వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్


వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్

వరవరరావును

మహారాష్ట్ర జైల్లో ఉన్న విప్లవ రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఆయా సంఘాల ప్రకటనలు....

తెలంగాణ ప్రజాఫ్రంట్

మిత్రులారా! ప్రజలారా!!

భీమా కోరెగాం కేసులో అరెస్ట్ అయిన విరసం నేత, ప్రత్యేక తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, ప్రజాస్వామిక తెలంగాణా స్వాప్నికుడు వరవరరావుతో సహా తలోజ జైల్లో బందించబడిన రాజకీయఖైదీలైన సొమాసేన్, సుథాభరద్వాజ, గాంసల్వెస్ మహేష్రావత్ ,సురెంద్ర, గౌతమ్ నవలఖా,ఆనంద్,రోనా, అరుణ్ ఫెరిర,సుదీర్ దావలే లను భేషరతుగా విడుదల చేయాలి. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్., ప్రజాస్వామిక తెలంగాణా పధ నిర్దేశకుడు జి. ఎన్. సాయిబాబ తొంభై శాతం వికలాంగుడు. నాగపూర్ జైలులో అనేక విధాలైన అనారోగ్య సమస్యలతో చావును నిరాకరిస్తూ ఏళ్ళ తరబడి బ్రతుకు నీడుస్తున్నాడు. తీవ్రమైన ఎండల కారణంగా అండా సెల్ లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వార్తలు వస్తున్నాయి. వీరంతా పెద్ద వయసు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి అరెస్ట్ అయ్యే నాటికి వీరంతా గౌరవ వ్రుత్తులలో ప్రజా సంబంధాలతో జీవనం సాగిస్తున్నవారే.ప్రస్తుతం కోవిడ్ 19 వైరస్ సమస్య ప్రపంచ దేశాలన్నిటినీ తీవ్ర ఆందౌళనకు గురిచేస్తున్నది. జైళ్లలో పెరిగిన ఖైదీల సంఖ్య కారణంగా ,ఇరుకు గదుల్లో భౌతిక దూరం పాటించడం, శుభ్రత నియమాలను పాటించడం కష్ట సాధ్యం.ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా, రాజకీయ ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలి. లేదంటే ఖైదీలను అనారోగ్య కారణాలతో తాత్కాలికంగా నైనా బెయిల్ పై విడుదల చేయాలి. ఒక రకంగా వారి జీవించే హక్కును కాపాడి, రాజ్యాంగం కల్పించిన పౌరహక్కు పరిరక్షణ కల్పించినట్లు అవుతుంది.
గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కుటుంబ సభ్యుల విన్నపాన్ని సుమోటోగా స్వీకరించి, రాజకీయ ఖైదీల విడుదలకు సహకరించాలని విన్నపం. పౌరసమాజం, బుద్ధిజీవులు,ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీలు, రాజకీయ ఖైదీల విడుదలకు వీలైనన్ని రూపాల్లో చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
--- రాష్ట్ర కమిటీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్.

పౌరహక్కుల సంఘం, తెలంగాణ, పత్రిక ప్రకటన

వరవరరావు, జి.ఎన్. సాయిబాబా మరియు ఇతర రాజకీయ ఖైదీలను లను విడుదల చేయాలి...

గత మూడు సంవత్సరాలుగా నాగపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, గత ఏడాదిన్నరగా పూణే, ముంబై తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావు మరియు ఇతర రాజకీయ ఖైదీలను వెంటనే బెయిలుపై లేదా పెరోల్పై విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

90% అంగవైకల్యంతో, 18 రకాల అనారోగ్య సమస్యలతో, తన దైనందిన పనులు కూడా చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో సాయిబాబా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. తన తల్లి హైదరాబాదులోని సోదరుని ఇంట్లో క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న దని, పెరోలు ఇవ్వాలని నాగపూర్ కోర్టులో వేసిన పిటిషన్ను, సోదరుని ఇల్లు కంటెన్ మెంట్ జోన్ లో ఉన్నదని కొట్టివేసింది. వాస్తవంగా అతని ఇల్లు కంటెంట్మెంట్ జోన్ లో లేకున్నా ప్రభుత్వం, పోలీసులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. కదలలేని స్థితిలో ఉన్న సాయిబాబాకు జైలు అధికారులు సహాయకులుగా ఎవరిని నియమించలేదు. ఇప్పటివరకు అందిన ఇద్దరు ఖైదీల సహకారం కూడా అందని పరిస్థితుల్లో అనేకసార్లు జైల్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. రెండు రోజుల క్రితం సాయిబాబా తన సహచరి వసంతకు ఫోను చేసి తన వేళ్ళను వంచి వస్తువులను పట్టుకోలేకపోతున్నానని, మూడు సార్లు ఛాతీ నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లలేదని, తాను త్వరలో చనిపోయేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదని విలపించాడు.

