వీవీకి ప్రేమలేఖ..

వీవీకి

నీ గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపిస్తోంది.. నాకు తెలుసు, నీకేమీ కాదు. దీపంలా వెలిగే నిన్ను కళ్లారా చూసుకోలేని గుడ్డితనంతో పాతాళంలో పడిపోయి, తీగలను పట్టుకుని వేలాడుతున్న నాకే బహుశా ఏమైనా కావొచ్చు. నా కోసమే బతుకుతున్న నా గురించి నాకు ఏ చింతా లేదు. కానీ కోట్లాది పేదలు, పతితులు, కష్టజీవులు, వనజీవుల కోసమే శ్వాసిస్తున్న నీకేమీ కాకూడదని నువ్వే కాదు, నేను కూడా నమ్మని దేవుణ్నిఈ క్షణం నిస్సహాయంగా చేతులెత్తి వేడుకుంటున్నాను. ప్రేమలో తర్కానికి తావులేదు. అదిగో, అలా వెన్నెల కురిసినట్లు నవ్వుతావేంటి? కళ్లలో ఆ ప్రేమజల యవనికలెందుకు?

వీవీ.. నీ ప్రేమలో పడి ఎన్నాళ్లయిందో లెక్కేసుకుంటున్నా. 20 ఏళ్లు దాటిపోయింది కదూ. అప్పుడు నీకు 60 లోపే, నాకేమో 20 దాటింది. వెర్రిబాగుల జనం నిన్ను వృద్ధుడు వృద్ధుడు అంటే ఫక్కన నవ్వొస్తోంది. నీ ముందు నేనే కాదు చాలా మంది కుర్రవాళ్లు నడీడు వాళ్లు పరమాతిపరమ ముసలి పీనుగులం. విప్లవానికి వృద్ధాప్యమేంటి, చోద్యం కాకపోతే!

నిన్ను తొలిసారి మా ఊళ్లో రోటరీ క్లబ్బులో జరిగిన విరసం సభలో చూశా. అప్పుడెలా ఉండేవాడివో ఊహించుకుంటున్నా. ఏమ్మాట్లాడావో సరిగ్గా గుర్తులేదు. హిందుత్వ రాజకీయాల గురించి, ప్రజల కష్టాల గురించి చెప్పావు. ఏకకాలంలో శ్రీశ్రీని, చలాన్ని, కాళిదాసును, విశ్వనాథను.. తిరుణాలలో తప్పిపోయి ఎవరు పిలిస్తే వాళ్ల వెంటపోయే పిల్లాడిలా నమిలేస్తున్న నన్ను దారికి తెచ్చిన ప్రసంగం అది. తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పాల్సిన పనిలేదు.

నువ్వు నీ నవయవ్వనంలో చలాన్ని ఎలా ప్రేమించావో, నేనూ ఎర్రజెండాను అలా ప్రేమించానని నీకు తెలుసు. చిరునగవుల మధ్యే చండప్రచండంగా సాగే నీ వాక్ప్రవాహానికి అబ్బురపడేవాణ్ని. నువ్వేం ఏం చెప్పినా కత్తివాదరలాంటి విమర్శ, పువ్వులాంటి మెత్తదనం, సత్యాసత్యాల వివేచన.. పిడికిళ్లు బిగిసే ఆవేశం.. అన్నింటికీ మించి అసహాయులపై నీ అశ్రుతప్త స్పందనకు నా గుండెలు కూడా ఎగసిపడేవి.

