దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు


దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు

దేశంలో

భారత దేశంలో రోజుకు 5గురు పోలీసు కస్టడీలో చనిపోతున్నారని . 2019 సంవత్సరంలో 1,731 మంది కస్టడీలో మరణించారని ʹనేషనల్ క్యాంపెన్ అగేన్స్ట్ టార్చర్ʹ శుక్రవారంనాడు విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ ʹది హిందూʹ పత్రిక ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం 2019 లో 1,606 జ్యుడిషియల్ కస్టడీలో, 125 మంది పోలీసు కస్టడీలో మరణించారు.

"పోలీసు కస్టడీలో మరణించిన‌125 మందిలో, ఉత్తరప్రదేశ్ 14 మరణాలతో అగ్రస్థానంలో ఉంది, తమిళనాడు మరియు పంజాబ్ ల‌లో 11 మరణాలు, బీహార్ లో10 మరణాలు, మధ్యప్రదేశ్ లో తొమ్మిది,గుజరాత్ లో ఎనిమిది, ఢిల్లీ, ఒడిశాలలో ఏడుగురు చొప్పున , జార్ఖండ్6,ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లలో ఐదు చొప్పున, ఆంధ్రప్రదేశ్, హర్యానాలలో 4 చొప్పున, కేరళ, కర్ణాటక , పశ్చిమ బెంగాల్ 3 చొప్పున, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ , మణిపూర్ రెండు చొప్పున, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ త్రిపుర ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

పోలీసు కస్టడీలోమరణించిన‌ 125 మందిలో 93 మంది (74.4%) హింస కారణంగా మరణించగా, 24 (19.2%) మంది అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు, ఇందులో ఆత్మహత్య (16), అనారోగ్యం (7) మరియు గాయాలు ( 1)కారణంగా మరణించారని పోలీసులు తేల్చారు. మరో ఐదుగురి (4%) మరణానికి కారణాలు తెలియవని నివేదిక తెలిపింది.

"2019 లో పోలీసులు ఉపయోగించిన చిత్రహింస పద్ధతుల్లో శరీరంలో ఇనుప చువ్వలు జొప్పించడం (బీహార్‌కు చెందిన గుఫ్రాన్ ఆలం మరియు తస్లీమ్ అన్సారీ), కాళ్లపై రోలర్ వేయడం , కాల్చడం (జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రిజ్వాన్ అసద్ పండిట్), ʹఫలాంగాʹ, దీనిలో పాదాల మీద విపరీతంగా కొడతారు (కేరళకు చెందిన రాజ్‌కుమార్), కాళ్లు విస్తరించి, ప్రైవేట్ భాగాలలో కొట్టడం (బ్రిజ్‌పాల్ మౌర్య మరియు హర్యానాకు చెందిన లీనా నర్జినారి) ʹʹఅని ఎన్‌సిఎటి డైరెక్టర్ పరితోష్ చక్మా అన్నారు.

పోలీసులు ఇతర హింసా పద్దతులను కూడా ఉపయోగిస్తారు. అవి... ఎలక్ట్రిక్ షాక్, పెట్రోల్ పోయడం లేదా మిరపకాయను ప్రైవేట్ భాగాల్లో జొప్పించడం, బేడీలు వేసి కొట్టడం, సూదులతో శరీరంలో గుచ్చడం, వేడి ఇనుప రాడ్తో వాతలు పెట్టడం, నోటిలో మూత్ర విసర్జన చేయడం, గట్టిగా మొద్దుబారిన వస్తువును ప్రైవేటు భాగాల్లోకి చొప్పించడం. , చేతులు మరియు కాళ్ళు కట్టి తలక్రిందులుగా వేలాడదీయడం, ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేయడం, పటకారుతో వేళ్ళ‌ గోళ్లను నొక్కడం, బాధితుడు రెండు చేతుల, కాళ్ళను రెండు టేబుళ్ళకు కట్టేసి ఇనుప రాడ్లతో కొట్టడం, గర్భిణీ స్త్రీలను పొత్తికడుపుపై తన్నడం.

