మతం మారాడని ఓ బాలుడిని ముక్కలుగా నరికి చంపిన మతోన్మాదులు

మతం


ఓ కుటుంభం మతం మారిందన్న‌ కోపంతో మతోన్మాదులు ఓ 14 ఏళ్ళ బాలుడిని ముక్కలుగా నరికి చంపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కెండుగుడ అనే గ్రామంలో ఉంగా మద్కామి అతని కుమారుడు సమరూ మద్కామీ మూడు సంవత్సరాల‌ క్రితం క్రైస్తవ మతంలోకి మారారు. సమరూ మద్కామీ చిన్ననాడే తల్లిని కోల్పోయాడు. తండ్రీ కొడుకులు మతం మారిన నాటి నుండి పొరుగున ఉన్నవారినుండి, బైటి నుండి వచ్చే మతోన్మాదులనుండి బెధిరింపులు ఎదుర్కొంటున్నారు. కెండుగూడ గ్రామంలోని క్రైస్తవులు మతోన్మాదుల నుండి కొన్నేళ్లుగా బెదిరింపులు, వేధింపులను ఎదుర్కొన్నారు. "ఈ సంవత్సరం ప్రారంభం నుండి క్రైస్తవులపై అనేక దాడులు జరిగాయి" అని ‌ క్రైస్తవులపై దాడులకు వ్యతిరేకంగా పని చేస్తున్న సంస్థ పర్యవేక్షకుడు షిబూ థామస్ అన్నారు. ఈ దాడులు, వేధింపుల విషయంపై పాస్టర్ పుసురు బిజయ్ మల్కంగిరి పోలీస్ స్టేషన్లో కనీసం నాలుగు ఫిర్యాదులను దాఖలు చేశాడ‌ని చెప్పారాయన.
జూన్ 4 వతేదీ రాత్రి 11 గంటల సమయంలో దేబా మడ్కామీ, బుద్రా ముచాకీ, ఐతా కబాసీ, రాబూ మాడీతో సహా మరి కొందరు ఆయుధాలు పట్టుకొని వచ్చి సమరూ మద్కామీతో సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా ఇద్దరు తప్పించుకొని పారిపోయారు. ఆ దుర్మార్గులు బాలుడైన సమరూను దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్ళి చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి పాతి పెట్టారు.

ఆ తర్వాత ఆ దుండగులంతా సమురూ తండ్రి ఉంగా మద్కామిని హత్య చేయడానికి ఆయన ఇంటి కొచ్చారు. కానీ ఆయన తప్పించుకొని పారిపోయాడు. మర్నాడు ఉదయం జూన్ 5 న స్థానిక పాస్టర్ బిజయ్ పుసురు మల్కన్ గిరి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అప్పటికి సమురూ తండ్రికి గానీ, ఈ పాస్టర్ కు గానీ సమురు చనిపోయాదని తెలియదు. పిల్లవాడిని కిడ్నాప్ చేశారని వాళ్ళు కంప్లైట్ ఇచ్చారు. స్టేషన్ ఇన్‌ఛార్జి మూడు పోలీసు వాహనాలను గ్రామానికి పంపించారు. అయితే పోలీసులు వచ్చే సమయానికి నిందితులు అదృశ్యమయ్యారు. కాగా అదే రోజు (జూన్ 5 ) రాత్రి 9 గంటలకు పోలీసులు డజను మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. వారిని ఇంటరాగేట్ చేయగా సమరూ ను హత్యచేశారన్నది బైటపడింది. అతన్ని ముక్కలు చేసి ఎక్కడ పాతి పెట్టారో ఆ మాతోన్మాదులు వెల్లడించారు.

ఒక బాలుడిని ముక్కలు చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారంటే ఆ దుర్మార్గుల మనస్సులు ఎంత విద్వేషంతో నిండిపోయాయో అర్దమవుతోంది. మతోన్మాద మూకలు వాళ్ళ బుర్రలను ఎంత మలినం చేశాయో అర్దమవుతోంది. ఈ ఒక్క సంఘటనే కాదు ఒడిశాలో దశాబ్దాలుగా క్రైస్తవ వ్యతిరేక హింస జరుగుతోంది. 1999 జనవరి 1 న ఆస్ట్రేలియా మిషనరీ గ్రాహం స్టెయిన్స్ , అతని ఇద్దరు చిన్న కుమారులు ఫిలిప్ మరియు తిమోతి లను అత్యంత క్రూరంగా దహనం చేసి చంపిన చరిత్ర మతోన్మాదులది.
2008 లో క్రైస్తవులపై దుర్మార్గమైన వరుస‌ దాడులను ఆ రాష్ట్రం చూసింది. ఆ దాడులు కొన్ని నెలల పాటు కొనసాగాయి.
2019 లో క్రైస్తవులపై దాడులు, హింసకు సంబంధించిన 22 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం బాలుడైన సమరూ హత్యతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయియి. థామస్ ప్రకారం, భారతదేశంలో క్రైస్తవులపై దాడులు, హింసకు సంబంధించి మొత్తం దేశంలో ఒడిశా 10 వ స్థానంలో ఉంది.
(mattersindia.com మరియు countercurrents.org సౌజన్యంతో)

