వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ


వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ

వరవరరావు

వరవరరావు విడుదల కోసం వినతి

శైలేశ్ గాంధీ, ఎం శ్రీధరాచార్యులు,
మాజీ కేంద్ర సమాచార కమిష్నర్లు

శ్రీ ఉద్ధవ్ థాక్రేగారికి
గౌరవ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై
ముఖ్యమంత్రి గారూ
శ్రీ వరవరరావును మానవత్వపు విలువల ఆధారంగా విడుదల చేయాలని మీకు ఈ మెయిల్ ద్వారా పంపిన వినతి పత్రం.
మేం ఇద్దరం మాజీ కేంద్ర సమాచార కమిష్నర్లం, మీకు ఒక వినతి చేస్తున్నాం. 80 సంవత్సరాల వృద్ధులు, కవి, పాత్రికేయుడు, అధ్యాపకుడు శ్రీ పెండ్యాల వరవరరావు 18 నెలలుగా జుడిషియల్ నిర్బంధంలో ఉన్నారు. భీమా కొరెగాం లో ప్రధానమంత్రి మోదీని హత్యచేయడానికి ప్రయత్నించారని ఆయన మీద ఆరోపణ చేశారు.
సాక్ష్యధారాలు లేవు
పుణె పోలీసులు, రాష్ట్ర దర్యాప్తుబృందాలు 16 వారాల పాటు దర్యాప్తు చేసినా ఈ ఆరోపణకు సంబంధించి ఒక్క సాక్ష్యం కూడా లభించలేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత దర్యాప్తులో వరవరరావు తదితరులపై సాక్ష్యాలు దొరకలేదని వారిపై దర్యాప్తును త్వరలో ముగిస్తామని కూడా తెలియజేశారు, కాని ఈలోగా ఎన్ ఐ ఎ జాతీయ దర్యాప్తు సంస్థ మీరు కేసు మూసేయకుండా అడ్డుపడి, తమ చేతిలోకి తీసుకున్నది. ఎన్ ఐ ఎ దర్యాప్తు లో కూడా కొత్తగా నేరాన్ని రుజువు చేసే ఆధారాలు ఏమీ దొరికినట్టు కనిపించడం లేదు.

