ఈ వ్యవస్థకి కప్పిన ముసుగుని ఇక తొలగించాల్సిందే...ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ప్రకటన
అమెరికాలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించడం అంటే ఈ వ్యవస్థకున్న ముసుగుల్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించడమేనని ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత పాండమిక్ కోవిడ్ -19 పెట్టుబడిదారీ విధానం యొక్క ఆత్మహత్యా సదృశ్యమైన పోకడలను బహిర్గతం చేసిందని స్పష్టం చేశారు. "నల్లజాతి వాళ్ళ ప్రాణాలు కూడా విలువైనవే" అనే సాధారణ నినాదం వెనుక నిరసనలు జరుగుతున్న ఈనాటి సందర్భం చరిత్రలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మితవాదుల ఆలోచనలు, వారి దురాగతాలు, మితవాదం శాఖలు ఎంత దూరంగా వ్యాప్తి చెందాయనడానికి, ఎంత కూపంలాగా తయారయ్యి సకల మానవ సమాజ స్వరూపాన్ని ఎంత దారుణంగా కూల్చి పడేస్తున్నాయో ప్రస్తుత పరిస్థితి నగ్నంగా ఎత్తి చూపుతోంది. అలాగే ఈ మితవాద భావాలకు, కార్యకలాపాలకు రాజకీయ కోణంలో ఎంత అంగీకారం ఉందో, ఏవిధంగా అవి ప్రపంచ జన బాహుళ్యం లోకి చొచ్చుకెళ్తున్నాయో కూడా ప్రస్తుత ఆందోళన తెలియజేస్తుందని ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ప్రకటించింది.
ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది మొదటి నెలలో ఏర్పడింది. 2025 నాటికి యూరోప్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ మరియు శాండర్స్ సంస్థ రక్షణే ధ్యేయంగా ఏర్పడింది. శాండర్స్ సంస్థ అనేది బెర్నీ శాండర్స్ కుటుంబ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన ఒక ప్రగతిశీల ఆలోచనల నమోదు కేంద్రం. 2015 లో గ్రీస్ మాజీ ఆర్ధికమంత్రి యానిస్ నరౌ ఫకీస్, క్రొయెషియా తత్వవేత్త ష్రెక్కో హోర్వాట్ లు స్థాపించారు. కౌన్సిల్ సభ్యులైన దాదాపు పది దేశాలకు చెందిన ప్రసిద్ధి వ్యక్తులు ఈ ప్రకటనపై సంతకాలు పెట్టారు. ప్రముఖ భాషావేత్త నోమ్ ఛామ్ స్కీ, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన వ్యవస్థాపకులు అరుణా రాయ్, నిఖిల్ దేవ్, టర్కిష్ నవలా రచయిత ఏస్ టెమాల్కురాన్, బొలీవియా మాజీ ఉపాధ్యక్షుడు అల్వారో గార్షియా లినేరా, మెక్సికన్ కళాకారుడు గేల్ గార్షియా బెర్నాల్, బ్రెజిల్ మాజీ విదేశాంగ మంత్రి సెల్సో ఆమోరిన్, గ్యాటిమాలా కు చెందిన అంతర్జాతీయ మానవహక్కుల న్యాయవాది రెనేటా క్రివిలా, జర్మనీ కి చెందిన పర్యావరణ పరిశోధకులు కరోలా రాకెట్, యూకే పార్లమెంట్ సభ్యుడు జాన్ మెక్ డోనెల్, ఈక్వెడార్ మాజీ మంత్రి ఆండ్రస్ ఆరజ్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ప్రధాన సమన్వయ కర్త డేవిడ్ ఎడ్లర్, టర్కీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ గౌరవాధ్యక్షుడు ఎర్త్ గుల్ క్కుర్యు, అర్జెంటీనా మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎలిజబెత్ గోమెజ్ ఆల్ కార్టా తదితరులు ఉన్నారు.
