హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?


హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

హక్కుల

చత్తీస్ గడ్ మానవ హక్కుల కార్యకర్త సోని సోరిని చంపాలని దంతేవాడ పోలీసులు ప్రయత్నిస్తున్నారని చత్తీస్ గడ్ లో ఆదివాసుల కోసం పనిచేస్తున్న గాంధీ వాది హిమాంషు కుమార్ janchowk.com అనే వెబ్ సైట్ లో ఓ ఆర్టికల్ రాశారు.

2012 జూన్ 28 న బీజాపూర్ జిల్లా సర్కెగూడా దగ్గర సీఆర్పీఎఫ్ పోలీసులు 17 మంది నిరాయుధులైన ఆదివాసులను కాల్చి చంపారు. అందులో 6 గురు మైనర్లు. ఎప్పటిలాగే పోలీసులు ఎన్ కౌంటర్ కట్టుకథలు అల్లి చనిపోయింది సాయుధమావోయిస్టులని ప్రకటించారు. అయితే ఈ సంఘటనపై ఆదివాసులు, హక్కుల కార్యకర్తల పోరాటం ఫలితంగా ప్రభుత్వం విచారణ కమిషన్ నియమించగా ఆ 17 మందివి హత్యలేనని వాళ్ళంతా నిరాయుధులైన స్థానిక ఆదివాసులే అని కమిషన్ తన రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ హత్యలు చేసిన సీఆర్పీఎఫ్ పోలీసులపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
కాగా ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.
దంతె వాడలో ఆమె ఇంట్లో నుండి బైటికి రావడానికి వీలు లేదంటూ 2 రోజుల నుండి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆమెకు నోటీసులు పంపిస్తున్నారని హిమాంషు తెలిపారు. నిన్న(జూన్ 28) దంతేవాడ‌ పోలీసు అధికారి వ్యాపారస్తులను, టాక్సీ యజమానుల‌ను స్టేషన్ కు పిలిచి సోనీ సోరోకి టాక్సి అద్దెకు ఇవ్వొద్దని, ఎటువంటి సహాయం చేయొద్దని బెదిరించారు. ఈ రోజు(29 జూన్) ఉదయం నుండి సోనీ సోరీ ఎక్కడికి వెళ్తే అక్కడికి నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో పోలీసులు వెంబడిస్తున్నారు. అలా వెంబడిస్తున్న వాహనం ముందుకు వెళ్ళిన సోనీసోరీ "రండి, నన్ను చంపండి, చావడానికి నేను సిద్ధంగా ఉన్నానుʹʹ అంటూ పోలీసులకు సవాల్ విసరడంతో వాళ్ళు వాహనాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయారు.

పొరుగున ఉన్నబీజాపూర్లో స్తూపం నిర్మిద్దామని భావిస్తున్న దాదాపు 10 వేల మంది ఆదివాసులు వచ్చి ఉన్నారు. వాళ్ళు సోనీ సోరీ కోసం ఎదిరి చూస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సోనీసోరీ అక్కడికి వెళ్ళకుండా అన్ని రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. కానీ అణచివేత మరియు బెదిరింపు ఎప్పుడూ గెలవదని ప్రభుత్వం మరియు పోలీసులు అర్థం చేసుకోవాలిఅని హిమాంషు తన ఆర్టికల్ లో స్పష్టం చేశారు.

Keywords : chattis garh, sonisori, tribals, fake encounter, crpf
(2020-08-08 19:22:21)No. of visitors : 344

Suggested Posts


సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Search Engine

ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


హక్కుల