ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ


ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ

ప్రైవేటు

జార్ఖండ్‌లోని 20 బ్లాక్‌లతో సహా 41 బొగ్గు బ్లాక్‌లను వాణిజ్య బొగ్గు తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం వేలాన్ని ప్రారంభించింది. పెట్టుబడిదారీ విధానంతో ప్రభుత్వానికి వున్న మిత్ర వైఖరిని మరోసారి బహిర్గతం చేసింది. ఇందులో విపరీతమైనదేంటంటే, ఆత్మనిర్భరానికి చొరవతీసుకోవడంగా పేర్కొంటున్న ఈ చర్య, భూ స్వంతదారుల, గ్రామసభల యాజమాన్య హక్కులను అన్నింటినీ హరించివేస్తుంది. సహజ వనరులను కార్పొరేట్ దోపిడీ చేయడానికి మరింతగా తలుపులు తెరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి జార్ఖండ్ ప్రభుత్వం మద్దతునివ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 6-9 నెలల తాత్కాలిక నిషేధాన్ని కోరిందనే వాస్తవం ఈ నిర్ణయానికి పూర్తిగా మద్దత్తునివ్వలేదనేవిషయాన్ని కూడా సూచిస్తోంది.

వాణిజ్య బొగ్గు తవ్వకాలను అనుమతించాలనే నిర్ణయం దేశీయ బొగ్గు పరిశ్రమ, మార్కెట్‌లపై కలిగించే హానికరమైన ప్రభావం ఇటీవల వెలువడిన వివిధ నివేదికలలో స్పష్టమైంది. ఏదేమైనా, భూస్వంతదారుల జీవితాలు, ఆయా ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు, పర్యావరణంపై కలిగే అసమతుల్య ప్రభావాన్ని విస్మరించడమనేది ఈ నిర్ణయంలో వున్న అత్యంత ఆందోళన కలిగించే అంశం. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల జార్ఖండ్‌పై కలిగే ప్రభావాన్ని గురించి చర్చించడానికి జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ జూన్ 17 న నిపుణులు, సామాజిక కార్యకర్తలతో ఒక ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించింది.
జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో అధిక శాతం, ముఖ్యంగా ఆదివాసీలు వ్యవసాయం, అటవీ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన జీవనోపాధిపై ఆధారపడి ఉన్నారు. పెద్ద ఎత్తున గనుల తవ్వకం ప్రధానంగా కార్పొరేట్ ప్రయోజనాలకోసం జరిగితే కనక ప్రజల స్థితిగతులను ఏమాత్రం మెరుగుపడవు అనడానికి ఖనిజసంపద కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా వున్న జార్ఖండ్ సాక్ష్యంగా నిలుస్తుంది.

గనుల తవ్వకం, ముఖ్యంగా బొగ్గు తవ్వకాలు, పర్యావరణం, మానవాళి మీద గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోసం రాష్ట్రంలో దేశ, విదేశ కార్పొరేట్ గనుల తవ్వకం జరిపే సంస్థలకు అనుమతినిస్తేకనక ప్రజల జీవనోపాధి అవకాశాల్ని, పర్యావరణాన్ని మరింతగా నాశనం చేస్తుంది., ప్రభుత్వ మద్దతుకలిగిన గనుల తవ్వకాల కంపెనీలు పర్యావరణ క్షీణతను కట్టడి లక్ష్యంతో చేసిన చట్టాలను అన్ని రకాలుగా ఉల్లంఘిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వున్న స్వంతదారులు ఎవరో తెలియని వందలాది గనులు ఇందుకు సాక్ష్యంగా వున్నాయి.

పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు, ఆదివాసీలకు స్వపరిపాలన (ʹఆత్మనిర్భర్ʹ, "స్వావలంబన") హక్కును అందించే పేరుతో చేసిన ఈ నిర్ణయం అనేక చట్టాలు, రాజ్యాంగ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తోంది. గ్రామనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక సంస్థగా గ్రామసభను PESA చట్టం(Panchayats (Extension to Scheduled Areas) Act, 1996), ఐదవ షెడ్యూల్ లోని నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి. ఆదివాసీలు, వారి సహకార సంస్థల కావాలనుకుంటే తమ భూమిలో గనుల తవ్వకాలను చేపట్టే హక్కును సమతా తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు లోధా బెంచ్ 2013 నాటి మైలురాయి తీర్పులో ఖనిజాల యాజమాన్యాన్ని భూ యజమానులకు అప్పగించాలని స్పష్టంగా పేర్కొంది. అటవీప్రాంతాన్ని గ్రామసభకు చెందిన సమాజ ఆస్తిగా అటవీ హక్కుల చట్టం స్పష్టంగా నిర్వచిస్తుంది. వాణిజ్య తవ్వకాల కోసం బొగ్గుగనులను వేలం వేసే ప్రణాళికను గురించి సంబంధిత గ్రామసభలతో చర్చించాలని కూడా కేంద్ర ప్రభుత్వం అనుకోలేదు. వాణిజ్య దోపిడీ కోసం బొగ్గు గనుల తవ్వకాలకు అనుమతినివ్వడమనేది బొగ్గు గని కార్మికుల హక్కులను మరింతగా బలహీనపరుస్తుంది.
జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జెడిల కూటమికి మునుపటి రఘువర్ దాస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక - కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయాత్మక ఆదేశాన్ని ఇచ్చారు. అనుమతి లేకుండా తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవటానికి లేదా తమ భూమిపై గనుల తవ్వకాలను చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తమతో నిలబడుతుందని ప్రజలు భావిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా, బొగ్గు గనుల తవ్వకాల కోసం కంపెనీలు ఎటువంటి ప్రజా సంప్రదింపులు లేకుండా భూమిని స్వాధీనం చేసుకోవడానికి లేదా లీజును పొడిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అటువంటి బలవంతపు సముపార్జనకు లేదా లీజును అక్రమంగా పొడిగించడానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది.

ఏ విధమైన గని తవ్వకాలగురించి అయినా చర్చను అసలు గనుల తవ్వకాలు జరగాలని కోరుకుంటున్నారా? లేదా? అనే ప్రశ్నతో ప్రారంభించాలి. ప్రజలు, గ్రామసభలు అలా జరగాలని కోరుకుంటే కనక గనుల తవ్వకాలు, వాటి అనుబంధ కార్యకలాపాలను తామే చేపట్టడానికి భూయజమానులకు లేదా గ్రామసభలకు ప్రభుత్వం మూలధనం, సాంకేతిక సహాయాల ద్వారా సహకారాన్ని, మద్దతును ఇవ్వవచ్చు. అడవినీ, అటవీ ఆధారిత ఉత్పత్తులను నిర్వహించడంలో తమకు గల సామర్థ్యాన్ని గ్రామసభలు నిరూపించుకున్నాయి కూడా. సహజ వనరులపై సమాజం యాజమాన్యాన్ని కలిగివుండడాన్ని మహాసభ గట్టిగా విశ్వసిస్తుంది. అలాగే, వ్యవసాయ భూమిని, అడవులను ఎలాంటి మైనింగ్ కోసం ఉపయోగించకూడదు అని అభిప్రాయపడుతుంది.
ఈ రోజు, ప్రజలతో కానీ గ్రామసభలతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గనుల తవ్వకాలను కోసం బొగ్గు బ్లాకులను వేలం వేసినప్పుడు, మోడీ ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలపాలని, గనుల తవ్వకాల కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతినివ్వవద్దని బాధిత ప్రాంతాల్లోవున్న అన్ని గ్రామసభలకు మహాసభ పిలుపునిచ్చింది. మైదాన ప్రాంతాల్లో గనుల తవ్వకాల కార్యకలాపాలను వ్యతిరేకించడంలో మహాసభ ప్రజలతో కలిసి పని చేస్తుంది. వాణిజ్య గనుల తవ్వకాలను, బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన వైఖరిని తీసుకోవాలని, సహజ వనరులు, స్వపరిపాలనపై ప్రజల హక్కులను పరిరక్షించే చట్టాలను చిత్తశుధ్ధితో, అక్షరాల అమలు చేయాలని, దోపిడీ వైఖరిలేని ఒక ప్రత్యామ్నాయ దృష్టి కోణాన్ని దేశం ముందు వుంచాలని మహాసభ కోరుతోంది.

Keywords : jharkhand, coal,mines modi, atmanirbar,
(2020-07-14 04:07:40)No. of visitors : 169

Suggested Posts


0 results

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


ప్రైవేటు