ఆ ప్రకటన పూర్తి పాఠం..
--------------------------
ఒక కొత్త సంఘీభావ పోరాటం ఉవ్వెత్తున నడుస్తోంది. లాస్ ఏంజెల్స్ నుంచి సావో పావ్ లో దాకా, మినియా పోలీస్ నుంచీ లండన్ దాకా.. "నల్లజాతి వాళ్ళ ప్రాణాలూ విలువైనవే " (Black lives matter) అనే పిలుపు బిగ్గరగా, ఇప్పుడు ప్రపంచం అంతటా వినబడుతోంది. ఈ ఉద్యమ సందేశంలో ఉన్న గొప్ప బలం...ʹ నల్లజాతి వారిని వారి ఇళ్లదగ్గర కానీ, వీధుల్లో కానీ, సముద్రం మీదుగా వారు తమ సురక్షిత ప్రాంతాలకు వెళ్లే దారిలో కానీ వారిని చంపకూడదు ʹ అనేదే. ఇంత సరళంగా కనిపిస్తున్నా, అందులోని మౌలిక మార్పు మాత్రం... వర్ణ వివక్ష పునాదులపై నిలబడ్డ రాజ్యానికి పెద్ద దెబ్బగానే ఉంటుంది. సామాజిక సంఘటిత ఉద్యమాలకి ఆమాత్రం స్థానం ఇవ్వడం అనేది కూడా తెల్లదురహంకారుల పునాదులకి పెను ముప్పే. గడిచిన దశాబ్దం రెండు విధాలుగా భీతి గొలిపే మలుపుల్ని చూసింది. తన ప్రజలపైనే పెద్ద ఎత్తున దాడులకు దిగడం.. ఒక పెద్ద సంఖ్యలో అధికార వర్గాలు అంతర్జాతీయ సహకారాన్ని తమ దేశానికీ.. రాష్ట్రాలకీ మధ్య స్థాయికి దిగజార్చడం, ఇంకా ఏనాటి నుండో వస్తున్న వేళ్లుపాతుకుపోయిన మన నేల, మన రక్తం లాంటి జాతీయ వాదాల స్థాయికి దిగజార్చడం చేస్తున్నారు. వివిధ సామాజిక సమూహాల పైన నిఘా పటిష్టం చేస్తూ, వారి కదలికల్ని నియంత్రిస్తూ వాటిపై మిలటరీదే ఆధిపత్యం చేస్తూ వస్తున్నారు. కోవిడ్ - 19 పాండమిక్ సందర్భంలో.. మనల్ని మరింతగా తలుపుల వెనకాలకి నెట్టివేసి, మరింతగా మనల్ని ఏకాకుల్ని చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ భయం మనకి మనమే సైన్యానికి ఇవ్వబడిన అత్యధిక అధికారాల్ని మనపై శాశ్వతం చేసేలా తయారు చేస్తోంది.
ప్రపంచం నలుమూలలా నిరసన పోరాటాలు వెల్లువెత్తుతున్నాయి. అంతటా అలుముకున్న దారిద్య్రం, అభద్రత, పోలీసుల నిరంకుశత్వం, నిరుద్యోగాలకు నిరసనగా చిలీ యువత శాంటియాగో వీధుల్లోకి పెద్దఎత్తున వచ్చింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ముస్లిం వ్యతిరేక కార్యక్రమాల్ని నిరసిస్తూ లక్షలాదిమంది ప్రజలు పోరాడుతున్నారు. లెబనాన్ లో ప్రజలు సుదీర్ఘమైన లాక్ డౌన్ ని బద్దలుకొట్టి మౌలిక వనరులైన ఆహారం, నీరు, ఆరోగ్యం, విద్య ల కోసం రోడ్లపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో నిరసనలు మరలా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమం అంతా .. అమెరికా ప్రపంచ ప్రజల ముందు ఊదరగొట్టే తన దేశ గొప్పతనం అంతా ఒట్టి డొల్ల అని మరోమారు చూపెట్టింది. అవినీతి, అసహనం, వర్ణ వివక్ష, స్థానిక ఆదివాసీ తెగలపై అమలు చేసిన హత్యాకాండ.. ఇవ్వన్నీ కూడా " అమెరికా దేనికీ మినహాయింపు కాదు " అని ఆ దేశపు డొల్లతనాన్ని బయటపెట్టాయి. ఈ స్థితి ముందుముందు అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలుకొట్టి , ఆ దేశంలోని వలసల్ని రద్దుచేసి... అనేక ధృవాల ప్రపంచం దిశగా దారితీయవచ్చు.
