మహారాష్ట్ర సీఎంకు 14మంది ఎంపీల లేఖ‌ - వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన


మహారాష్ట్ర సీఎంకు 14మంది ఎంపీల లేఖ‌ - వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

మహారాష్ట్ర

మహారాష్ట్ర తలోజా జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న‌ వరవర‌ రావు ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన చెందుతూ ఆయనను తక్షణం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 14 మంది ఎంపీలు మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం....

భీమా కోరేగావ్ కేసులో ప్రస్తుతం తలోజా జైలులో ఉన్న 81 ఏళ్ల ప్రజా కవి వరవారా రావు ఆరోగ్యం క్షీణించడంపై పట్ల మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాము. జైళ్లలో COVID-19 ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగినట్టు ప్రతిరోజూ మేము నివేదికలను చూస్తున్నాము (మహారాష్ట్రలోని జైళ్లలో ఇప్పటికే నాలుగు మరణాలు సంభవించాయని, అవి కోవిడ్19 తోనే అని రిపోర్టులు వచ్చాయి.)
వృద్దుడైన వరవరరావుకు ఆరోగ్యం బాగా లేదని మాదృష్టికి వచ్చింది. ఆయనకు ప్రతి రోజు అనేక సార్లు వాంతులు అవుతున్నాయని వీవీ కుటుంబ‌ సభ్యుల ద్వారా తెలిసింది. అతని కుటుంబంతో వరవరరావు మాట్లాడిన ఫోన్ కాల్‌లో వరవరా రావు వాయిస్ చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నారు. రెండు వారాల క్రితం, 30 మే 2020 న అతను స్పృహ కోల్పోగా అతన్ని అదే స్థితిలో అతన్ని ముంబైలోని జెజె ఆసుపత్రికి తరలించారు. ఆయన‌ తలోజా జైలులో వైద్యుల పరిశీలనలో ఉన్నప్పుడే అతని ఆరోగ్యం క్షీణించింది. జెజె ఆసుపత్రిలో వరవార రావు ఆరోగ్య నివేదికలు ఎలక్ట్రోలైట్ డిస్ట్రపెన్సెస్ సూచిస్తున్నాయి, ఇప్పటికే అతను హార్ట్ పేషెంట్ అయినందువల్ల ఇది మరింత‌ హానికరం. అతనికి అల్సర్స్ ఉన్నాయి, అతను పూణే జైల్లో ఉన్నప్పుడే అక్కడి వైద్యులు నిర్దేశించిన విధంగా అతనికి అత్యవసర పరీక్షలు (కొలనోస్కోపీ) అవసరం. 6 నెలల తర్వాత కూడా వరవరావుకు పరీక్షలు నిర్వహించలేదు. అతను ఇంత తీవ్రమైన అనారోగ్య స్థితిలో ఉన్నందున, అతన్ని తక్షణం ఆసుపత్రికి తరలించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. జైలులో ప్రస్తుతం అందిస్తున్న‌ సంరక్షణ ఆమోదయోగ్యంగా లేదు. అతన్ని ఆసుపత్రికి తరలించడం ద్వారా అవసరమైన... అత్యవసరమైన వైద్య సహాయం అందించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
వీల్ చైర్ లేకుండా నడవలేని,90% వైకల్యం ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా హాని కలిగించే విధంగా ఉంది. అతనికి కుడా సరైన వైద్య చికిత్స అందించాలని మేము కోరుతున్నాము.

కనిమొలి కరుణానిధి
లోక్ సభ ఎంపీ(తూత్తు కూడి) ద్రవిడ మున్నేట కజగం

కోమటి రెడ్డి వెంకట రెడ్డి
లోక్ సభ ఎంపీ(భవనగిరి) కాంగ్రెస్ పార్టీ

ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ ఝా
రాజ్య సభ ఎంపీ రాష్ట్రీయ జనతా దళ్

పీఆర్ నటరాజన్
లోక్ సభ ఎంపీ(కోయంబత్తూరు) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

కేకే రాగేష్
రాజ్యసభ ఎంపీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( మార్క్సిస్ట్)

డాక్టర్ రవి కుమార్
లోక్ సభ ఎంపీ ( విల్లుపురం) విదుతలై చిరుతైగల్ కచ్చి

ఏ రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎంపీ 9మల్కాజ్ గిరి) కాంగ్రెస్ పార్టీ

ఎమ్ సెల్వరాజ్
లోక్ సభ ఎంపీ (నాగపట్టినం) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

కే సుబ్బరాయన్
లోక్ సభ ఎంపీ (తిరుపూర్) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

డాక్టర్ సుమతి తమిఝాచీ తంగ పాండియన్
లోక్ సభ ఎంపీ (చెన్నై సౌత్) ద్రవిడ మున్నేట కజగం

తిరుచి శివ‌
రాజ్య సభ ఎంపీ ద్రవిడ మున్నేట కజగం

డాక్టర్ థోల్. తిరుమా వలవన్
లోక్ సభ ఎంపీ ( చిదంబరం) విదుతలై చిరుతైగల్ కచ్చి

నలమాడ ఉత్తమ కుమార్ రెడ్డి
లోక్ సభ ఎంపీ(నల్గొండ) కాంగ్రెస్ పార్టీ

ఎస్ వెంకటేశన్
లోక్ సభ ఎంపీ (మదురై) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

Keywords : varavararao, cpi, cpm, congres, uddav thakre, maharashtra cm, uttam kumar reddy, revanth reddy, komati reddy venkat reddy
(2021-07-24 19:32:45)No. of visitors : 1106

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

Search Engine

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ
ప్రతి మనిషి జేబులో పోలీసు!
బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి
kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI
పెగసస్ వ్యవహారం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగకుండా అడ్డుకున్న‌ బీజేపీ
చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం
Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada
ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI
Naxalbari: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
పోలీసుల దుర్మార్గం - యువకుడి ఆత్మహత్య‌
సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !
ఢిల్లీలో సోమవారం మహిళా రైతుల ప్రదర్శన‌
UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు
పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు
భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు
దేశ రాజధానిలో రేపు రైతు పార్లమెంటు - అనుమతి ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
మోడీని విమర్షించినందుకు జర్నలిస్టును ఉద్యోగం నుండి తీసేసిన టీవీ ఛానల్
రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ‌
UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి
ఒక వైపు ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు... మరో వైపు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు
more..


మహారాష్ట్ర