మనందరి కోసం మాట్లాడిన కవిని మనమే కాపాడుకోవాలి - విరసం


మనందరి కోసం మాట్లాడిన కవిని మనమే కాపాడుకోవాలి - విరసం

మనందరి

విప్లవ రచయిత వరవరరావుకు కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. భీమా కోరేగావ్ అనే అక్రమ కేసులో 18 నెలలుగా మహారాష్ట్ర జైల్లో ఉన్న 81 ఏండ్ల‌ వరవరరావు ఆరోగ్య చాలా రోజులుగా క్షీణిస్తూ వస్తోంది. ఆయనను విడుదల చేయాలంటూ...అనేక రూపాల్లో ప్రజలు, సామాజిక కార్యకర్తలు, జాతీయ, అంతర్జాతీయ మేదావులు, ఈ దేశ ఎంపీలు, ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నప్పటికీ కేంద్రం ప్రమాదకర నిర్లక్ష్యం వహిస్తోంది. ఎంతో మంది ప్రయత్నాల ఫలితంగా చివరికి మూడు రోజుల క్రితం ముంబై జేజే ఆస్పత్రికి తరలించారు. అంతటి అనారోగ్య పరిస్థితుల్లో ఇప్పుడాయనకు కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అవడం మరింత ఆందోళన కలిగించే అంశం. తన జీవితమంతా ఏ ప్రజల కోసమైతే నిలబడ్డ, మాట్లాడిన, రాసిన కవి, రచయిత, వక్త వరవరరావును ఆ ప్రజలే కాపాడుకోవాలి. కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాలపై వత్తిడి తేవాలి. ఇదే విషయంపై విప్లవ రచయితల సంఘ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం మీకోసం....

ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.

ఏదైతే భయపడుతున్నామో అదే జరిగింది. అనేక అనారోగ్య సమస్యలతో పాటు వరవరరావుకిప్పుడు కరోనా పాజిటివ్ కూడా తేలింది.
లాక్ డౌన్ కాలం నుండి సుప్రీం కోర్టు ఆదేశాన్ని అనుసరించి రాజకీయఖైదీలను బెయిల్ పై గాని, పెరోల్ పై గాని విడుదల చేయాలని, వాళ్లను కరోనాకు బలిచేయవద్దని అడుగుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఎనభై ఏళ్ల వరవరరావు ఆరోగ్యం గురించి పదేపదే ఆందోళన వ్యక్తం చేసినా, నెలన్నరగా ఆయన పరిస్థితి క్షీనిస్తున్నదని తెలుస్తున్నా ప్రభుత్వం, ఎం.ఐ.ఎ., న్యాయస్థానాలు కూడా నేరపూరిత నిర్లక్ష్యం వహించాయి.
ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేసినా అనుమతించలేదు. చివరికి నిన్న జెజె హాస్పిటల్ లో తీవ్ర ఆందోళనకర స్థితిలో ఆయన్ని కుటుంబసభ్యులు చూడవలసి వచ్చింది. ఒక పోలీసు తప్ప ఆయన బాగోగులు చూసుకునే వైద్యసిబ్బంది ఎవరూ అక్కడ లేరు. మనుషుల్ని కూడా వెంటనే గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయారాయన. ఈరోజు ఆయనకు కరోనా పాజిటివ్ కూడా తేలింది.
కరోనా ఆంక్షలను ఉపయోగించుకొని, లాయర్లతో సహా ఎవర్నీ ఆయనవద్దకు అనుమతించకుండా, ఆయన ఆరోగ్య స్థితి గురించి కోర్టుకు అపద్ధాలు చెబుతూ బెయిల్ రాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) అడ్డుకుంటున్నది. రాజకీయ ఖైదీలను చిత్రహింసలు పెట్టడానికే ప్రభుత్వం ఎం.ఐ.ఎ. అనే రాజ్యాంగ అతీత శక్తిని, ఊపా వంటి అప్రజాస్వామిక చట్టాన్ని ఉపయోగించుకుంటున్నది.
వరవరరావు తన భావాలను, రాజకీయ విశ్వాసాలు ఎన్నడూ దాచుకోలేదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడ్డం తప్ప ఆయన కుట్రలు చేసే వ్యక్తి కాదు. కవి ఎన్నటికీ కుట్రలు చేయడు. యాభై ఏళ్లుగా ఆయన మీద ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నీ ఎప్పటికప్పుడు తేలిపోయాయి. ఇప్పుడీ భీమాకోరేగాం కేసు కూడా అలాగే తేలిపోతుంది. కానీ విచారణే శిక్షగా మార్చి దేశంలోనే ప్రముఖ బుద్ధిజీవుల మీద కక్షసాధిస్తోంది ప్రభుత్వం.
వరవరరావును ఈ స్థితిలోకి నేట్టివేయడంలో తెలంగాణ ప్రభుత్వపాత్ర కూడా ఉంది. హైదరాబాద్ నుండే, ఆయన్ని మహారాష్ట్ర పోలీసులు తీసుకెళ్ళారు. తెలంగాణ కోసం, దేశ ప్రజల కోసం జీవితమంతా వెచ్చించిన కవి, మేధావిని కాపాడేందుకు జోక్యం చేసుకొమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఎంతమంది విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం చలనం లేకపోవడం దాని స్వభావాన్ని తెలియజేస్తోంది.
మనందరి కోసం మాట్లాడిన కవిని అచ్చంగా మనమే కాపాడుకోవాలి. వీలైన అన్ని పద్దతుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
-విరసం

Keywords : varavararao, virasam, corona, covid19, maharashtra, nia
(2020-08-10 09:33:01)No. of visitors : 361

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


మనందరి