ఆందోళనలు తలెత్తాయి కానీ అవి ఏ దిశలో ముందుకెళ్తాయో నిర్దిష్టంగా చెప్పలేము. ఏదైనా సరే.. ఒక అడుగు ముందుకే పడింది. అయితే ట్రంప్ ట్విట్ చేసినట్లు.. ఈ నిరసనాల్ని శాంతిభద్రతల కోణంలోకి లాగి, కుదించి వాటిని ఈ ప్రతీఘాత ప్రభుత్వాలూ, వ్యవస్థలూ అత్యంత క్రూరంగా అణచివేయగలవు అన్నది మనం మరువకూడదు. ఈ నేపథ్యంలో ఈ పోరాటాల్ని మరింతగా సంఘటిత పర్చడం మన కర్తవ్యం. అప్పటికప్పుడు సమస్యలని ఆధారం చేసుకొని పెద్దఎత్తున లేచిన పోరాటాల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, అంతర్జాతీయ సమీకృత సంఘీభావ పోరాటాలుగా మలచాలి. వ్యవస్థీకృతమైన వర్ణ వివక్ష, జాతి వివక్ష, రాజ్య హింసలను ఏ మూలలో మిగిలినా సరే వాటిని పట్టించి అమెరికా పోలీసులు, ఆయా ఫాసిస్ట్ ప్రభుత్వాలు చేస్తున్న మానవ హక్కుల హననాల్ని కట్టడి చేయాలి. ఆయా దేశాల్లోని జైళ్ల వ్యవస్థ, సైన్యం యొక్క అపరిమిత అధికారాలు, అవి చేస్తున్న అరాచకాలపై మరింతగా మనం దృష్టి పెట్టి వాటిని నిలవరించాలి.
ఈ లక్ష్యాలతోనే ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. సంఘీభావం అనేది కేవలం నినాదప్రాయం మాత్రమే కాకూడదు. ఆమ్ స్టార్ డామ్, ఆక్లాండ్ లాంటి నగరాల్లో జరుగుతున్న ప్రదర్శనలు అమెరికా ప్రభుత్వానికి.. ప్రపంచం అంతా తనని గమనిస్తుందనే సంకేతాలను బలంగా పంపగలిగాయి. కానీ కేవలం సాక్షులుగా మిగలడం ఇక ఏమాత్రం సరిపోదు. దేశాల సరిహద్దుల్ని దాటి సంఘీభావ పోరాటాలు చేపట్టగలగాలి. ప్రపంచంలోని వేలాది ప్రదేశాల్లో అసమానతలపై తలపడి పోరాటం చేస్తున్న ప్రజా పోరాట శ్రేణులకి ఒక అర్ధవంతమైన మద్దతు కూడగట్టడమే మన ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ వేదిక లక్ష్యం.
