గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు


గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు

గ్యాంగ్

(ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేని ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో చంపేసిన ఘటనపై పౌరహక్కుల సంఘం ప్రకటన పూర్తి పాఠం)
యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది ఎన్కౌంటర్ కాదు అది ప్రభుత్య హత్యే! ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయాలని ప్రజలు,చాలామంది ప్రజాస్వామిక వాదులు , కోరుకుంటారు. కానీ అధికార పార్టీలో ఉన్న రాజకీయ నేతలు గ్యాంగ్ స్టర్ లను పెంచిపోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనయీమ్ లాంటి వాళ్లను ఉపయోగించుకుని అధికార పార్టీ వాళ్ళు, వాళ్లకు అడ్డొచ్చిన ఉద్యమకారులను,తాము చేయాల్సిన అసాంఘిక కార్యక్రమాలను చేయడానికి లేదా హత్యలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఆ కోవలోకి చెందిన వాడే యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే. యూపీలోని అధికార పార్టీ నేతలు వికాస్ దూబేని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత నయీమ్ లాగా ఈరోజు 10జులై,2020 ఉదయాన్నే హత్య చేసింది. ఈహత్యకు ఎన్కౌంటర్ అనే రంగు పులుముతుంది. అసలు ఇది ఎన్కౌంటర్ కాదు ప్రభుత్వం కావాలని చేసిన హత్య. తెలంగాణ రాష్ట్రంలో మై హోమ్ అధినేత రామేశ్వరరావు ను ఎలాగైతే నయీమ్ హెచ్చరించి బెదిరించినాడో గత ప్రభుత్వాల నుండి పెంచి పోషించబడ్డ నయీమ్ తమ ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నాడని భావించిన నేపథ్యంలో అధికారTRS పార్టీ KCR కనుసన్నలలో నయీమ్ ను హత్య చేసి,ఆ హత్యను ఎన్ కౌంటర్ గా కట్టుకథ అల్లినారు.షాదనగర్ నయీమ్ ఇంటిలో దొరికిన డబ్బులను లెక్కబెట్టడానికి 6 కౌంటింగ్ మెషిన్ లు మూడు రోజులు పనిచేసాయంటే, అతని దగ్గర ఎంత డబ్బుఉందొ (దోచాడో) అంతుచిక్కలేదు. లెక్కలేనన్ని భూకబ్జాలు.నయీమ్ హత్య తర్వాత బాధితుల సంఘం ఏర్పడ్డది. అధికారులతో ,పోలీసులతో,అధికార TRS పార్టీ,కాంగ్రెస్, TDP పార్టీ వాళ్ళతో నయీమ్ సంబంధాలు బయటికివచ్చినయి. కానీ ఇవ్వన్నీ ఏవీ వెలుగులోకి రాకుండా నయీమ్ కేసును మూసివేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే వికాస్ దూబే కూడా UP రాష్ట్రంలో చాలా మంది భూఆక్రమణ‌లు చేసిండు. చాలామందిని హత్యలు చేసిండు. తానుఏదైతే దౌర్జన్యాలు నేర్చుకున్నాడో ప్రభుత్వాలనుండి ఆ క్రమంలోని తనకు అడ్డులేదనుకొని గత వారం DSP స్థాయితోపాటు 8 మంది UP పోలీసులను కాల్చి చంపిండు వికాస్ దూబే.ఈ ఘటనకు చరమాంకం పాడాలని భావించిన UP ప్రభుత్వం దూబే ను సజీవంగా పట్టుకొని ఎన్కౌంటర్లో చనిపోయినాడని కట్టుకథ అల్లింది.
నిజానికి పోలీసులు చట్టానికి లోబడి పనిచేస్తే, న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగానికి కట్టుబడి శిక్షలు అమలు చేయాలి.కానీ ప్రభుత్వాలు ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతులను,నయీమ్ మరియు వికాస్ దూబే లాంటి గ్యాంగ్ స్టర్ లతో పాటు తమకు ఇబ్బంది అనుకున్న‌ వాళ్ళందరినీ చట్టవ్యతిరేకమైన హత్యలతో చంపుతున్నారు. జీవించే హక్కును హరించే ప్రక్రియ మన రాజ్యాంగంలో లేదు. అయినా కూడా మన ప్రభుత్వాలు ఏండ్ల తరబడి ఎన్కౌంటర్ల‌ పేరున ఆదివాసీ ప్రాంతాల్లో, మధ్య భారతం, ఈశాన్య రాష్ట్రలలో నిరంతం కొనసాగిస్తున్నారు ఈ బూటకపు ఎన్కౌంటర్లు. ఎన్కౌంటర్ల లో పాల్గొన్న పోలీసులపై IPC 302 కేసును నమోదు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో APCLC పక్షాన కన్నాబిరాన్, బాలగోపాల్ లాంటి మేధావుల వాదనతో ఎకీభవించిన 5 గురు సభ్యుల హైకోర్టుబెంచ్ తీర్పును సుప్రీంకోర్టు లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ల సంఘం తరఫున(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో) పిటిషన్ ద్వారా అడ్డుకున్నారు. ఎన్కౌంటర్ల పై సుప్రీంకోర్టు , PUCL జడ్జి మెంట్లో ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేనందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అప్పటిహైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని,దేశవ్యాప్తంగా, హక్కుల సంఘాల కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులు నిరంతరం పోరాడుతున్నారు, APCLC పిటిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వాలు. ఈ వికాస్ దూబే ఎన్కౌంటర్ హత్య లో పాల్గొన్నపోలీసులపై, (APCLC పిటిషన్ పై హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు) IPC 302 కేసు నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది..

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.

2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి,
పౌరహక్కుల సంఘం తెలంగాణ

సాయంత్రం 5:30
10జులై,2020
హైదరాబాద్.

Keywords : vikas dubay, uttrapradesh, gang star, police , fake encounter, nayeem
(2020-08-10 11:20:33)No. of visitors : 588

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌

ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది.బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


గ్యాంగ్