బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు


బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు

బొగ్గు

దేశంలో బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా జూలై2వ తేదీ నుండి 4వ తేదీ వరకు దేశవ్యాప్త బొగ్గు గని కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ విడుదల చేసిన మీడియా ప్రకటన....

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై రెండు నుండి నాలుగు వరకు 72 గంటల జాతీయ, విప్లవ కార్మిక సంఘాల సమ్మె పిలుపునకు టి పి ఎఫ్ తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్లుగానే భారత బొగ్గుగనుల రంగాన్ని సమస్తము కార్పోరేట్, పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వము సంకల్పించింది. కోల్ ఇండియా లిమిటెడ్ లోని బొగ్గు గనులను ఇప్పటికే 30 శాతం ప్రైవేట్ రంగానికి అప్పగించిన భారత ప్రభుత్వం, మొత్తంగా 100% ప్రవేటీకరిచాలని ఇటీవలే భారత ఆర్థికమంత్రి ప్రకటించారు. మొదటి దశలో సింగరేణి గనుల్లో ని 49 శాతం బ్లాగులను వేలం వేయాలని నిర్ణయించుకుని,18-6-20 న నలభై ఒక్క బ్లాగులను ప్రైవేట్ శక్తులకు అమ్మివేశారు. కరోనా సాకుతో సుదీర్ఘ కాలము పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం, పనిగంటలు 12కు పెంచడం, డిఎ ఫ్రీజ్ చేయడం, సగం వేతనాలు చెల్లించడం... లాంటి అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయపూనుకున్నారు.

ప్రత్యేకించి సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి, గనుల అభివృద్ధికి పూచీ పడతామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్౼౼ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించకుండడా, సమ్మెలో పూర్తిగా పాల్గొనకుండా తన కార్మిక వ్యతిరేక స్వభావాన్ని చాటుకుంటున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజ్ ని తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ నూతన విద్యుత్ బిల్లును తీవ్రంగా విమర్శించిన ట్లుగా... బొగ్గు గనుల ప్రైవేటీకరణను కూడా ముఖ్యమంత్రి బహిరంగంగా వ్యతిరేకించాలని టి పి ఎఫ్ డిమాండ్ చేస్తున్నది. ఓపెన్ క్యాస్ట్ లకు వ్యతిరేకంగా తానే కుర్చీ వేసుకుని ఉద్యమం చేస్తానని ప్రకటించిన కెసిఆర్, స్వయంగా 17 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులకు తవ్వకానికి అనుమతులు ఇచ్చాడు.
కేంద్ర ప్రభుత్వము నలభై ఒక్క బొగ్గుగనుల వేలాన్ని రద్దు చేయాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, 44 కార్మిక చట్టాలను స్థానంలో నూతనంగా 4 కార్మిక చట్టాలను తేవాలనే ప్రతిపాదనను మానుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు చేసే సమ్మెను జయప్రదం చేయాలని టీపీఎఫ్ విజ్ఞప్తి చేస్తుంది.

కె రవిచందర్,అధ్యక్షులు
ఏ నరసింహారెడ్డి,ఉపాధ్యక్షులు

Keywords : coal mine, privatization, strike, singareni, telangana praja front
(2020-08-09 19:01:34)No. of visitors : 164

Suggested Posts


ప్రత్యామ్నాయ గొంతు వినిపించడం నేరమా...మా నాన్నను వెంటనే విడుదల చేయాలి...నల‌మాస కృష్ణ కూతురు

ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను ఎన్ ఐ ఏ అరెస్టు చేసింది. అనారోగ్యంతో ఉన్న కృష్ణ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉ౦డగా ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హాస్పటల్ లోకి వెళ్ళిన ఎన్ ఐ ఏ పోలీసులు అరెస్టు చేశారు.

నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాఘవులు సార్ ది 40 ఏండ్ల పోరాట చరిత్ర. నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమం ప్రారంభ దశ నుండి పెద్ద అండ రాఘవులు సార్. ఉపాధ్యాయ ఉద్యమనాయకుడు, ఉపాధ్యాయులను ప్రజల కోసం నిలబెట్టడానికి

ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !

భిన్నాభిప్రాయాలకు స్థానంలేక పోతే ప్రజాస్వామ్యమే కాదని టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ స్టేజీల‌ మీద ఉపన్యాసాలు దంచుతాడు మరో వైపు చిన్న సభ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వది హైకోర్టు అనుమతి ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా ప్రజలను అరెస్టులు చేస్తూ సభను జరగనివ్వరు. ఇదీ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం.

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


బొగ్గు