వీవీ.. బహుశా నీపై నాది ఏకపక్షే ప్రేమే కావచ్చు. ఇద్దరం గట్టిగా ఓ ఇరవైసార్లు కలుసుకుని ఉంటామా? అటు విశాఖ నుంచి విజయవాడ, ఇటు మొగిలిచెర్ల నుంచి అనంతపురం దాకా ఎన్ని ఆత్మీయ కరచాలనాలు! ఆనాటి చారిత్రక ఘట్టంలో మీ ఇంట్లో నీతో కలసి ఛాయ్‌లతోపాటు మూడు నాలుగుసార్లు తిని ఉంటా. మీ ఇద్దరి కోసం వండుకున్న పిడికెడు బువ్వను నేను కూడా బుక్కినందుకు సిగ్గేసేది. ఏం చేసేది, అప్పటి హడావుడి అది! మీ ఇంట్లో నీతో ఎప్పుడు మాట్లాడినా నీ సమయాన్ని నేను లెక్కేసుకునేవాణ్ని. నీకేమో తీరికలేని పనులాయె. గట్టిగా మూడు గంటలు మాట్లాడుకుంది నా పికాసో పుస్తకానికి నీ ముందుమాటపైనే. నీకు పికాసాలో శ్రీశ్రీని, కృష్ణశాస్త్రిని చూపించానని చాలా పొంగిపోయావు. నాపై ప్రేమతో వీలుచేసుకుని నేను కూడా ఊహించని చారిత్రక కోణంలో ఫ్రెంచి మాజీ కమ్యూనిస్టు వెధవని పరిచయం చేశారు. డావిన్సీ పుస్తకాన్ని నీకిస్తే ఎంత మెచ్చుకున్నావో కదా, ʹమాన్యుమెంటల్ వర్కుల్లో పడిపోయావు.. డిఫరెంట్ వర్క్ʹ అన్నావు. నాకు చచ్చేంత సిగ్గేసింది. నా సుడి బాగాలేదు మరి. బుద్ధి పక్కదారి పట్టింది. మంచికో చెడ్డకో నేను తెలుగు సాహిత్యానికి చాలా దూరంగా వచ్చేశాను; బతుకు పోరాటంలో పడిపోయి. చాలామంది బాగా రాస్తున్నారేమో, నాకు తెలియదు. తీరిక దొరికితే గ్రేట్ ఆర్టిస్టులతో గడిపేస్తున్నా. కూర్బ్, గోగా, వాన్గో, వెర్మీ, టీషన్, టర్నర్.. ఎవరెవరోలే.

చూశావా వీవీ.. ఎలా దారి తప్పానో, నీకు ప్రేమలేఖ రాస్తూ నా సోది చెబుతున్నాను. నమ్మిన విలువల కోసం నీలాగా మొండిగా, బండగా నిలబడిన మనిషి నాకు మరొకరు కనిపించడం లేదు. నీ అధ్యయనం, ఆకళింపు, ఆర్తి, విప్లవంపై అలవిగాని ప్రేమ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అందులో కనీసం ఐదో వంతైనా నాకు లేకపోయినందుకు ఇప్పుడు ఘోషపడి లాభమూ లేదు.

వీవీ... చాలా గుర్తుకొస్తున్నాయి. చాలా మరిచిపోయాను. నీ దృష్టిలో, చాలామంది దృష్టిలోనే కాకుండా నా దృష్టిలోనూ వాటికి ఇప్పుడు విలువేమీ లేదు. పాత ఆకులు రాలిపోయి, కొత్త ఆకులు వస్తున్నాయి కదా. పొద్దుపోయింది, ఇక ముగిస్తాను..

వీవీ.. మీ ఇంట్లో శిథిలమైన తెలంగాణ పెంకుటింటి ఫొటో ఒకటి ఉంది కదా; భరత్ భూషణ్ తీసింది. ఆయన్ను మూడేళ్ల కిందట కలిసినప్పుడు చాలా మాట్లాడుకున్నాం. నా బొమ్మలు చూసి మెచ్చుకున్నాడు. అయ్యో మళ్లీ నా సోదేనే. భరత్ భూషణ్ కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు కదా. నిన్ను కూడా కరోనా ఏమీ చెయ్యలేదు. నువ్వు నీ కోసం కాదు, నవ్వు ప్రేమించిన ప్రజల కోసం తప్పకుండా నీ మెరిసే కళ్లతో, చెరగని నవ్వుతో తిరిగి అరుణపతాకం నీడలో నిలబడతావు. వీవీ.. నువ్వు మెచ్చుకున్న నా కవిత్వంలో నేను పెట్టిన శాపమొకటి నల్లమల సాక్షిగా ఫలించింది. కలిసినప్పుడు అదేంటో చెప్పి నవ్వుకుందాం. మై డియర్ వీవీ, నీకేమీ కానే కాదు. నా మాటకు తిరుగు లేదు.

నీ కోసం వెయ్యి కొత్త కళ్లతో ఎదురు చూస్తూ
నీ విస్మృత ప్రేమికుడు మోహన్.
(మోహన్ పీ ఫేస్బుక్ పోస్ట్)

Keywords : varavara rao, poet, maharashtra jail, taloja jail
(2024-04-22 11:27:41)



No. of visitors : 821

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వీవీకి