మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం


మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం

మూడురోజుల

జూన్ 18 నుండి 20 వతేదీ వరకు మూడు రోజులు... 10 వేల మందికి పైగా ప్రజలు... 300 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు, 500 మంది జన మిలీషియా సభ్యులు....ఎర్ర జెండాల రెపరెపల మధ్య క్రీడా కార్యక్రమాలు...సాంస్కృతిక కార్యక్రమాలు....ఉపన్యాసాలు....

సీపీఐ మావోయిస్టు పార్టీ అద్వర్యంలో ఈ నెల 18 నుండి 20 వ తేదీ వరకు మూడురోజుల పాటు చత్తీస్ గడ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో సభలు జరిగాయని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇందులో 10 వేల మంది ప్రజలు పాల్గొన్నారని పోలీసులను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం...

మూడు రోజుల పాటు జరిగిన సభల సందర్భంగా క్రీడా పోటీలు, పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు జరిగాయి. 2019 డిసెంబర్‌లో మరణించిన దండకకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి) కార్యదర్శి రామన్నతో సహా, విప్లవ పోరాటంలో ప్రాణాలు విడిచిన‌ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ మూడు రోజుల కార్యక్రమానికి పోలీసులనుండి ఆటంకం రాకుండా 300 మంది సాయుధ‌ పీఎల్జీఏ సభ్యులు, 500 మంది జన మిలీషియా సభ్యులు రాత్రీ పగలు కాపలా కాశారు. ఈ సమావేశాలకు ప్రధానంగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ,నారాయణపూర్ జిల్లాల ప్రజ‌లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబళ్ళ‌ కేశవ రావు అలియాస్ బసవరాజు, మాండవి హిడ్మా, కోసా, దేవ్జీ, సుజాతలతో సహా అనేక మంది మావోయిస్టు నాయకులు హాజరైనట్లు అభిఙవర్గాల సమాచారం.

ʹʹఈ మూడు రోజుల సమావేశం గురించి మాకు సమాచారం అందింది. మేము దీనిని పరిశీలిస్తున్నాముʹʹ అని ఛత్తీస్గడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) డిఎం అవస్థీ హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు.
గత ఐదేళ్లలో తొలిసారిగా మావోయిస్టులు ఇంత పెద్ద బహిరంగ సభ‌ ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు బస్తర్‌లోని సీనియర్ పోలీసు అధికారులు.

ʹʹఈ సమావేశాలకు వెళ్ళిన ప్రజలను సెల్ ఫోన్లు తీసుకెళ్ళడానికి అనుమతించలేదు అందువల్ల ఈ సమావేశపు ఫోటోలు, వీడియోలు మాకు దొరకలేదుʹʹ అని ఓ పోలీసు అధికారి అన్నారు.
"ఈ సమావేశానికి హాజరైన ఒక మహిళ చెప్పిన విషయాల ప్రకారం మావోయిస్టు నాయ‌కులు మావోయిజం గురించి, బస్తర్ చరిత్ర గురించి ప్రసంగాలు చేశారని మాకు తెలిసిందిʹʹ అని ఆపోలిసు అధికారి హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధితో చెప్పారు.
ఈ ఏడాది మార్చ్ లో సుక్మా జిల్లా మిన్సా దగ్గర మావోయిస్టుల దాడిలో 17 మంది జవాన్లు చనిపోయిన సంఘటనలో మావోయిస్టులు తీసుకెళ్ళిన ఆయుధాలు ఈ సమావేశ వేదికపై ప్రదర్శించినట్టు పోలీసు అధికారులు చెప్పారు.

ʹʹసాల్వా జుడమ్ కు ముందు 2004 లో నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశానికి నేను హాజరయ్యాను. కొన్ని రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలోలో 10,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత మావోయిస్టులు మళ్లీ అలాంటి సమావేశం చేశారంటే... మావోయిస్టులు బలహీనపడ్డారనే వాదనలు చేయడం, త్వరలోనే తుడిచిపెట్టుకపోతారని అనుకోవడం ఓ కల. ఇప్పటికీ మధ్యభారతంలోని అటవీ ప్రాంతాల్లో ప్రజలు మావోయిస్టులతోనే ఉన్నారు.ʹʹ అని చత్తీస్ గడ్ కు చెందిన శాంతి కార్యకర్త శుభ్రాషు చౌదరి అన్నారు.

ఒక్క బస్తర్ ప్రాంతంలోనే 2,00,000 మందికి పైగా ప్రజలు సిపిఐ (మావోయిస్టు) పార్టీ అనుబంద సంఘాల సభ్యులుగా ఉన్నారని పోలీసుల అంచనా అని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
(hindustantimes.com సౌజన్యంతో)

Keywords : maoists, bastar, meeting, hindustan times, people,
(2020-07-14 09:08:44)No. of visitors : 1877

Suggested Posts


బస్తర్ లో భారత యుద్దం..రగులుతున్న అడవి

న్యాయభావన ఉన్న ఎవ్వరైనా అలాగే ప్రభావితమౌతారు. పోరాడుతున్న ఆదివాసీల నుండి, పోరాటానికి అండగా నిలిచిన మావోయిస్టు పార్టీ పట్ల అభిమానమేర్పడింది. మావోయిస్టు పార్టీ పోరాట క్రమంలో చేసే తప్పులను ఆమె నిర్మొహమాటంగా ఎత్తి చూపించింది. ఏ ప్రజా పోరాటానికైనా ఇలా నిజాయితీగా, నిర్భయంగా పొరపాట్లను ఎత్తి చూపే వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. ఆమె పరిశోధనా కాలంలోనే పోరాటాలని రాజ్యం

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


మూడురోజుల