కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు


కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు

కామ్రేడ్


కవి, కార్యకర్త, కళాకారుడు, పాత్రికేయుడు, విరసం కార్యవర్గ సభ్యుడు క్రాంతి కోసం రెండు రోజులుగా పోలీసులు ఇంటికి వచ్చి పోతున్నారు. భీమా కోరేగావ్ కేసు సంబంధంగా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు తెలిసింది. గతంలో ఇదే కేసులో ఆయన ఇంటి మీద పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా.

క్రాంతి కవితా సంపుటి ʹకలత నిద్దురలోʹ 2018 జనవరి విరసం సభల్లో విడుదలైంది. ఆ నెల 30న నేను సమీక్ష రాసి చూడమని వివికి మెయిల్ చేశా. అదే రోజు ఆయన పని హడావిడిలో కూడా రిప్లై ఇస్తూ ʹʹచాలా క్లుప్తంగా రాశావేʹʹ అన్నారు.

ఆ మరునాడు గుర్తుపెట్టుకొని తానే మళ్ళీ ఫోన్ చేసి ʹʹకలత నిద్దుర అనే శీర్షిక నుంచి చాలా వివరించవలసిన కవిత్వం. నీవు అక్కడే మొదలు పెట్టావు. ప్రతి పోయెమ్ మనం ఇవాళ ఉన్న స్తితిని తెలియజేస్తుంది. కవిత్వంలో ఒక మూడ్ ఉంది ...ʹʹ అంటూ చాలా మాట్లాడారు.

నిన్న వివి మాట్లాడలేని స్థితిలో ఫోన్ చేశారని సమాచారం తెలిసే కొ న్ని నిమిషాల ముందే క్రాంతి వాళ్ళమ్మ ఫోన్ చేసి ʹʹవాళ్ళు మళ్ళీ వచ్చారుʹʹ అని చెప్పింది.
అప్పటి నుంచి ఒకటే కలత. ఇద్దరి గురించి ఆలోచిస్తోంటే క్రాంతి కలత నిద్దురలో కవిత్వం, ఈ సమీక్ష, దాని మీద వివి పరిశీలన..గుర్తుకు వచ్చాయి.
ఇది 1.2.2018 విరసం. ఓ ఆర్జి లో వచ్చింది.

* * *

క్రాంతి తన కవితా సంపుటికి కలత నిద్దురలో అనే శీర్షిక పెట్టదల్చుకున్నానని, ఇందులో ఏదైనా ఇబ్బంది ఉంటుందా? అని నన్ను సలహా అడగబోయాడు. నాకు ఆ పే రు అద్భుతమనిపించింది. చప్పున దానితో కనెక్టయిపోయాను. కాబట్టి తటపటాయింపు లేకుండా చాలా బాగుంటుందని అన్నాను.

అప్పటి నుంచీ ఆలోచిస్తున్నాను. ఇంతకూ ఈ కలత ఏమిటి? దాని అర్థం ఏమిటి? అని.

తలగడ పెట్టుకొని పడుకునే నిద్రా సమయాల్లోని కలత గురించి కవి చెబుతున్నాడని నేనెలా అనుకోగలను? అదీ ఉండవచ్చు. దానికే అయితే ఎవ్వరూ కవిత్వం రాయరు . అంత వరకే అయితే అది కవిత్వం కూడా కాదు. ఇంకా ఏదో ఉంటుంది. నిద్ర పట్టని రాత్రులు, కలత నిద్దురతో తల్లడిల్లే వేకువ‌లు ఎందరికి ఉండవు? కానీ కలత ఇంకా లోతైనది, విస్తృతమైనది. అది మన స్థల కాలాలకు సంబంధించిన కలత. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు, మన ఆకాంక్షలకు, ఆ రెంటి మధ్య సాగే ప్రయాణపు ఒ త్తిడిలోని కలత. చారిత్రకమైన ఆశకు, తక్షణ నిరాశకు మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగే అశాంతి. ఇది నిలబడనీయుడు, కూర్చోనీయదు. మౌనంగా ఉండనీయదు. మా ట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, రచిస్తున్నా, ఆచరిస్తున్నా కూడా వదలని కలత.

క్రాంతికి ఈ అర్థం తెలుసు. అదే కవిత్వమైంది. బహుశా సంపుటి శీర్షికలో కూడా ఈ కలత కనిపిస్తే నిరాశ పలుకుతుందేమో అని సందేహించినట్లుంది. విప్లవంలో అ నేక ఉద్వేగాలు, ఆకాంక్షలు, ధీరోదాత్తమైన స్వప్నాలు, చెక్కు చెదరని విశ్వాసాలు, నెత్తురాలికే ఆచరణ రూపాలు.. ఎన్నెన్నో ఉంటాయి. అదే కాదు, ఈ దారి పొడవునా... . కొన్ని సమయాల్లో అయినా కలత కూడా ఉంటుంది. నిద్దుర పట్టక ఆశాంతిగా అటూ ఇటూ పారాడే రాత్రులు ఉంటాయి. దిగ్గునలేచే పీడ కలలూ ఉంటాయి. సరిగ్గా ఇదీ అని ఇతరులకు చెప్పలేం. రాయలేం. దానికి అనువైన వచనం మన దగ్గర ఉండదు. అన్ని వేళలా మనిషికి వచనం అందుబాటులో ఉంటే, అదే అన్ని స్థితుల వ్యక్తీ కరణ మాధ్యమం అయితే ఇక కవిత్వ అవసరమేముంటుంది? హేతువు మీద పునర్నిర్మితమైన ఆధునిక చారిత్రక మానవుడికి ఈ స్థితి తప్పకపోవడమేమిటి? ఇదే జీవి తంలో కవిత్వానికి శాశ్వత స్థానం కల్పించిందేమో.