Keywords : odisha, hindu, murder, Christian teenager,
(2024-04-17 16:03:16)



No. of visitors : 1340

Suggested Posts


Successful bandh in Odisha

The bandh was convened to demand the immediate arrest of the accused for gang rape of a minor girl in Kunduli, control of violence against tribal women and a solution to the Mahanadi area. The movement of vehicles was affected in the five districts due to the bandh, according to the reports....

Maoist posters on Russian Revolution in Narayanpatna

Maoist posters resurfaced in Narayanpatna of Koraput district with the rebels appealing people to participate in the week-long centenary celebrations of the Russian Revolution from November 7-13 across the State....

మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ ‍-ఒడిశాలో అనేక చోట్ల ఎన్నికల వాయిదా

మల్కన్ గిరి, కోరాపూట్, గంజా‍ం, గణపతి, కొందమాల్ జిల్లాల్లో వందలాది గ్రామాల్లో పార్టీ ప్రచారం ముమ్మరంగాసాగుతోంది. అనేక గ్రామాల్లో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. చిత్రకొండ సమితిలోని 18 పైగా పంచాయితీల్లో, 2 జిల్లా పరిషథ్ జోన్లలో, కటాఫ్ ఏరియాలోని 9 పంచాయితీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు వేయకపోవడంతో అధికారులు అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు....

Maoist movement puts Odisha cops on toes

THE intelligence inputs on movement of a small group of Maoists in the tri-junction area of Angul, Nayagarh and Cuttack rural district, has put Odisha Police on alert. Cops have started combing operation in Angul district amid reports of Maoist movement at Satkosia-Narasinghpur border.

పోలీసు అరాచకాలను నిరసిస్తూ ఎస్పీ ఆఫీస్ ను ముట్ట‌డించిన ఆదివాసీలు

తమ గ్రామాలపై దాడులు, అరెస్టులు, స్త్రీలపై అత్యాచారాలు తక్షణం ఆపివేయాలని , కూంబింగ్ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది ఆదివాసులు ఒడీశా రాయగడ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అడవిపై ఆధారపడి జీవించే తమపై.....

Maoist posters warn informers in Odishaʹs Kalahandi district

A couple of Maoist posters appealing to the villagers not to become police informers was found at Lakhbahali near Pahadpadar village under Lanjigarh block of Kalahandi district on Thursday. The Maoists have also appealed to the locals to observe ʹSahid Divasʹ on Thursday....

Where is gau rakshaks - Vehicle in Amit Shahʹs convoy hits cow in Odisha

At a time when the incidents of lynchings in the name of ʹgau rakshaʹ are being reported from across the country, a vehicle in BJP president Amit Shahʹs motorcade hit a cow during his Odisha tour on Thursday, leaving the animal wounded and prompting a sarcastic....

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు

ఓడిశా లో ఓ బాలికపై పోలీసు స్టేషన్ లోనే ఇన్‌స్పెక్టర్ తో సహా పలువురు పోలీసులు కొన్ని రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. మార్చ్ 25 న సుందర్ గడ్ జిల్లా బిరమిత్రపూర్ లో జరిగిన ఓ ప్రదర్శనలో పాల్గొనడానికి 13 ఏళ్ళ బాలిక వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ ప్రదర్శన రద్దయ్యింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులు కూడా లేవు.

సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్

సీపీఐ మావోయిస్టు ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ దుబాసీ శంకర్ ఎలియాస్ మహేందర్ అరెస్టయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని బాయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేందర్ ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ తెలిపారు.

ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన

భారతదేశంలోని అత్యంత ఖనిజ సంపన్న రాష్ట్రాలలో ఒడిశా ఒకటి, మొత్తం దేశంలో వున్న 3,010 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వల్లో 60% ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మతం