అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !


అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !

అఫ్ఘ‌నిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చైర్మన్, పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మేధోవంత నాయకుల్లో ఒకరైన కామ్రేడ్ జియా తన 68 వ యేట గుండెపోటుతో అమరులయ్యారనే విషయాన్ని పార్టీ సభ్యులకు, మద్దతుదారులకు, మిగిలిన మావోయిస్ట్ పార్టీలకు, అంతర్జాతీయంగా వివిధ మావోయిస్టు పార్టీలకు, మార్క్సిస్టు - లెనినిస్ట్ - మావోయిస్టు పార్టీలకు తెలియజేయడానికి తీవ్రంగా చింతిస్తున్నాం. కామ్రేడ్ జియా అస్తమయం పార్టీకీ, దేశ శ్రామిక వర్గ పోరాట శ్రేణులకు, అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట శ్రేణులకు, విప్లవకారులకు, ఆఫ్ఘనిస్తాన్ విప్లవోద్యమానికి, అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట ఉద్యమాలయిన మా - లె - మా ఉద్యమానికీ తీవ్ర లోటుగా భావిస్తున్నాం. ఆ కామ్రేడ్ మరణం మనందరికీ తీరని గాఢ శోకాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తుందనేది నిస్సందేహంగా వాస్తవం. అయితే కామ్రేడ్ జియా అమరత్వం కలగజేసిన విచారాన్ని, బాధను, కన్నీళ్లను విప్లవోద్యమం విజయం సాధించే క్రమంలో ఒక ఉత్తేజంగా, మనల్ని నడిపించే శక్తిగా భావిస్తామని పార్టీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఆ కామ్రేడ్ మనకు చూపిన విప్లవ ఆచరణ, బాటలో పార్టీ లోని ఐక్యతను కాపాడుకుంటామని, మునుపటి లాగే ఉంటామని కేంద్ర కమిటీ యావత్తు పార్టీ శ్రేణులకూ తెలియజేస్తోంది.

కామ్రేడ్ జియా తన జీవితం యావత్తూ విప్లవ నిబద్ధతతోనే జీవించారు. ప్రజా సేవలోనే నిత్యం మెలిగారు. ఆయన తన తొలి యవ్వన సంవత్సరాలలోనే నియంతృత్వానికి వ్యతిరేకంగా విప్లవ శ్రేణుల్లో చేరారు. 1978 లో జరిగిన రాజకీయ కుట్ర, 1979 లో సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదులు దేశాన్ని అక్రమించుకోవడం దశల్లో కామ్రేడ్ జియా తన నిబద్ద కార్యాచరణతో విప్లవ శ్రేణులతోనే కొనసాగారు. 1987 లో కామ్రేడ్ జియా ప్రస్తుతం వరకూ ఆయన నేతృత్వం వహించిన విప్లవ కమ్యూనిస్టు శాఖని ఏర్పాటు చేశారు. తదుపరి ఈ శాఖనే ఆఫ్ఘనిస్తాన్ యావద్దేశానికీ విస్తరింపచేసి ʹ రివల్యూషనరీ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ʹ గా 1989 లో నిర్మించారు. కామ్రేడ్ జియా తన సహచర కమ్యూనిస్ట్ లతో కలిసి ʹ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ʹ ను 1990 లో ఏర్పాటు చేశారు. దానికి కేంద్ర కమిటీ ఛైర్మన్ గా కామ్రేడ్ జియా ని కేంద్ర కమిటీ ఎన్నుకుంది. అక్టోబర్ 7, 2001 లో అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాదులు ఆఫ్ఘనిస్తాన్ ను దూరాక్రమించుకున్న తర్వాత కామ్రేడ్ జియా నాయకత్వం లోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విప్లవోద్యమం యొక్క తక్షణ అవసరాన్ని గుర్తించి దురాక్రమణకు వ్యతిరేకంగా దేశంలోని ఐక్య మావోయిస్టు ఉద్యమానికి పిలుపునిచ్చింది. ʹ ది ఆర్గనైజేషన్ ఫర్ లిబరేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ʹ, ʹ రివల్యూషనరీ వర్కర్స్ ఎలియన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ʹ లు ఆ పిలుపుకు సంఘీభావంగా స్పందించాయి. ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలో దేశంలో కొనసాగుతున్న MLM ఉద్యమాన్ని ఐక్యం చేసి ʹకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (మావోయిస్టు) ʹ ను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన ఈ దేశవ్యాప్త విప్లవ పార్టీకి ఛైర్మన్ గా కామ్రేడ్ జియా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన పార్టీ రెండవ కాంగ్రెస్ కూడా కామ్రేడ్ జియానే మరలా ఏకగ్రీవంగా ఛైర్మన్ గా ఎన్నుకుంది.