రాజ్యాంగ సమస్య
శాంతి భద్రతలు అనే అంశం కేవలం రాష్ట్రాలకు సంబంధించినది. రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాల మధ్యఅధికారాల విభజన ప్రకారం, రాష్ట్రం కోరితే తప్ప ఈ అంశాన్ని కేంద్రం తీసుకోవడానికి వీల్లేదు. అయినాకేసు పరిశోధనను తము తీసుకోవడం అంటే రాష్ట్ర అధికారాన్ని కేంద్రం లాగేసుకోవడమే అవుతుంది. అది రాష్ట్రాల సొంత అధికారానికి సార్వభౌమత్వానికి, ఫెడరిలిజానికి సంబంధించిన ఉల్లంఘన అవుతుంది. కనుక రాజ్యాంగ పరంగా, ఆచరణాత్మకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకన్న మహారాష్ట్ర పోలీసులే స్థానిక దర్యాప్తులను నిర్వహించడానికి ఎక్కువ సమర్థులు.
చట్టపరమైన అంశాలు
నేరం నిస్సందేహంగా రుజువయ్యే వరకు నిందితుడు అమాయకుడని కోర్టులు భావించాలనేది సార్వజనీన న్యాయ పాలనా సూత్రం. సాక్ష్యాధారాలు లేవనే కారణంపైన కూడా వరవరరావును నిర్దోషిగా విడుదలచేయవలసిన అవసరం ఉంది. అయితే లాంఛనంగా తుది తీర్పు కోర్టులో వెలువడితేనే అది సాధ్యం. తీర్పుకోసం ఎంతకాలం ఎదురుచూడాలో తెలియదు. నేరం రుజువు చేయవలసిన బాద్యత, భారం ప్రభుత్వం పైనే ఉంటుంది. ఆరోపణ నిజమనే సాక్ష్యాలు లేనపుడు నిందితులను వదిలి పెట్టవలసిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. నిజానికి రాష్ట్ర పోలీసులు చాలా కాలం దర్యాప్తు చేశారు. కాని ఆ నేరమే ఆయన చేయనపుడు సాక్ష్యాలు ఎక్కడనుంచి వస్తాయి. బందీగా ఉన్న నిందితుడిపై సాక్ష్యం లేనపుడు బెయిల్ పై విడుదల చేయాలని చట్టాలు తీర్పులు చెబుతున్నాయి. ఇది చట్టపరమైన స్థితి.
వాస్తవ పరిస్థితులు
80 ఏళ్ల వయసులో, అనేకానేక అనారోగ్యాలు వేధిస్తూ ఉంటే, హైదరాబాద్ లో భార్య పిల్లల మధ్య సాధారణ జీవితం గడిపే నిరాడంబరమైన అధ్యాపకుడు, సృజన సాహిత్య మాసపత్రిక సంపాదకుడు, కవి తనకు కోర్టు ఇచ్చిన బెయిల్ ను దాటి ఎక్కడికో వెళ్లిపోతాడని ఊహించలేము. ఆ కారణం పైన వరవరరావుకు బెయిల్ ఇవ్వాల్సిందే. ఇది వాస్తవ పరిస్థితి.
మానవత్వం సంగతి
అన్నింటికన్న మానవత్వం కారణంగా ఆయనను విడుదల చేయాలి. జుడిసియల్ కస్టడీలోకి తీసుకునే ముందు చాలా రకాల అనారోగ్యసమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అర్షమొలలు, ధైరాయడ్, ప్రొస్టేట్ గ్లాండ్ విస్తరణ, కొరోనరీ ఆర్టిలరీ సమస్య, ఎసిడిటీ, మైగ్రేన్ వంటి అనేక సమస్యలు. జైల్లో మరిన్ని సమస్యలు పెరిగాయి. అకస్మాత్తుగా ఆయన కళ్లుతిరిగి పడిపోయారని తలోజా జైలునుంచి ఆయనను జెజె హాస్పటల్ కు తీసుకువెళ్లారని తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. ఆరోగ్యం అంతగా అంతలో ఎందుకు క్షీణించిందో వివరాలు వారికి తెలియలేదు. కీలకమైన శరీర భాగాలు బాగానే ఉన్నాయని హాస్పటల్ వర్గాలు ప్రకటించేదాకా వారు ఆందోళన పడ్డారు. ఈ అనారోగ్య పరిస్థితిని గమనించి, ఆయన జీవితంలో మిగిలిన కాలాన్ని ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఇవ్వడం మానవత్వం.
కోవిడ్ కారణాలు
కోవిడ్ 19 వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున జైళ్లలో రద్దీ తగ్గించి రోగవ్యాప్తిని నిరోధించడానికి గాను శిక్షపొందిన వారిని, విచారణ ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దురదృష్టంవశాత్తూ, కోవిడ్ సంక్షోభమూ, సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వరవరరావుకు ఉపశమనం కలిగించలేదు. వేలాది మంది ఖైదీలు దేశవ్యాప్తంగా విడుదలయ్యారు. ఏడు సంవత్సరాల కారాగార శిక్ష విధించవలసిన నేరాలు చేసిన వారిని కూడా తాత్కాలికంగా విడుదల చేశారు. వరవరరావు ఉన్న తలోజాజైలులో 2100 మంది కి మాత్రమే చోటుంది. కాని అందులో 3600 మంది ఉన్నారు. వృద్ధాప్యం అనారోగ్యం ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువ. ఆయనకు రోజుకు ఒక బకెట్ నీటినే ఇస్తున్నారు. రోజంతా పరిశుభ్రంగా ఉండడానికి ఈ నీళ్లు సరిపోవు. అది కరోనా ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. కనీసం కరోనా పెరగకుండా ఉండేందుకైనా వరవరరావును విడుదల చేయవలసింది. కాని కరోనా కారణం చూపి ఆయనకు రోజూ పత్రికలు నిలిపివేసారు. భార్యతో వీడియో సమావేశాలు ఆపారు. నీళ్లు తగ్గించారు. ములాఖాత్ లు రద్దు చేశారు. సమాచారం కూడా ఇవ్వడం లేదు.
