ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ‌ !

ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన వ్యక్తి. అప్రజాస్వామిక ఉపా చట్టం క్రింద అరెస్టై, ఎనిమిది నెలలుగా జైల్లో ఉండి, తీవ్ర అనారోగ్య‌ం కారణంగా బెయిల్ పై ఈ నెల 6న విడుదలయ్యాడు. జైల్లో ఉన్నప్పుడే అనారోగ్యానికి గురి అయిన కృష్ణను వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రుల్లో చేర్పించారు. శ్వాసకోస సంబంధమైన ఆస్తమా, తీవ్రమైన నడుము నొప్పితో బాధపడే డిస్క్ ప్రాబ్లం మూలంగా కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు.
ఈనెల 13న ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్ గా చేరి , చికిత్స తీసుకుంటున్న సమయంలో జూన్ 14న ఎన్.ఐ.ఏ. (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పోలీసులు అరెస్టు చేశారు. అయితే నాలుగు రోజుల వరకూ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకునేవిధంగా మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చిన కారణంగా, ఎన్ఐఏ పోలీసులు ఆ గడువు తర్వాత వెంటనే అదుపులోకి తీసుకొని జైలుకు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్యం అందక, మరింతగా ఆరోగ్య పరిస్థితి దిగజారడమే కాకుండా, కరోనా సోకే ప్రమాదం కూడా పొంచి ఉంది.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో , ఆ తర్వాత ప్రజాస్వామ్య తెలంగాణ కోసం నిరంతరం పని చేస్తూనే ఉంది. పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు రాజీలేని పోరాటం చేశారు. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగేట్లు, లా అండ్ ఆర్డర్ అంశంలో... రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ ద్వారా జోక్యం చేసుకోవటాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. ఎఫ్.అర్.బి. యం. పరిమితిని పెంచి ఆర్థిక స్వతంత్రత కల్పించాలని, జీఎస్టీ బకాయిలను చెల్లించాలని, నూతనంగా తీసుకు రాబోయే విద్యుత్ బిల్లును... ఇలా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని, ఏకపక్ష, ఆధిపత్య విధానాలను టిఆర్ఎస్ ప్రభుత్వము బాహాటంగానే వ్యతిరేకిస్తున్నది.
తెలంగాణ ప్రజల పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామిక తెలంగాణ సాకారం కావడానికి పనిచేస్తున్న టీపీఎఫ్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధానికి గురిచేయడం అప్రజాస్వామిక చర్యగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తూ నిర్బంధ వ్యతిరేక వేదిక లేఖ రాసింది. శాంతిభద్రతల అంశము రాష్ట్ర పరిధిలోనిధి కావున అనవసరమైన కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఖండించి, ఎన్ఐఏ కస్టడీ నుండి నలమాస కృష్ణను విడిపించుటకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది.

ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్

ప్రొ.జి.లక్ష్మణ్
యం.రాఘవాచారి
ఎస్.అనిత
కె.రవిచందర్
కో-కన్వీనర్లు

Keywords : telangana, NIA, nalamasa krishna, haragopal, KCR, Letter
(2024-03-10 14:15:35)



No. of visitors : 840

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముఖ్యమంత్రి