించారు. జాతీయవాదం, ఉగ్రవాదాలను ఎదుర్కోవడంలాంటివి ఇతివృత్తంగా వుండే సినిమా కథల్లో విలన్లను అదే విధంగా చిత్రీకరిస్తారు, కాబట్టి పిల్లలు కూడా వీటిని జీర్ణించుకొంటారు. భారతీయ విద్యావ్యవస్థలో ఇది ఒక భాగంగా మారింది. అందువల్ల సమాజం అలాంటి పోలికలు వున్నవారిని ఉగ్రవాదంతో జోడిస్తుంది. భారతదేశంలో ఎవరైనా ముడతలుపడ్డ ముదురు రంగు, ముఖ్యంగా ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించి, దువ్వుకోని జుట్టు, పొడవాటి గడ్డం, కళ్ళజోడు, మామూలు చెప్పులను వేసికొని వుంటే వారిని మావోయిస్టు లేదా దళితులతో జోడిస్తారు.
ముస్లింల పట్ల వున్న ద్వేషం కోవిడ్ 19 గత్తర కంటే మరింత ఎక్కువగా వారిని భయపెడ్తుంది. కోవిడ్19 వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఖైదీలను విడుదల చేస్తూంటే, భారతదేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం గత్తరను ఎదుర్కోవడమూ, పేదలకు ఆర్థిక సహాయం అందించడానికి బదులు ముస్లిం కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, పండితులు, మేధావులు, ప్రొఫెసర్లతో జైళ్లను నింపడంలో తలమునకలై వున్నది. కోవిడ్19 వ్యాప్తికి కారకులని భారత దేశంలోని మొత్తం ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని నిందించారు. ప్రపంచంలోని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశాలు వైరస్‌కు కారణమని చైనాను నిందించాయి.

భారతదేశంలో ఆర్ఎస్ఎస్, దాని తొత్తులు హిందుత్వ గత్తరను వ్యాప్తి చేసిన తరువాత ముస్లింలు శారీరక, మానసిక దాడులకు గురవుతున్నారు, సామాజికంగా ఒంటరిగా ఉన్నారు. లవ్ జిహాద్ మాదిరిగానే, ముస్లింలను కించపరచడానికి ఆర్ఎస్ఎస్ "కరోనా టెర్రరిజం" అనే కొత్త పదాన్ని కూడా ఉపయోగిస్తోంది. చాలా మంది ముస్లిం అమ్మకందారులను హిందూ పరిసరాల్లోకి వెళ్ళకుండా నిరోధించారు. బిజెపి నాయకులు కొనుగోలు చేయవద్దని చెప్పడంతో ముస్లింల యాజమాన్యంలోని దుకాణాలను కొంతమంది బహిష్కరించారు.

ఈశాన్య ఢిల్లీలో RSS హింసాత్మక దాడుల నుంచి బయటపడిన, ప్రత్యేకించి ఆ సముదాయాన్ని కోవిడ్ 19వ్యాప్తికి కారణం అనే నిందకు గురి చేసిన తరువాత ముస్లింలు న ఊహించలేనంత భయోత్పాతానికిగురయ్యారు. ఈశాన్య భారతీయులకి చైనా ప్రజలతో శారీరక పోలికలు వుండడం వల్ల వారిపై భౌతిక దాడులు చేశారు. ఆర్ఎస్ఎస్ - డోనాల్డ్ ట్రంప్‌ల ముస్లిం- చైనీయుల పట్ల గల వ్యతిరేక భావాలు (జెనోఫోబియా- ఇస్లామోఫోబియా) కూడా కోవిడ్ 19 తో పాటు వ్యాపించాయి. కోవిడ్ 19 గత్తర పెట్టుబడిదారుల వల్ల సంభవించిందనీ, గ్యాస్ చాంబర్లతో కాక, రెచ్చగొట్టబడ్డ ద్వేషంతో మారణహోమం జరిగిందనే వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. భవిష్యత్తులో వేధింపులనుంచి తప్పించుకోడానికి ముస్లింలం కాదని రుజువు చేసుకోవాలని తాపత్రయ పడటానికి బదులుగా, ఇస్లాంమత వ్యతిరేక ద్వేషానికీ (ఇస్లామోఫోబియాకి) హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మనమందరం పోరాడాల్సి వుంది.
-రెజాజ్ ఎం. సైదీక్
(aroraonline.com సౌజన్యంతో)
(రెజాజ్ ఎం. సైదీక్ రాసిన ఈ వ్యాసాన్ని తెలుగు అనువాదం చేసింది పద్మ కొండిపర్తి)
(న్యాయవాది దీపక్ పై దాడి తర్వాత...ముస్లిం అనుకొని కొట్టామని పోలీసులు చెబుతున్నది పైన వీడియోలో వినండి)

Keywords : madhyapradesh, deepak bundel, Lawyer, police, attack, hindutva,
(2024-04-21 20:10:47)



No. of visitors : 1087

Suggested Posts


ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..

ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు...

హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం

బ‌స్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం

లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియా

ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya Pradesh

Extending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants....

దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రి

ఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య....

బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై దుర్మార్గం - అర్ద నగ్నంగా నిలబెట్టిన పోలీసులు

మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో స్థానిక బీజేపీ శాసనస‌భ్యుడు కేదార్‌నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోపంతో ఆయన ఆదేశాలతో పోలీసులు 8 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. వాళ్ళందరినీ అర్దనగ్నంగా డ్రాయర్లమీద పోలీసు స్టేషన్ లో నిలబెట్టి ఫోటోలు తీశారు. దారుణంగా అవమానించారు. వారిపై అక్రమ కేసు బనాయించారు.

ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు

ప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....

Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు

మధ్యప్రదేశ్ ,ఖార్‌గోన్‌లో పోలీసు కస్టడీలో ఓ ఆదివాసీ యువకుడిని తీవ్ర‌ చిత్రహింసలు పెట్టి, హత్య చేసినందుకు నిరసనగా వేలాదిమంది ఆదివాసీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన‌ ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనం

వ్‌ ప్రభాకర్‌ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్

దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం కోరినందుకు 33 ఏళ్ల దళిత సమాచార హక్కు (RTI) కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హిందూత్వ