మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు


మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

మా


వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
సర్గుజా, సూరజ్‌పూర్, కోర్బా జిల్లాల్లో ఉన్న హస్డియో అరంద్ ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేసి మైనింగ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆ లేఖలో వారు వ్యతిరేకించారు. ʹʹమీరు ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడారు. స్వయం సమృద్ది గురించి మాట్లాడారు. మరో వైపు మా జీవనోపాది, జీవనశైలి, సంస్కృతిపై దాడి చేస్తున్నారుʹʹ అని లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే...
ʹʹపెసా, FRA చట్టాల ప్రకారం గ్రామ సభల ఒప్పుకుంటేనే మైనింగ్ జరగాలి కానీ గ్రామ సభల నిర్ణయం పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా బొగ్గు బ్లాకుల వేలానికి ప్రయత్నిస్తున్నారుʹʹ ఇది మీరు మాట్లాడిన ʹఆత్మనిర్భరʹకు వ్యతిరేకంʹʹ

"ఒక వైపు COVID19 తో పోరాడుతున్నాం. ఇటువంటి పరిస్థితిలో మేము మా ఇళ్ళు, భూమి కోల్పోయి నిరాశ్రయులయ్య్తే ముప్పును ఈ మైనింగ్ వల్ల ఎదుర్కొంటున్నాంʹʹ

గత వారం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జూన్ 18 న "దేశంలో మొట్టమొదటి వాణిజ్య బొగ్గు వేలం" ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో - ʹబొగ్గును తవ్వడం: ఆత్మనిర్భర్ భారత్‌కు కొత్త ఆశలుʹఅని పేర్కొంది.
"ఇది భారత చారిత్రాత్మక రోజు బొగ్గు ఉత్పత్తికి పరిమితుల సంకెళ్ళ నుండి విముక్తి కలిగించే రోజు" అని కేంద్ర బొగ్గు శాఖా మంత్రి ప్రల్హాద్ జోషి అన్నారు. ఈ బోగ్గు ఉత్పత్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతారని చెప్పారు మంత్రి.

దీనిపై ఘట్బారా గ్రామ సర్పంచ్ జైనందన్ సింగ్ పోర్టే ది వైర్‌తో మాట్లాడుతూ "మా ప్రాంతంలో ఎలాంటి మైనింగ్ వద్దు, ఎందుకంటే ఇది మన జీవనోపాధి మరియు సంస్కృతిని నాశనం చేస్తుంది."

"ఈ ప్రాంతంలోని సహజ వనరుల కారణంగా మేము ఇప్పటికే ఆత్మనిర్భర‌గా ఉన్నాము. మా పొరుగు ప్రాంతాలైన రాయగర్ వంటి ప్రాంతాల్లో చూసినట్లుగా అడవిని, మా జీవితాన్ని, సస్కృతిని నాశనం చేస్తుంది. మేము మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్నాము మరియు అనేక గ్రామసభలు ఈ విషయంలో తీర్మానాన్ని ఆమోదించాయిʹʹ అన్నారాయన.

జనవరి 2015 లో, మొదటిసారి వేలం ప్లాన్ చేసినప్పుడు, హస్డియో-అరండ్ ప్రాంతంలో బొగ్గు గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ 20 గ్రామసభలు / గ్రామ కౌన్సిల్‌లు తీర్మానాలను ఆమోదించాయి, ఆ వేలం FRA చట్టం 2006 ను ఉల్లంఘిస్తుందని గ్రామ సభలు పేర్కొన్నాయి.
ఇక‌ ముప్పు ముంచుకొచ్చిందని అక్కడి ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 9 మంది సర్పంచ్ లు మోడీకి లేఖ రాశారు.
ఈ గ్రామాలు షెడ్యూల్ 5 ప్రాంతంలో ఉన్నాయని, ఇక్కడ పెసా మరియు ఎఫ్‌ఆర్‌ఎ నిబంధనల ప్రకారం, మైనింగ్ ప్రారంభించే ముందు గ్రామసభల సమ్మతి అవసరమని సర్పంచ్‌లు లేఖలో సూచించారు.
ʹ… గ్రామసభలు గతంలో కూడా ఇటువంటి మైనింగ్‌ను వ్యతిరేకించాయి. భవిష్యత్తులో కూడా మైనింగ్ కు సమ్మతిని ఇవ్వకూడదని సంకల్పించాయి.ʹʹ

"... ఈ వాస్తవాలు మరియు గ్రామసభల నుండి నిరంతర వ్యతిరేకత వస్తున్న‌ప్పటికీ, హస్డియో అరంద్లోని 6 బొగ్గు బ్లాకులను వేలంపాటల జాబితాలో ఉంచడం మాకు ఆశ్చర్యం కలిగించింది. నిరాశ లో ముంచింది."
గ్రామస్తులు పూర్తిగా నీరు, అటవీ ఉత్పత్తులు, భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ బొగ్గు మైనింగ్ వాటిని పూర్తిగా నాశనం చాస్తుంది అని కోర్బా జిల్లాలోని మదన్‌పూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ దేవ్సే అభిప్రాయ‍ం.

"మా స్వతంత్ర జీవనానికి ఈ సహజ వనరులే ప్రధానం. డబ్బు కానీ మరేదైనా పరిహారం కానీ సహజవనరులకు ప్రత్యామ్నాయం కావు" అని దేవ్సే ది వైర్‌తో అన్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతిస్తే ఈ ప్రాంతంలోని సాగునీరు ఇచ్చే చిన్న నీటి ప్రవాహాలు ఎండిపోతాయని చెప్పారు.
Keywords : chattis garh, coal mining, narendra modi,
(2020-07-13 21:14:53)No. of visitors : 325

Suggested Posts


సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


మా