దీని అర్థం.. రాజ్య హింసకు వ్యతిరేకంగా వివిధ సమూహాల ప్రజలు చేస్తున్న పోరాటాల నుంచి పరస్పరం నేర్చుకోవడం. ఉదాహరణకు లెబనాన్ పోరాటకారులు యావత్తు అమెరికా ప్రజలకి పోరాటాల్లోని మెళకువల్ని నేర్పిస్తే ఎలావుంటుందో ఊహించండి. దీని అర్ధం సాధ్యమైన చోట వనరుల్ని సమకూర్చడం. పోలీసుల హింసల్లో బాధితులకు, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించడంలో మన పాత్ర ఎక్కడ, ఎలా ఉండాలో గుర్తించి తద్వారా వారికి న్యాయం అందేలా మనం చూడాలి. అన్ని రకాల సంఘీభావాలూ ఓకేలాగా ఉండవు. చాలా మేరకు ప్రధానంగా అక్కడ జరుగుతున్న రాజ్యహింసను బహిర్గతం చేయడం. ఏవో నామమాత్రంగా ప్రజలు చేయగలిగే ఆందోళనా కార్యక్రమాల్ని కనీసం చేయగలిగేలా చూడడం లాంటివైనా చెయ్యాలి. మినియా పోలీస్ నగరంలోని పోలీసులకు నిధులు ఆపేయడం అనే డిమాండ్ ని సాధించగలిగితే.. యూరోపియన్ యూనియన్ లోని దేశాలు మధ్యధరా సముద్ర ప్రాంతం మొత్తంగా నిఘాను పర్యవేక్షిస్తు ఘోరమైన చర్యలకు పాల్పడుతున్న యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఆధారటీ కి ఇస్తున్న నిధుల్ని ఆపివేయమనే డిమాండ్ ని ముందుకు తీసుకురావచ్చు. అమెరికా సొంత పద్దతైన మైనారిటీ సమూహాల్ని నిలబెట్టి వొళ్ళంతా తడిమి తనిఖీ చేయడం వంటివి ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ విస్తరించింది. ఈ అమానవీయ చర్యని ఎక్కడికక్కడ పోరాటాల ద్వారా అడ్డుకోవాలి. దాన్ని ఆత్మగౌరవ పోరాటంగా పెద్దఎత్తున ముందుకు తీసుకురావాలి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసహన పరిస్థితుల్లో ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ వేదిక ఈ గొలుసులో ఉన్న ప్రతీ అంశాన్ని పట్టి పరిశీలించడం, ఈ పోరాటాల్లో ప్రాణాల్ని బలిచ్చిన కార్యకర్తల కుటుంబాల్ని , భాధితుల్ని సమీకరించడం, వారి మనో వేదనని వినడం, పోరాడుతున్న శ్రేణులతో కలిసి పనిచేస్తూ ఆయా ప్రభుత్వాల క్రూరత్వానికి వేసివున్న ముసుగుని తొలగించి ప్రపంచ ప్రజల ముందు నిలబెట్టడం కర్తవ్యంగా తీసుకుంటుంది. దుర్బేధ్యమనుకున్న అమెరికా సామ్రాజ్యవాదానికి చెందిన ఇటుక ఇటుకనూ తొలగించి, దాని వద్ద దాచుకున్న నిధుల్ని ఒక్కొక్క డాలరు డాలరునూ బయటకు లాగడం, ఒక్కో పోలీస్ వ్యవస్థనూ దేనికి దాన్నే వేరుచేసి చావు దెబ్బ కొట్టడమే ఇప్పుడు మనముందున్న లక్ష్యం.
(ఉపోద్ఘాతం, ప్రకటన తెలుగు అనువాదం మోహన సుందరం)
Keywords : usa, progressive international, america, blacks live matter
(2024-03-06 20:44:23)
No. of visitors : 545
Suggested Posts
| 20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores ItIn one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored.... |
| సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతిసౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు.... |
| ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు..... |
| చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూఅమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది. |
| After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres.... |
| ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ |
| మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండిఅమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్లజాతీయుడైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన చౌవిన్‌తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు. |
| Paris Museum Displays Beheaded AfricansThere is a museum in Paris with 18 000 human heads of people killed by the french colonial troops and missionaries. Itʹs called Musee d Histoire Naturelle de Paris. |
| అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావుమహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు..... |
| అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియాప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా... |