ప్రత్యామ్నాయ గొంతు వినిపించడం నేరమా...మా నాన్నను వెంటనే విడుదల చేయాలి...నల‌మాస కృష్ణ కూతురు

తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను NIA అరెస్టు చేసింది. అనారోగ్యంతో ఉన్న కృష్ణ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉ౦డగా ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హాస్పటల్ లోకి వెళ్ళిన NIA పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అనారోగ్యంగా ఉన్నాడని అరెస్టు చేయడం కుదరదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఎనిమిది నెలలు జైల్లో ఉండి వారం రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన కృష్ణ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖమ్మంలోని ఓ ఆస్ప్త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రితో పాటు ఆస్పత్రిలో ఉన్న ఆయన కూతురు వెన్నెల తన తండ్రి అనారోగ్యం గురించి చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఈ సందర్భంగా కృష్ణ కూతురు వెన్నెల మీడియాతో మాట్లాడింది. మా నాన్న ప్రత్యామ్నాయ గొంతు వినిపిస్తున్నందుకే అరెస్టు చేశారని ఆరోపించింది. ఇప్పటికే ఆయనపై తప్పుడు ఆరోపణలతో 8 యూఎపిఎ కేసులు పెట్టారని, అన్నింటికి బెయిల్ తీసుకొని బైటికి వచ్చిన ఆయనను మళ్ళీ అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడింది. తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టడం NIA మానుకోవాలని తన తండ్రిని వెంటనే విడుదల చేయాలని వెన్నెల డిమాండ్ చేసింది.

Keywords : nalamasa krishna, khammam, vennela, NIA,
(2024-04-25 03:26:54)



No. of visitors : 1428

Suggested Posts


నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాఘవులు సార్ ది 40 ఏండ్ల పోరాట చరిత్ర. నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమం ప్రారంభ దశ నుండి పెద్ద అండ రాఘవులు సార్. ఉపాధ్యాయ ఉద్యమనాయకుడు, ఉపాధ్యాయులను ప్రజల కోసం నిలబెట్టడానికి

ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !

భిన్నాభిప్రాయాలకు స్థానంలేక పోతే ప్రజాస్వామ్యమే కాదని టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ స్టేజీల‌ మీద ఉపన్యాసాలు దంచుతాడు మరో వైపు చిన్న సభ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వది హైకోర్టు అనుమతి ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా ప్రజలను అరెస్టులు చేస్తూ సభను జరగనివ్వరు. ఇదీ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం.

బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై రెండు నుండి నాలుగు వరకు 72 గంటల జాతీయ, విప్లవ కార్మిక సంఘాల సమ్మె పిలుపునకు టి పి ఎఫ్ తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రత్యామ్నాయ