5 హక్కుల సంఘాల ప్రకటన:వరవరరావు, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి!


5 హక్కుల సంఘాల ప్రకటన:వరవరరావు, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి!

5

విప్లవ కవి వ‌రవరరావు, ప్రొఫెసర్ GN సాయిబాబాలతో పాటు భీమా కోరేగావ్ కుట్ర కేసులో నిర్బంధించబడ్డ 10 మంది మేధావులను మరియు రాజకీయ ఖైదీలను విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ హక్కుల సంఘాలైన CLC, CLMC, HRF,OPDR, PUCL లు ఈ రోజు (6,జూన్,2020 శనివారం) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విడుదల చేసిన ప్రకటన...‌

ప్రజాస్వామిక ఆలోచనలను, భావ వ్యక్తీకరణను, నిరుపేదలు, ఆదివాసీలు, దళితులు, మహిళలపై ప్రతినిత్యం కొనసాగుతున్న వేధింపులను వ్యతిరేకించడాన్ని, ప్రశ్నించడాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమాత్రమూ సహించట౦ లేదు. సంఘాలు ఏర్పరుచుకుని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఏ చిన్న ఆందోళనలనైనా అనేక ఆంక్షలతో నిరోధిస్తున్నారు. ప్రజా ఉద్యమాల కార్యకర్తలను, ప్రజాస్వామిక ఆకాంక్షలకు, ప్రజల జీవన పరిస్థితులు మార్పు కోసం కట్టుబడి పనిచేసే మేధావులను, ప్రజాస్వామిక వాదులను అక్రమకేసుల్లో ఇరికించి, కటకటాల వెనక్కి నెట్టేసి వాళ్ళ ఆరోగ్యాలను, వయసును, కోవిడ్-19 పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోకుండా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.

గత మూడేళ్లుగా ప్రొ. జి.ఎన్. సాయిబాబా జీవిత ఖైదీగా అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక, ఒంటరిగా, కదలలేని అంగవైకల్యంలో తోడ్పడే సహాయకులు లేక, క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లిని కనీసం ఒకసారి చూసే అవకాశం లేక ఒంటరి సెల్లో నిర్బంధంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బెయిల్ కోరినా, పెరోల్ కోరినా ప్రభుత్వమే వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. తెలుసుకునే అవకాశాలే లేవు.

గత 18 నెలలుగా విప్లవ కవి, విరసం వ్యవస్థాపకులలో ఒకరు అయిన పి వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్నారు. తొలుత పూణే ఎరవాడ జైల్లో ఉంచారు. అటునుండి ముంబై తలోజా జైలుకు తరలించారు.80 సంవత్సరాలు పైబడిన వయసులో అసౌకర్యాల జైలులో ఒంటరి సెల్ లో ఉంచారు. వివి అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కానీ, ఫోన్ లో నైనా మాట్లాడగల అవకాశంకానీ కల్పించడం లేదు. అలాగే బీమా కోరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్న మరో పదిమంది ఖైదీల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వీరెవరికీ కోవిడ్ విపత్తు లోనైనా, అనారోగ్య పరిస్థితుల రీత్యా నైనాబెయిల్ రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటున్నది.

ప్రొ.జి.ఎన్.సాయిబాబా విషయంలో, భీమా కోరేగావ్ పేరిట బనాయించిన అక్రమ కేసు నిర్బంధితుల విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున స్పందించారు. అయినా భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామికంగా మానవీయంగా కాకపోయినా కనీసం రాజ్యాంగబద్ధంగా కూడా ప్రతి స్పందించలేదు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపా(UAPA) చట్టం తీసుకు వచ్చింది. ఆ చట్టానికి ప్రస్తుత భాజపా ప్రభుత్వం మరికొన్ని కఠినమైన సవరణలు చేర్చింది. దేశవ్యాప్తంగా ఊపా చట్టాన్ని ప్రజాస్వామికవాదులు పై, ఉద్యమకారులపై ప్రయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్ర సాధన కృషిలో క్రియాశీలంగా పనిచేసిన, తెలంగాణ రాష్ట్రంలో బాధితులకు న్యాయం కోసం గొంతు విప్పుతున్న ప్రజాసంఘాల కార్యకర్తలపై ఊపా కేసులు బనాయిస్తున్నది. 99 మంది ప్రజాసంఘాల కార్యకర్తలపై 255 కు పైగా కేసులు---ఒక్కొక్కరి పై ఒకటి, రెండు నుంచి ఐదారు కేసుల దాకా బనాయించిoది.17 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలామంది గత కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్నారు.

ప్రజాస్వామిక వాదులను అర్బన్ నక్సలైట్లుగా సంబోధించడం, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించడం, కేసులు బనాయించడం, అన్ని కేసుల్లోనూ సాధారణ విషయమై పోయింది. ప్రపంచంలో కోవిడ్-19 కలిగిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. కోవిడ్-19 బారిన లక్షలలో ప్రజలు చనిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకుండా అడ్డుకోవడం, విచారణ కాలాన్ని సైతం శిక్షాకాలంగా అమలు చేయటం జీవించే హక్కును భంగ పరచడమే.

డిమాండ్లు:

◆ పూర్తి అంగవైకల్యంతో సహాయకులు లేకుండా గడపలేని స్థితిలో ఉన్న ప్రొ. జిఎన్ సాయిబాబాను వెంటనే పెరోల్పై విడుదల చేసి, క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లిని చూసే అవకాశం, కొవిడ్-19 బారినుండి కాపాడుకునే అవకాశం కల్పించాలి.

◆ ముంబై తలోజ జైల్లో ఉన్న వరవరరావు తన కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశాన్ని తక్షణమే కల్పించాలి.

◆వరవరరావు ఆరోగ్య పరిస్థితులను, 80 సంవత్సరాలు పైబడిన వయసును పరిగణించి, తక్షణం బెయిలుపై విడుదల చేయాలి.

◆కోవిడ్-19 విపత్తు బారిన పడకుండా వరవరరావును ముంబై నుండి హైదరాబాద్ కు తరలించి, ఇక్కడి హాస్పిటల్లో చికిత్స అందించాలి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

◆ భీమా కోరేగావ్ పేరిట బనాయించిన అక్రమ కేసు నిర్బంధితుగా ఉన్న సుధీర్ ధావలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రావత్, రోనా విల్సన్, వెర్నాన్ గొన్జ్వాలెజ్, సుధా భరద్వాజ్, సోమాసేన్, అరుణ్ ఫెరేరా, ఆనంద్ తెల్ తుంబ్డే,గౌతమ్ నవలఖా లకు బెయిలు మంజూరు చేసి, విడుదల చేయాలి.

◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంఘాల కార్యకర్తలపై, ప్రజాస్వామికవాదులపై బనాయించిన UAPA కేసులను వెంటనే ఎత్తివేయాలి. నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలి.

◆ ప్రజాస్వామికమైన రాజ్యాంగబద్ధమైన హక్కులను భంగపరిచే అప్రజాస్వామిక ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

కావున పై విషయాల పై రాష్ట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా విన్నవిస్తున్నాము.

కృతజ్ఞతలతో,
హక్కుల సంఘాల ఐక్యవేదిక

CLC , HRF, OPDR, PUCL, CLMC

Keywords : varavararao, saibaba, CLC, HRF, OPDR, PUCL, CLMC
(2020-07-14 04:19:37)No. of visitors : 355

Suggested Posts


ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌

ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది.బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


5