తన విప్లవ జీవితక్రమం యావత్తూ కామ్రేడ్ జియా ఆఫ్ఘనిస్తాన్ లో విప్లవోద్యమ నిర్మాణానికి పూర్తి అంకిత భావంతో కృషి చేశారు. వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశంలో ఐక్య విప్లవోద్యమాన్ని MLM ప్రాతిపదికన నిర్మించారు. అంతర్జాతీయ మావోయిస్టు ఉద్యమంతో తన దేశ విప్లవోద్యమాన్ని అనుసంధానం చేసి ఆఫ్ఘనిస్తాన్ సమస్యలను అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చారు. మా జ్ఞాపకాల్లో, విప్లవోద్యమం పురోగమనంలో, శ్రేణులను ఉత్తేజపరిచే అన్ని దశల్లో కామ్రేడ్ జియా సజీవంగా ఉంటారు. కామ్రేడ్ జియా తన దేశ విప్లవోద్యమానికి అంకితమైన విధం, విప్లవ కార్యాచరణ యావత్తు విప్లవ శ్రేణుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మావోయిస్టు విప్లవోద్యమ నిర్మాణంలో కామ్రేడ్ జియా నిర్వహించిన పాత్రని యావత్తు ప్రపంచం స్మరించుకుంటుంది. మనల్ని మనం మరింత దీక్షగా విప్లవోద్యమానికి పునరంకితం చేసుకొని MLM వెలుగులో విప్లవాన్ని విజయవంతం చేయడమే కామ్రేడ్ జియా కి మనం ఇవ్వగలిగిన గొప్ప నివాళి. కామ్రేడ్ జియా మనకు వదిలి వెళ్ళిన గొప్ప మేధో సంపద, మేధో వారసత్వం మనకి మార్గదర్శకంగా ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన బోధనలు నిత్యమూ ఆచరణీయాలు. సామ్రాజ్యవాదులు , విప్లవ ప్రతిఘాతుకులు ఆఫ్ఘనిస్తాన్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ విప్లవోద్యమాన్ని ఊచకోతకి గురిచేస్తున్నప్పుడు, దేశ చరిత్రలోనే అత్యంత దుఃఖదాయకమైన , కటిక చీకటి మూసిన ఆ దశలో కామ్రేడ్ జియా తీసుకున్న నినాదం ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్న సామ్రాజ్యవాదులకు, వారి తొత్తులైన కీలుబొమ్మ ప్రభుత్వాలకూ దేశంలోని పీడిత శ్రేణుల నుంచీ, విప్లవ వర్గాల నుంచీ పెను సవాల్ ని విసిరింది. విప్లవోద్యమం వారిని నిలవరించగలిగింది. విప్లవ ప్రతిఘాత సంస్థ అయిన ISIS ని సైతం ధీటుగా ఎదుర్కొంది. వెనుకటి, ప్రస్తుత విప్లవ కారుల తరాల మధ్య కామ్రేడ్ జియా గొప్ప వారధి నిర్మించారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో కామ్రేడ్ జియా నిర్వహించిన పాత్ర ఆమోఘమైనది.

ఆఫ్ఘనిస్తాన్ ను మత ఛాందసుల నుంచీ, దేశీయ కాంప్రడార్ బూర్జువాల నుంచీ, సామ్రాజ్యవాదుల నుంచీ విముక్తి చేసేందుకు పీడిత వర్గ ప్రజలతో, శ్రామికులతో, కార్మిక, కర్షకులతో కార్మిక వర్గ నాయకత్వాన పొరుసలిపి విప్లవం విజయం సాధించడమే కామ్రేడ్ జియా కు మనమిచ్చే ఉత్క్రుష్టమైన నివాళి. అంతర్జాతీయ మావోయిస్టు ఉద్యమంతో కలిసి సామ్రాజ్యవాదాన్ని తుదకంటా నాశనం చేసి , అంతర్జాతీయ విప్లవోద్యమాన్ని విజయవంతం చేయడమే కామ్రేడ్ జియాలోని సిసలైన విప్లవకారుడికీ, ఆయన సృజన శీలమైన విప్లవ కార్యాచరణ కీ, ఆయన అందించిన విలువైన వారసత్వానికి నిజమైన నివాళి కాగలదు.

జోహార్ కామ్రేడ్ జియా.

ఇట్లు
కేంద్ర కమిటీ
మావోయిస్టు పార్టీ
ఆఫ్ఘనిస్తాన్
21 - 06 - 2020

(ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చైర్మన్, పార్టీ వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ జియా అమరత్వం గురించి ఆఫ్గనిస్తాన్ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటన తెలుగు అనువాదం మోహన సుందరం)

Keywords : afghanistan, maoist party, comrade jia, death. heart attack
(2020-09-13 00:39:20)No. of visitors : 324

Suggested Posts


0 results

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


అఫ్ఘ‌నిస్తాన్