సమాచార సమస్యలు
వరవరరావు ఆరోగ్యం గురించి పూర్తి సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వ లేదు. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 22 వరకు వారానికి ఒక సారి రెండునిమిషాల పాటు భార్యతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మొత్తం మూడు వారాల్లో ఆమె కేవలం ఆరు నిమిషాలు మాట్లాడగలిగారు. ఈ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యుల గురించే తెలుసుకోగలిగారు కాని తన ఆరోగ్యం గురించి వారికి చెప్పలేకపోయారు. కనుక వీరిలో ఆందోళన అధికమైంది. 29 తేదీ రాత్రి చిక్కడపల్లి పోలీసులు హేమలతా వరవరరావుగారికి ఫోన్ చేసి ఒక వాక్యం మాత్రం చెప్పారు. వరవరరావును జెజెహాస్పటల్ కు పంపారు అని.
వరవరరావు తోటి ఖైదీ ఒకరు బొంబాయి మిత్రుల ద్వారా తనకు అందిన సమాచారం ప్రకారం ఆయన 28 నాడు స్పృహ తప్పారని తెలిసిందని బావమరిది జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ చెప్పారు. అకస్మాత్తుగా హాస్పటల్ కు తరలించారంటేనే పరిస్థితి తీవ్రం అని తెలుస్తుంది. బాధ తీవ్రం కాకపోతే తలోజా జైలులోనే వైద్యులు చికిత్స చేసేవారే కదా. ఈ పరిస్థితులన్నీ కుటుంబ సభ్యుల ఆందోళన పెంచాయి.
వైద్యనివేదిక ఇవ్వరా
వరవరరావు బెయిల్ పిటిషన్ వింటున్న కోర్టులోన్యాయాధికారి ఎన్నోసార్లు ఆయన ఆరోగ్య నివేదిక ఏదీ అని అడిగారు. అందుకోసం అనేక సార్లు కేసు వాయిదా వేసారు. 29వ తేదీన వరవరరావు కళ్లుతిరిగి పడిపోయిన సమయంలోనే కేసు విచారణలో మళ్లీ జడ్జిగారు వైద్య నివేదిక గురించి అడిగారు. జూన్ రెండున ఇవ్వాలని వాయిదా వేసారు. కోర్టుకు వరవరరావు ఆరోగ్య పరిస్థితిని యథాతథంగా విన్నవించాలని నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని మేం కోరుతున్నాం. అప్పుడు వరవరరావుకు బెయిల్ దొరికే అవకాశం ఉంటుంది.
కనుక మీకు మా మనవి ఏమంటే
1. వరవరరావును నిర్దోషిగా విడుదల చేయించండి, తుది దశ త్వరగా రాదనుకుంటే
2. బెయిల్ మీద విడుదల చేయండి,, బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించవద్దని చెప్పండి,
3. వారిని హైదరాబాద్ ఆస్పత్రికి పంపండి: లేదా
4. వారి కుటుంబ సభ్యులను రాష్ట్రం దాటి వరవరరావును కలిసేందుకు అనుమతించండి. లేదా
5. కుటుంబ సభ్యులకు వారితో వీడియో ద్వారా మాట్లాడే అవకాశం కల్పించండి.
6. ఆయన వైద్య పరీక్షలు, చికిత్స వివరాలు పూర్తిగా వెల్లడి చేయండి.
7. పోలీసు ప్రధాన కార్యాలయంలో లేదా రాష్ట్ర ఆంతరింగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉన్న కేసు ఫైళ్ల లో పరిశోధనకు సంబంధించి పత్రాలన్నీ, కేసును ఎన్ ఐ ఎ కు సమర్పిస్తూ రాసుకున్న ఫైల్ నోటింగ్స్ తోసహా అన్ని పత్రాలు ధృవీకరించి ఇవ్వండి.
8. జూన్ 2 నాడు బెయిల్ ఇచ్చేందుకు వీలుగా కోర్టులో వరవరరావు వైద్య నివేదికను సమర్పించండి.
ఈ క్లిష్ట సమయంలో మీరు మా విన్నపాన్ని సానుభూతితో పరిగణిస్తారని ఆశిస్తున్నాం, మీ
శైలేశ్ గాంధీ,
మాడభూషి శ్రీధర్ ఆచార్యులు

Keywords : varavararo, madabhushi sridhar, shailesh gandhi, uddav thakre
(2020-07-14 08:44:52)



No. of visitors : 376

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


వరవరరావు