మామూలుగా మాట్లాడుకోలేని, ఇతరులను గద్దించలేని, ఆగ్రహ ప్రకటన చేయలేని, గుండె భారం దించుకోలేని, కనీసం భోరున ఏడవలేని వచన స్థితిలో చిక్కుకొని మని షి తన్లాడుతూ ఉంటాడు. అదొక స్థితి. దాని ఒకానొక నొప్పి రూపమే కలత, కవిత్వమయ్యేది ఇదే. క్రాంతి కలత నిద్దుర అని అంటున్నది దాన్నే.

అట్లని ఇది నిరాశ కాదు, క్రాంతి ఎంచుకొని మరీ కఠినమైన విప్లవాచరణను ఎదుర్కొన్నాడు, ఎదుర్కొంటున్నాడు. అక్కడి నుంచి ఈ కలత నిద్దురను కవిత్వం చేశాడు. కఠినమైన విషయాలను ఎవరైనా కవిత్వం చేయగలరేమో. కానీ ఇలాంటి సున్నితమైన భావనలు విప్లవ కవులే కవిత్వం చేయగలరు. విప్లవంలోని స్థితే దీనికి కారణం.

ఈ స్థితి మామూలుగా వాచక విమర్శకులకు తెలియదు. దానికి వాళ్లననీ ప్రయోజనం లేదు. వాళ్ల దగ్గర ఈ కలత రంగు రుచీ వాసన తెలుసుకోడానికి ఏ పనిముట్టూ ఉండదు. అందుకే కొందరు అనుకుంటారు. విప్లవ కవి గొంతు నిశ్చయ నిశ్చయాలే ప్రకటిస్తూ ఉంటుందని, కానీ నిజం కాదు. విప్లవ కవి మరే ఇతర కవికంటే అనేక రకాల మన:స్థితుల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. మామూలుగా కవి ఊహా ప్రపంచం ఎంత విస్తారంగా ఉంటే అంతగా కవిత్వం వైవిధ్యం పలుకుతూ ఉంటుంది . ఇది ఎంత విశాలమైనది అయినా ఎక్కడో ఒక చోట తన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచం పరిమితి విధిస్తుంది. కానీ విప్లవ కవి ఊహ ఇక్కడే ఈ నేల మీదనే నిలబడి మనుషులు నిర్మించుకుంటున్న మరో ప్రపంచం దాకా విస్తరిస్తుంది. విచిత్రమేమంటే అది పూర్తి ఊహ కాదు, కల్పన కాదు. చారిత్రక అవకాశాలు ఉన్న ఊహ. సహజంగానే అనేక సామాజిక పరిస్థితుల, మనో ప్రపంచపు ఒత్తిడుల మీదుగా సాగే ఊహ అది.

ఇది విప్లవంలోని వాస్తవం. చరిత్ర తదుపరి మజిలీ దిశగా సాగే పురోగమనంలోని గడ్డు వాస్తవం. ఒక పెద్ద సామూహికతలోకి ఒదిగి, దాని చారిత్రక గతిక్రమంలో భా గమై సాగే వేళ భావుకుడైన ఇండివిజువల్కు కలిగే ఒత్తిడి ఇది. ఒక అగడ్త‌ను దాటే సమయాన కలిగే అలసటలోంచి మన:ప్రపంచంలో కలిగే అలజడి ఈ కలత. దాన్ని తట్టుకోవడం కష్టమే. కానీ ఒక చుక్కాని సుదూరపు ఆకాంక్ష దిశగా నడిపిస్తూ ఉంటుంది. అందుకే అది కలతే కాని నిరాశ కాదు.

ఒక్కోసారి ఈ భూగోళాన్ని మనిషి తన చేతిలోకి తీసుకున్నట్లు ఊహ కలిగిన వెంటనే, ఎక్కడో చిన్న నలత, కలత, నొప్పి, కించిత్ అశాంతి.. తరచి చూసుకుంటే ఇది సా మాజిక అశాంతి. నిజానికి సామాజికమైన విషయం దానికదే కవిత్వం కాలేదు. అది కవిలోని కలతగా ప్రతిఫలిస్తుంది. అప్పుడే కవిత్వమవుతుంది. సాంతమైన కలత కా దు. ఇండివిజువల్ అనుభవించే లోకపు కలత. వైయుక్తిక కవుల రోదనలు ఎన్నో విన్నాం. వాళ్ల అశాంతి చూశాం. కవిత్వంలాంటిదేదో అందులో ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా మనిషికి సంబంధించింది కాబట్టి. కానీ భవిష్య మానవుడి గురించి కలగనే విప్లవ కవి కలతలో చాలా లోతు ఉంటుంది. చారిత్రకత ఉంటుంది. గాఢత ఉంటుంది. దానిలో అనేక పొరలు ఉంటాయి. వాటన్నిటినీ చక్కగా విశ్లేషించవచ్చు.

కానీ కవిత సున్నితమయ్యేకొద్దీ విశ్లేషించాలంటే భయం కలుగుతుంది. చదువుతూ పోతే అనుభవంగా మారిపోతుంది కదా, మళ్లీ వ్యాఖ్యానించడం ఎందుకు అని? కవి త్వం కదా.. వేరే ప్రక్రియలైతే ఏమో అనుకోవచ్చుగాని.
-పాణి

Keywords : varavararao, pani, virasam, kranthi, maharashtra, NIA,
(2020-08-09 16:22:29)No. of visitors : 363

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


కామ్రేడ్