దళితుడు ప్రేమించడం నేరమైన చోట....అగ్ర కుల యువతిని ప్రేమించినందుకు కొట్టి చంపారు


దళితుడు ప్రేమించడం నేరమైన చోట....అగ్ర కుల యువతిని ప్రేమించినందుకు కొట్టి చంపారు

దళితుడు

అగ్రకులోన్మాదులు మరో దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. తమ కుటుంభానికి చెందిన యువతిని ప్రేమించాడన్న కారణంగా విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్ అనే 20 ఏళ్ళ యువకుడిని హత్య చేశారు.
మహారాష్ట్ర పూణేకు చెందిన రేష్మా అనే మహిళకు ఏకైక కుమారుడు విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్. తండ్రి చిన్ననాడే చనిపోవడంతో రేష్మా అనేక కష్టాలుపడి కొడుకును పెంచింది. విరాజ్ చిన్న పాటి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే చదువుకునే కాలం నుండే విరాజ్ అగ్రకులానికి చెందిన కేట్ జగదీష్ అనే వ్యక్తి కూతురు ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అనేక సార్లు గొడవకు దిగారు. కూతురు చదువు మానిపించి ఇంట్లోనే ఉంచారు. అయినప్పటికి ఆ యువతి విరాజ్ తో క్రమం తప్పకుండా మాట్లాడుతోందని, కలుస్తోందని తెలుసుకున్న కుటుంబ‍ సభ్యులు ఈ నెల 7వ తేదీన విరాజ్ కు ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని పిలిచారు. అమాయకంగా యువతి ఇంటికి వెళ్ళిన విరాజ్ ను యువతి తల్లి తండ్రులు కులం పేరుతో దూషించారు. యువతి తండ్రి జగదీష్ కేట్ విరాజ్ ను దారుణంగా అవమానించారు. వెంటనే విరాజ్ అక్కడి నుండి బయిటికి వచ్చి బైక్ పై ఇంటికి వెళ్తుండగా జగదీష్ కేట్ తో సహా ఓ టెంపోలో వచ్చిన ఆరుగురు యువతి బందువులు విరాజ్ బైక్ ను ఢీకొట్టారు. విరాజ్ బైక్ నుండి కింద పడగానే ఆ అగ్రకుల మూక విరాజ్ ను చుట్టుముట్టి రాళ్ళతో, రాడ్లతో దాడి చేశారు. విరాజ్ బతిమిలాడినా వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. మొహంపై ఉమ్మేశారు. నెత్తురు మడుగులో పడి పోయిన విరాజ్ ను అక్కడే వదిలేసి పరారయ్యారు ఆ ఆరుగురు. కింద పడి ఉన్న విరాజ్ ను చూసిన స్థానికులు విరాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అదించి అతనిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. రేష్మా తన కొడుకు కోసం కన్న కలలన్నీ కల్లలు చేస్తూ 20 ఏళ్ళ నవ యువకుడు విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్ మరణించాడు. ప్రేమించిన నేరానికి నరనరాన మనువాదం నింపుకున్న అగ్రకుల మూక చేతిలో బలై పోయాడు.

తాము సహాయం కోసం పోలీసులను కోరినప్పుడు వారు వెంటనే స్పంధించలేదని విరాజ్ బందువులు చెబుతున్నారు. ఈ హత్యలో కీలక సాక్షాలను నాశ‌నం చేసే అవకాశం ఉన్నదని వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు.
విరాజ్ పై దాడి తర్వాత ఆ స్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని నాశ‌నం చేశారని విరాజ్ బందువు, ప్రముఖ దళిత కార్యకర్త రాహుల్ దంబలే అన్నారు.

ʹʹలాక్డౌన్ సమయంలో ఇది మొదటి సంఘటన కాదు. ఈ లాక్డౌన్ కాలంలో మహారాష్ట్రలో దళితులపై దాడులు పెరిగాయి, దారుణంగా హత్య చేయబడ్డారుʹʹ అని దంబలే చెప్పారు. ʹʹఔరంగాబాద్, బీడ్, నాగ్‌పూర్, ఇప్పుడు పూణే నుండి కేసులు నమోదయ్యాయి. కానీ దానిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది.ʹʹ అన్నారు దంబలే.

"మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్వంత నియోజకవర్గంలో దళితుల హత్యలు జరిగినప్పటికీ ఆయన ఒక్క‌ మాట కూడా మాట్లాడలేదు" అని దంబలే అన్నారు.

ఈ ఘటనపై విరాజన్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా వారిని రిమాండ్‌ హోమ్‌కు తరలించారు. కాగా తన కొడుకును చంపిన వారిని ఉరి తీయాలని, అప్పుడే మరోసారి ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఉంటాయని మృతుడి తల్లి రేష్మా డిమాండ్‌ చేశారు.
(huffingtonpost.in మరియు ఇతర సోర్సుల సౌజన్యంతో)

Keywords : upper cast, dalit, murder, maharashtra, pune
(2020-12-04 00:56:43)



No. of visitors : 509

Suggested Posts


దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు.

ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా....

మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే

నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

Search Engine

బీజేపీ సర్కార్ పై రైతుల పోరు ఉధృతం - డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపు
రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !
రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌
20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం
రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
more..


దళితుడు