తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు


తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు

తెలంగాణకోసం

(జర్నలిస్టు, తెలంగాణ ప్రజా స్వామిక వేదిక కన్వీనర్ బండి దుర్గాప్రసాద్ రాసిన వ్యాసం)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాజ్య నిర్బంధములో ఉన్న పీడిత ప్రజా గొంతుకలు వరవరరావు, ప్రొ.సాయిబాబా తదితర రాజకీయ ఖైధీల విడుదల కోసం ప్రతిన పూనుదాం!!

భారతదేశపు చిత్రపటం పై తెలంగాణ ఒక రాష్ట్రంగా (29వ) ఏర్పడింది.

ఎందరో అమరుల స్వప్నం, యెన్నో తరాల ప్రజల ఆకాంక్ష "ప్రజా స్వామిక తెలంగాణ" సాకారం కై మరోమారు గర్జించేందుకు సమాయత్తం అవుతున్న త్యాగాల మాగాణం తెలంగాణం.

అవునన్నా కాదన్నా... భారతదేశం లో తనను తాను విముక్తం చేసుకునేందుకు.. ఇంత నెత్తుటిని చిందించిన గడ్డ... ఇంతగా త్యాగాలను వర్షించిన ఉద్యమాల చరిత్ర గల ప్రాంతం తెలంగాణ తప్ప మరొకటి లేదేమో!

అది 1968-69 మొదలు 2014 జూన్ వరకు దాదాపు 5 దశాబ్దాల ఉద్యమం ఒక్కోసారి.. రెపరరెపలాడుతూ.. మరోసారి ఉజ్వలంగా ఎగిసిపడుతూ.. ఒకో సమయంలో మినుకు మినుకు మంటున్న సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలు పోరాడుతూ, ప్రాణ త్యాగాలు చేస్తూ, నమ్మక ద్రోహాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ చివరకు తెలంగాణ స్వరాష్ట్రంగా సాకారం చేసుకొని "ప్రజలే చరిత్ర నిర్మాతలు" అన్న సత్యాన్ని మరోసారి ఋజువు చేసారు.

ఈ వర్తమాన ఉద్యమాల పీరియడ్స్ లో రాజ్యం తో ఢీ కొని పాక్షికంగానైనా విజయాన్ని సాధిచించిన ప్రాధాన్యత గల పరిణామం తెలంగాణ రాష్ట్ర సాధన.

అది భౌగోళిక తెలంగాణ రూపంలో బడా భూస్వామ్య-దళారీ నీరంకుశ బడా బుర్జువా-సామ్రాజ్యవాద అనుకూల పరిపాలన కొనసాగిస్తూ...
ప్రజలపై మరింత క్రూరంగా నిర్బంధకాండను అమలు చేస్తున్న నేటి తెలంగాణ పొలిటికల్ సినిరియా లో "ప్రజా స్వామిక తెలంగాణ" స్వప్నం ప్రతి తెలంగాణ పౌరుడి మనస్సులో నిరంతరాయంగా జ్వలిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను ఆలోచించేందుకు, అమలు చేసే చారిత్రక నేపథ్యం లో నిలబడి వున్నాము.
మరోసారి ఉప్పొంగి ఉరకలు వేయాల్సిన తరుణం ఎరుకపర్చేందుకే ఈ జూన్ 2 ను సందర్భం ను తీసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ భౌగోళికంగా వేరుపడి ఒక రాష్ట్రంగా ఏర్పడి రాజకీయార్థిక విధానాల్లో మార్పు రాకపోతే అలాంటి ప్రత్యేక రాష్ట్రం వల్ల ప్రజలకు లభించేది ఏమీ ఉండదు. అధికారంలో ఉండే వారిలో మార్పు వచ్చి, విధానాల్లో మార్పు రాకపోతే అది ఏవిధంగా నిజమైన మార్పు కాదో మన అనుభవం ఈ ఏడేండ్ల పొద్దు తెలంగాణ లో టిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పాలన ప్రత్యక్ష అనుభవం మన కండ్ల ముందటి చరిత్రనే.
తెలంగాణ కోసం 69 ఉద్యమానికి పునాదులు వేసిన ఈ మట్టి బిడ్డ వరవరరావు ఎన్నో కల్లోల కాలం కత్తుల వంతెన పై నడుస్తూ ప్రపంచమే గర్వించదగ్గ పీడిత ప్రజల గొంతుకను ఇవాళ రాజ్యం నిర్బంధంలో చంపి వేయచూస్తున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ కుంపటి రగిలించిన ప్రొ. సాయిబాబా (1997 డిసెంబర్ 28,29 తేదీలలో అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక(అల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ AIPRF) నేతృత్వంలో వివిధ సంస్థలు పోరాటాల ఖిల్లా వరంగల్ పట్టణంల "ప్రత్యేక తెలంగాణ-ప్రజా స్వామిక ఆకాంక్షలు" పేరుతో తెలంగాణ పది జిల్లాల్లోని పీడిత ప్రజల, మొత్తం ప్రాంత మౌలిక సమస్యల సాధనకు 60 ప్రజా డిమాండ్లను రూపొందించి "వరంగల్ డిక్లరేషన్" ప్రజాస్వామిక తెలంగాణ సాధన ద్వారానే అన్యాయానికి, దోపిడీకి చరమ గీతం పాడుదాం అని పోరాట బాటలు వేసిన సాయిబాబా ఇవాళ జీవిత ఖైదు గా చావును నిరాకరిస్తూ మృత్యువుకు దగ్గర అవుతున్నాడు. తెలంగాణ ఉద్యమ కారులు,మహిళా ఉద్యమ కార్యకర్తలు న్యాయం అడుగడమే నెరమైపోయింది. వీళ్ళందరు ఇవాళ వివిధ జైళ్ల నిర్బంధంలో వున్నారు. మరో 90 మంది ప్రజా స్వామిక తెలంగాణ ఉద్యమ కారుల పై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి మెడ పై కత్తి ని వెలాడకట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంలో బాగంగా "తెలంగాణ లో, పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన" ఎలా జరుగుతున్నదో తెలంగాణ సమాజం మరింతగా దుంకభారితానికి కారణాలు వెతికి ప్రజాస్వామిక తెలంగాణ సాధించేందుకు ప్రత్యామ్నాయ లను ఆలోచించేందుకు, అమలు చేసేందుకు ప్రజాస్వామిక తెలంగాణ సాధనే ద్వేయంగా పనిచేస్తున్న పోరాడే బిడ్డలము ఈ రాజ్య అణచివేత కు వ్యతిరేకంగా విశాల ప్రజా స్వామిక ఉద్యమాల నిర్మాణం తో ప్రతిఘటించడమే ఈ ఫాసిస్టు వ్యవస్థ లో మనందరి కర్తవ్యం.

బండి. దుర్గాప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్
కన్వీనర్
తెలంగాణ ప్రజా స్వామిక వేదిక
మొబైల్: 6303375514

Keywords : telangana, varavararao, saibaba, kcr
(2020-07-14 04:20:02)No. of visitors : 304

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


తెలంగాణకోసం