అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష


అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష

అఖిల్

మావోయిస్టు అనే ఆరోపణలతో అస్సాం గౌహతి జైల్లో ఉన్న రైతు నాయకుడు అఖిల్ గొగోయ్‌ను విడుదల చేయాలని, మరొకొన్ని తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని 12వందల మంది ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు.
అస్సాంలో క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కెఎంఎస్ఎస్) వ్యవస్థాపకుడు గొగోయ్ కెఎమ్‌ఎస్‌ఎస్‌ యువ నాయకులు బితు సోనోవాల్, ధైజ్యా కొన్వర్, మనస్ కొన్వర్‌లతో పాటు అరెస్టు చేయబడ్డాడు. వీళ్ళు జైల్లో కొచ్చి జూన్ 29 కి 200 రోజులవుతుంది. గోగోయ్ నేతృత్వంలో, ఈ యువ నాయకులు డిసెంబర్ ఆరంభంలో రాష్ట్రంలో ఉదృతంగా సాగిన‌ సీఏఏ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శకులుగా పరిగణించబడుతున్న వీరందరినీ ʹమావోయిస్టులుʹ అనే అభియోగంపై క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో అఖిల్ గొగోయ్ సహా మిగతా రైతు సంఘం నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖైదీలు నిరాహార దీక్షలు చేపట్టారు. అస్సామీ దినపత్రిక అమర్ అసోమ్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఖైదీలు జూన్ 25, 26 వ తేదీల్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. గౌహతి జైలు నుండి గోగోయ్ విడుదల సహా మరో ఎనిమిది డిమాండ్ల ను నెరవేర్చాలని ఖైదీలు కోరారు.

ఖైదీల ప్రధాన డిమాండ్లలో గొగోయ్ విడుదల సహా కరోనా వ్యాప్తి భయాందోళనలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఖైదీలను ఈ జైలుకు తీసుకరావద్దన్నది ఒకటి ఈ మేరకు జూన్ 24 న ఖైదీలు సమావేశం నిర్వహించి జైలు అధికారులకు రెండుసార్లు లిఖితపూర్వక అభ్యర్ధనను సమర్పించారు. ʹʹఅయితే, జైలు అధికారులు తమ డిమాండ్‌ను పక్కన పెట్టి కొత్త ఖైదీలను తీసుకురావడం ప్రారంభించారు. కనీసం కొత్తగా వచ్చే ఖైదీలకు COVID-19 పరీక్షలు కూడా నిర్వహించలేదు ఈ కారణంగా 1,200 మంది ఖైదీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తమను తాము రక్షించుకోవడానికి, ఖైదీలు జూన్ 25 న ఉదయం 9 గంటల నుండి నిరాహార దీక్షను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జూన్ 26 న కూడా వారు తమ సమ్మెను కొనసాగించారు. ʹʹ అని అమర్ అసోమ్ దినపత్రిక పేర్కొంది.
జైల్లో ఖైదీల ఉద్యమం తీవ్రమవడంతో అనేక మంది జైలు అధికారులు, జిల్లా అధికారులు ఖైదీలతో మాట్లాడటానికి ఖైదీల దగ్గరికి వచ్చారు. నివేదికల ప్రకారం గోగోయితోపాటు ఇతర కూడా కెఎంఎస్ఎస్ నాయకులు కూడా ఈ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. నిరాహార దీక్షలోపాల్గొన్నారు. మహమ్మారి నుండి తమను తాము రక్షించుకోవడానికి ఖైదీలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, హక్కులతో పాటు 24 గంటల స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ప్రస్తుతం షెడ్యూల్ చేసిన ʹరెండు నిమిషాలʹ సంభాషణకు మించి వారి న్యాయవాదులు మరియు కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి. మొదలైన డిమాండ్లతో రెండు రోజులు ఉద్యమం నడిచింది.
గైహతి జైల్లో జరిగిన‌ ఈ ఉద్యమంలో.. అస్సాంలో సాయుధ పోరాటం చేస్తున్న గ్రూపులు యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ లు, సిఎఎ వ్యతిరేక నిరసనకారుడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి షార్జీల్ ఇమామ్ సహా అనేక మంది హక్కుల కార్యకర్తలు, ప్రజా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

స్థానిక వార్తా పత్రికల నివేదిక ప్రకారం ʹʹగొగోయ్ కూడా ఖైదీలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కోరుతూ పదేపదే జైలు అధికారులను సంప్రదించాడు కాని అధికారుల వైపు నుండి ఎటువంటి స్పందన లేదు".

నిరాహార దీక్ష తర్వాత ఖైదీల డిమాండ్లను పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి, కొత్త ఖైదీలందరినీ 14 రోజుల జైలు ప్రాంగణంలోని ప్రత్యేక వార్డుల్లో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచడానికి అంగీకరించిన తర్వాత ఖైదీలు నిరాహారధీక్ష విరమించారని జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్ దశ‌రత్ దాస్ తెలిపారు.
(thewire.in సౌజన్యంతో)

Keywords : assom , akhil gogoi, KMSS, gouhati jail, caa, maoists
(2020-07-14 11:17:06)No. of visitors : 304

Suggested Posts


ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !

ఈనెల 3న రాష్ట్రంలోని నల్బరి జిల్లా కోయిహటాలో చెట్టుకు ఒక జెండా కట్టి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారమందించారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని జెండాపై అరబిక్‌లో రాసి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. జెండాను

లాల్ సలాం..కామ్రేడ్..లెనిన్... అంటే కేసులు !

లాల్ సలాం...కామ్రేడ్..లెనిన్...ఈ పదాలు పాలకులను ఎట్లా భయపెడుతున్నాయో అర్దమవుతోంది. ఆ పదాలు వింటేనే భయంతో వణికిపోతున్నారు. అందుకే ఆ పదాలు వాడినవారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఫేస్ బుక్ లో లెనిన్ ఫోటో అప్లోడ్ చేశాడని, లాల్ సలామ్, కామ్రేడ్ అనే పదాలు వాడాడని అస్సాం కు చెందిన బిట్టు సోనోవాల్ అనే సామాజిక కార్యకర్తపై

అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా

అసోం సామాజిక కార్యకర్త..క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి నాయకుడు ప్రస్తుతం గువహటిలో జైలులో ఉన్న అఖిల్‌ గొగోయ్‌కు కరోనా సోకిందని ఆయన తరుపు న్యాయవాది శంతను భర్తకుర్‌ గురువారం తెలిపారు.

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


అఖిల్