NCAT యొక్క విశ్లేషణ ప్రకారం కస్టడీలో మరణించిన‌ 125 మందిలో 75 (60%) పేద మరియు అట్టడుగు వర్గాలకు చెందినవారని వెల్లడించింది. వీరిలో 13 మంది దళిత, గిరిజన వర్గాలకు చెందినవారు, 15 మంది ముస్లింలు ఉండగా, 35 మంది చిన్న, చిన్న‌ నేరాలకు పాల్పడ్డవారు. వారిలో ముగ్గురు రైతులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక కార్మికుడు, ఒకరు చెత్తను ఏరుకునేవారు, మరోకరు శరణార్థి.

పోలీసు కస్టడీలో మహిళలపై లైంగిక హింసతో సహా అనేక రకాల హింసలు జరుగుతాయి. ఇలా హింసలకు గురయ్యే బాధితులంతా ఎక్కువగా బలహీన వర్గాలకు చెందినవారే అని, 2019 లో పోలీసు కస్టడీలో కనీసం నలుగురు మహిళలు మరణించినట్లు ఎన్‌సిఎటి తెలిపింది.

Keywords : custodial deaths, india, police, dalit, st, muslims, women
(2020-07-14 03:01:39)No. of visitors : 184

Suggested Posts


రాక్షస పోలీసులు.... దళిత మహిళను నడి రోడ్డు మీద బట్టలూడదీసి కొట్టారు

తమ ఇంట్లో దొంగతనం జరిగింది చర్య తీసుకోండంటూ వచ్చిన ఓ దళిత కుటుంభంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో సునీల్ గౌతమ్

డేరింగ్ కానిస్టేబుల్ !

ఆ కానిస్టేబుల్ సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే ! అతను 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. అందుకోసం ఆయన తన ప్రాణాలగురించి కూడా ఆలోచించలేదు.

వాట్సప్ అడ్మిన్ లూ... జర జాగ్రత్త !

వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్ గా ఉండటం, అందులో ఫ్రెండ్స్ అందరినీ చేర్చడం చాలా మందికి ఇష్టం. అయితే అడ్మిన్ గా ఉండటం అంత ఈజీ కాదు....

వాళ్ళు పోలీసులు....!

కొందరు తాగితే మనుషులు కాదు.... కొందరికి కోపమొస్తే మనుషులు కాదు.... కానీ వీళ్ళు యూనిఫామ్ తొడిగితే మనుషులు కాదు. వాళ్ళ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.....

యజమానురాలి అక్కసు... పోలీసుల కర్కషత్వం... ఓ యువతిపై థర్డ్ డిగ్రీ

తన ఇంట్లో పని మానేసినందుకు ఓ యజమానురాలికి పని మనిషిపై కోపమొచ్చింది. అమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది. పోలీసులేమో తమ చేయి దురద తీర్చుకునేందుకు ఓ మనిషి దొరికిందనే పైశాచికానందంలో ఆ పని మనిషిని చితకబాదారు.....

HCU విద్యార్థినులను అత్యాచారం చేస్తామని బెధిరించిన పోలీసులు - నిజ నిర్దారణ కమిటి రిపోర్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వర్శిటీలో నిరసనలు జరుగుతున్న వేళ, వాటిని అణచి వేయడమే లక్ష్యంగా విరుచుకుపడ్డ పోలీసులు విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరించారని, యువతులను ఇష్టానుసారం....

మృత దేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన పోలీసులు !

సీసీ ఫుటేజ్ ద్వారా బయట పడ్డ బీహార్ పోలీసుల అమానుషత్వం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బీహార్ వైశాలి జిల్లాలో గల గంగానదిలో తేలిన ఓ వ్యక్తి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు బాడీని బయటకు....

మానవ మృగాలు !

కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా.. అని దీనంగా వేడుకున్నా....

హింసా రాజ్యం !

నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఒక ముసలి అతన్ని గూండాలు కర్రలతో కొట్టి చంపారు. అహమ్మదాబాద్ లో ఓ ఎనిమిదిమంది యువ గూండాలు ఓ పాన్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన....

ముఖ్యమంత్రి కోసం ఓ యువకుడి ప్రాణాలను బలి చేసిన పోలీసులు

రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న ఒక మనిషిని హాస్పిటల్ కి తరలించాల్సిందిపోయి ముఖ్య మంత్రి కాన్వాయ్ కి ఇబ్బంది కలగకుండా అతన్ని పుట్ పాత్ మీద పడేసి తమ డ్యూటీని....

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


దేశంలో