CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు


CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు

CBSE

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా CBSE 9వ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు చదవాల్సిన సిలబస్ లో 30 శాతం తగ్గించింది. తొలగించిన పాఠ్యాంశాలు ఇది. సమాఖ్య తత్వం, పౌరసత్వం, లౌకికవాదం, జాతీయత, చుట్టుపక్కల దేశాలతో భారత సంబంధాలు, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షలు, మారుతున్న భారత ఆర్థిక అభివృద్ధి, ప్రణాళికా సంఘం, రద్దు, జిఎస్టి, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఫలితాలు, దేశ విభజన, రైతాంగ ఉద్యమాలు, మొదలైనవి. వీటితో పాటు వర్తమాన భారతదేశంలో అటవీ సంపద, వన్యప్రాణులు, ప్రజాస్వామ్యం, భారతదేశంలో వైవిధ్యం, లైంగికత, మతం, కులం, ప్రజా పోరాటాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్ళు. వీటితో పాటు పరిణామ వాద సిద్ధాంతం కూడా ఈ సంవత్సరం విద్యార్థులు చదవాల్సిన అవసరం లేదు.

9 వ తరగతి పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి భారత రాజ్యాంగం లోని ప్రజాస్వామ్య హక్కులు మరియు నిర్మాణం పై అధ్యాయాలు తొలగించబడ్డాయి. భారతదేశంలో ఆహార భద్రతపై ఒక అధ్యాయం ఎకనామిక్స్ సిలబస్ నుండి పూర్తిగా తొలగించబడింది.
10 వ తరగతి సిలబస్ నుండి "ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యం", "కులం, మతం మరియు లింగం" "ప్రజాస్వామ్యానికి సవాళ్లు" అనే అధ్యాయాలు తొలగించబడ్డాయి.
11 వ తరగతి పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి అధ్యాయాలలో ఫెడరలిజం, పౌరసత్వం, జాతీయవాదం , లౌకికవాదం అనే అధ్యాయాలు పూర్తిగా తొలగించబడినవి
ʹస్థానిక ప్రభుత్వంʹ అధ్యాయం నుండి ʹమాకు స్థానిక ప్రభుత్వాలు ఎందుకు అవసరం?ʹ ʹభారతదేశంలో స్థానిక ప్రభుత్వ వృద్ధిʹ అనే రెండు యూనిట్లు తొలగించబడ్డాయి.

క్లాస్ 12 పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి, "సమకాలీన ప్రపంచంలో భద్రత", "పర్యావరణం మరియు సహజ వనరులు", "భారతదేశంలో సామాజిక మరియు నూతన‌ సామాజిక ఉద్యమాలు" "ప్రాంతీయ ఆకాంక్షలు" అధ్యాయాలను పూర్తిగా తొలగించింది.

"ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి" అధ్యాయం నుండి, "భారతదేశ ఆర్థిక అభివృద్ధి యొక్క మారుతున్న స్వభావం" మరియు "ప్రణాళికా సంఘం మరియు పంచవర్ష ప్రణాళికలు" యూనిట్లు తొలగించబడ్డాయి.

భారత విదేశాంగ విధానంపై అధ్యాయం నుండి "భారతదేశ పొరుగు దేశాలతో సంబంధాలు: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక మరియు మయన్మార్" యూనిట్లు తొలగించబడ్డాయి.

తొలగించబడిన అంశాలను గమనిస్తే, కరోనా సంక్షోభ సాకును ఉపయోగించుకొని తన అసలు ఎజెండాను అమలు పరచడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని స్పష్టంగా తెలుస్తోంది.

Keywords : CBSE syllabus, Secularism, Nationalism, GST, foreign relations, chapters dropped,
(2020-08-09 12:29:01)No. of visitors : 173

Suggested Posts


0 results

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


CBSE