ఎనభై ఒక్క సంవత్సరాల వయసుతో శ్వాసకోస, బ్లడ్ ప్రెజర్ సంబంధిత జబ్బులతో బాధపడుతున్నానని, కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తనకు బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని వరవరరావు వేసిన పిటిషన్ను ముంబై కోర్టు కొట్టివేసింది. ముంబైలో అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వలన జైలులోని ఖైదీలకు కూడా సోకి కొందరు చనిపోయారు అని తెలిసింది. వరవరరావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు, హాస్పిటల్కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చిన కారణంగా, సంబంధిత లాయరు జైలు అధికారులకు ఫోన్ చేయగా ఎలాంటి జవాబు లేదు. కరోనా సమయంలో ములాఖథ్లు రద్దు చేయబడిన కారణంగా ఎలాంటి సమాచారం జైలు నుండి లభించుట లేదు. వరవరరావు కూతుర్లు మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, తమ తండ్రిని విడుదల చేయాలని కోరారు.

తెలంగాణలోని యావత్తు ప్రజలు... వరవరరావు, సాయిబాబాల ఆరోగ్య పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో, అట్టడుగు ప్రజల హక్కుల కొరకు దశాబ్దాలపాటు శ్రమించిన ఈ ఇద్దరిని వెంటనే బెయిలు లేదా పెరోల్పై విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,పౌరహక్కుల సంఘం తెలంగాణ.

2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.

27-5-2020,బుధవారం.
హైదరాబాద్

OPDR

భీమా కొరె గావ్ కుట్ర కేసు మిష తో UAPA క్రింద అరెస్ట్ చేసిన మిత్రులు వరవరరావు, ఆనంద్ తేల్తుంబ్డె, గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్ తదితరులను వెంటనే బెయిల్/పెరోల్ పై వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు కు ఓపిడిఆర్ విజ్ఞప్తి- సి.భాస్కరరావు,ఛైర్మన్,కేంద్ర కమిటీ,ఓపిడిఆర్.

నిర్బంధ వ్యతిరేక వేదిక, తెలంగాణ

వరవరరావు జి.ఎన్. సాయిబాబా లను విడుదల చేయాలి
ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలి

గత మూడు సంవత్సరాలుగా నాగపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను, గత ఏడాదిన్నరగా పూణే, ముంబై తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావును వెంటనే బెయిలుపై లేదా పెరోల్పై విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక డిమాండ్ చేస్తున్నది.

90% అంగవైకల్యంతో, 18 రకాల అనారోగ్య సమస్యలతో, తన దైనందిన పనులు కూడా చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో సాయిబాబా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. తన తల్లి హైదరాబాదులోని సోదరుని ఇంట్లో క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న దని, పెరోలు ఇవ్వాలని నాగపూర్ కోర్టులో వేసిన పిటిషన్ను, సోదరుని ఇల్లు కంటెన్ మెంట్ జోన్ లో ఉన్నదని కొట్టివేసింది. వాస్తవంగా అతని ఇల్లు కంటెంట్మెంట్ జోన్ లో లేకున్నా ప్రభుత్వం, పోలీసులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. కదలలేని స్థితిలో ఉన్న సాయిబాబాకు జైలు అధికారులు సహాయకులుగా ఎవరిని నియమించలేదు. ఇప్పటివరకు అందిన ఇద్దరు ఖైదీల సహకారం కూడా అందని పరిస్థితుల్లో అనేకసార్లు జైల్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. రెండు రోజుల క్రితం సాయిబాబా తన సహచరి వసంతకు ఫోను చేసి తన వేళ్ళను వంచి వస్తువులను పట్టుకోలేకపోతున్నానని, మూడు సార్లు ఛాతీ నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి కూడా తీసుకు వెళ్లలేదని, తాను త్వరలో చనిపోయేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదని విలపించాడు.

ఎనభై ఒక్క సంవత్సరాల వయసుతో శ్వాసకోస, బ్లడ్ ప్రెజర్ సంబంధిత జబ్బులతో బాధపడుతున్నానని, కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తనకు బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని వరవరరావు వేసిన పిటిషన్ను ముంబై కోర్టు కొట్టివేసింది. ముంబైలో అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వలన జైలులోని ఖైదీలకు కూడా సోకి కొందరు చనిపోయారు అని తెలిసింది. వరవరరావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు, హాస్పిటల్కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చిన కారణంగా, సంబంధిత లాయరు జైలు అధికారులకు ఫోన్ చేయగా ఎలాంటి జవాబు లేదు. కరోనా సమయంలో ములాఖథ్లు రద్దు చేయబడిన కారణంగా ఎలాంటి సమాచారం జైలు నుండి లభించుట లేదు. వరవరరావు కూతుర్లు మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, తమ తండ్రిని విడుదల చేయాలని కోరారు.

తెలంగాణలోని యావత్తు ప్రజలు... వరవరరావు, సాయిబాబాల ఆరోగ్య పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో, అట్టడుగు ప్రజల హక్కుల కొరకు దశాబ్దాలపాటు శ్రమించిన ఈ ఇద్దరిని వెంటనే బెయిలు లేదా పెరోల్పై విడుదల చేయాలని, ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కోరుతున్నది.

ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్
ప్రొ. జి.లక్ష్మణ్, యo. రాఘవాచారి, ఎస్.అనిత, కె. రవిచందర్...కో-కన్వీనర్స్

ఇండియన్ జర్న్లిస్ట్స్ యూనియన్

వరవరరావును విడుదల చేయండి
ఐజేయూ,టీయూడబ్ల్యుజె

దాదాపు ఏడాదిన్నర కాలంగా అండర్ ట్రయిల్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజా కవి, రచయిత వరవరరావును వెంటనే తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పీసీఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు సంయుక్త ప్రకటనలో కోరారు 80ఏళ్ల వయస్సున్న వరవరరావును దాదాపు 18 నెలలుగా అండర్ ట్రయల్ పేరుతో జైల్లో బంధించడం అప్రజాస్వామిక చర్యగా భావిస్తున్నాం. కుటుంబ సభ్యులు కూడా ఆయనను కలుసుకోలేని వాతావరణం కల్పించడం, కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలకు కూడా అవకాశం కల్పించక పోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. క్షీణిస్తున్న వరవరరావు ఆరోగ్యాన్ని జైలు సిబ్బంది పట్టించుకోకపోవడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు ఉన్న విషయాన్ని పాలకులు మరచిపోవడం సహించ రానిదన్నారు. ఆయనను పూణే నుండి ముంబై జైలుకు తరలించడంతో అక్కడ కరోనా పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. మరోవైపు 70ఏండ్ల వయస్సున్న వరవరరావు భార్య అనారోగ్యంతో బాధపడు తుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, వరవరరావు కూతుళ్ళ విజ్ఞప్తి మేరకు, మానవతా దృక్ఫతంతో ఆయనను తాత్కాలిక బెయిల్ పై లేదా పెరోల్ పై విడుదల చేయాలని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)

విప్లవ కవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలి TUWJ(TJF): సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉంటూ పేద ప్రజలు, పీడిత ప్రజల పక్షాన నిలిచి, ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలబడి, రచనలు చేస్తున్న కవి, రచయిత వరవరరావు పై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. అండర్ ట్రయిల్ పేరుతో వరవరరావు ను 18 నెలలుగా జైలులో పెట్టి కుటుంబ సభ్యులను కూడా కలనివ్వకపోవడం రాజ్యాంగం ప్రకారం ఖైదీలకు ఉన్న హక్కులను హరించి వేయడమే. 80 ఏళ్ల వయస్సు ఉన్న వరవరరావు ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన భార్య కూతుర్ల విజ్ఞప్తి మేరకు, జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వమే జారీ చేసిన COVID-19 నిబంధనల ప్రకారం అయినా ముంబై జైలులో ఉన్న వరవరరావు ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ-TJF) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు,TUWJ హైద్రాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యోగనంద్, యార నవీన్ కుమార్, తెంజు హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి.సంపత్ లు డిమాండ్ చేశారు.

వరంగల్ రచయితల సంఘం

వరవరరావును వెంటనే విడుదల చేయండి.

మహారాష్ట్రలోని తలోజా జైల్లో నిర్భందించిన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవరరావు ఇన్ ఫెక్షన్ సోకి అనారోగ్యానికి గురైనట్లు మరియు అతను ఉన్న జైల్లోనే
కరోనా వైరస్ కోవిడ్ -19 తోఒకరు మృతిచెందినారని తెలిసినప్పటినుండి వారి కుటుంబ సభ్యులు ,బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, వరవరరావు అనారోగ్యం మరియు కోవిడ్ -19 తో మరణాలు సంభవిస్తున్నందున మానవతా దృక్పథంతో వెంటనేవిడుదల చేయించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకువరంగల్ రచయితల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

—నల్లెల్ల రాజయ్య .అధ్యక్షులు.
వరంగల్ రచయితల సంఘం.

పౌర స్పందన వేదిక‌


వరవరరావు,సాయిబాబా లను వెంటనే విడుదల చేయండి.

మహారాష్ట్రలోని నాగపూర్, తలోజా జైలల్లో నిర్భందించిన ప్రొ. సాయిబాబా, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవరరావు ఇన్ ఫెక్షన్ సోకి అనారోగ్యానికి గురైనట్లు మరియు అతను ఉన్న జైల్లోనే
కరోనా వైరస్ కోవిడ్ -19 తో
ఒకరు మృతిచెందినారని తెలిసినప్పటినుండి వారి వారికుటుంబ సభ్యులు ,బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు,

వరవరరావు అనారోగ్యం,సాయిబాబా అనారోగ్యంతో పాటు వారి పరిస్థితి ని దృష్టి లో పెట్టుకోవాలి. మరియు కోవిడ్ -19 తో మరణాలు సంభవిస్తున్నందున
జీవించే హక్కులో భాగంగా వెంటనే
విడుదల చేయించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోంది.
-పౌర స్పందన వేదిక, వరంగల్

Keywords : clc, haragopal, varavararao, maharashtra, taloja jail,
(2020-07-14 12:43:30)No. of visitors : 325

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


వరవరరావును