వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌


వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌

వివేక్

ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది పోలీసులను చంపేసిన‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేని పోలీసులు ఈ రోజు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై పోలీసులు చెబుతున్న కథనాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అది ఎన్ కౌంటర్ కాదని, కొందరు ʹపెద్దలనుʹ రక్షించడానికే వికాస్ దుబేను పోలీసులు చంపేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ దుబే గ్యాంగ్ కాల్పుల్లో మరణించిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా బావ కమల్ కాంత్ మిశ్రా దీనిపై స్పందించారు. ʹʹవికాస్ దుబేను చంపేశారు సరే ఆయన‌కు సహకరించిన రాజకీయ నాయకులతో సహా అనేక మంది సంగతి ఏంటి ? వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారుʹʹ అని ప్రశ్నించారు.
ʹʹనేను భావిస్తున్న ఏకైక న్యాయం ఏమిటంటే, ప్రస్తుతం దేవేంద్ర మిశ్రా హంతకుడు సజీవంగా లేడు అనే కారణంతో మా కుటుంబ సభ్యునికి నిర్వహించాల్సిన ఆచారాలను జరపొచ్చు. అయితే మన సమాజంలో ఒక జబ్బు ఉంది. అది ఎప్పటికి అలానే ఉంటుంది. అది ఏంటంటే వికాస్‌ దూబేకు సాయం చేసిన వారు బాగానే ఉన్నారు. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక వికాస్‌ దూబే పోతే.. అతడి స్థానంలోకి మరో పది మంది వస్తారు. దీనికి ముగింపు ఎప్పుడుʹ అని అన్నారాయన‌.

ʹʹవికాస్‌ దూబే కేసును ఇలా ముగించడం కరెక్ట్‌ కాదు. ఎన్నికల్లో అతడి సాయం తీసుకున్న రాజకీయ నాయకుల మాటేంటి. దూబే లాంటి ఒక నేరస్తుడు పోలీస్‌ స్టేషన్‌లోనే ఒకరిని చంపి.. బయటకు వెళ్లగల్గుతున్నాడంటే దానికి కారణం ఎవరు. దీని మూలాల‌ వరకు వెళ్లి పరిశీలించాలి. దూబే బతికి ఉంటే.. కనీసం కొంతమంది వైట్‌ కాలర్‌ నేరస్తుల గురించి అయినా తెలిసేది. వికాస్‌ దూబే కేసుకు ఇది సరైన ముగింపు కాదని నా అభిప్రాయం.ʹʹ అన్నాడు మిశ్రా

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ దూబే(లొంగిపోయాడని కూడా ప్రచారంలో ఉంది)ను ఈ రోజు కాన్పూర్‌కు తరలిస్తున్న పోలీసు ఎస్కార్ట్‌ వాహనం రోడ్డు మీద అదుపు తప్పి బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన వికాస్‌ గుప్తా.. పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్‌ చేశారనే కథనాన్ని వినిపిస్తున్నారు పోలీసులు.
అయితే వికాస్ దుబేను పోలీసులు తీసుకెళ్తున్న వాహనాన్ని వెంబడించిన మీడియా ప్రతినిధుల కథనం మరో రకంగా ఉంది. ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్న కారులో దుబే లేడు . దుబేను మరో కారులో తీసుకెళ్ళారు. కారులోనే చంపి బైటికి విసిరారు అని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. వికాస్ దుబేను తీసుకెళ్తున్న దారిలో ముందుగానే పోలీసులు వాహనాలన్నింటినీ నిలిపేశారు. మీడియా వాహనాలను కూడా కొద్ది దూరం తర్వాత ముందుకు వెళ్ళనివ్వలేదు. ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్న ప్రదేశంలో రోడ్డుపై ఒక్క మనిషి కూడా రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాతే ఎన్ కౌంటర్ జరిగింది.
అనేక ఏళ్ళుగా వికాస్ దుబేకు అన్ని రకాల సహకారం అందిస్తున్న రాజకీయ నాయకుల, ఇతర ʹపెద్దʹ మనుషుల విషయం బైటకు రాకుండా ఉండటం కోసమే వికాస్ దుబేను చంపేశారన్న అనుమానాలు వస్తున్నాయి.

Keywords : vikas dubay, uttarapradesh, encounter, political leaders,
(2020-08-10 00:13:05)No. of visitors : 316

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


వివేక్