గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు


గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు

గౌతమ్

బీమా కోరేగావ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న హక్కుల కార్యకర్తలు గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డేలకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వారి సంబంధిత రంగాలకు సంబంధించిన రచనలకు గుర్తింపుగా 2020 శక్తి భట్ బుక్ ప్రైజ్ లభించింది. తెల్తుంబ్డే ఇప్పటి వరకు ఇరవైకి పైగా పుస్తకాలు రచించారు. రిపబ్లిక్ ఆఫ్ కాస్ట్ అండ్ రాడికల్ ఇన్ అంబేత్కర్, దళిత్స్ - పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేవి కూడా ఆయన రచించినవే. ఇక గౌతమ్ నవ్‌లఖా డే అండ్ నైట్స్ ఇన్ ద హార్ట్‌ల్యాండ్ ఆఫ్ రెబెలియన్, ఏన్ అకౌంట్ ఆఫ్ మావోయిజమ్ ఇండియా, ఫ్రమ్ చత్తీస్‌గర్స్ బస్తర్ డిస్ట్రిక్ అనే పుస్తకాలు రచించారు. తెల్తుంబ్డే ప్రస్తుతం జైల్లో ఉన్న కారణంగా ఆయన భార్య రమా తెల్తుంబ్డేకు ఈ ఆవార్డు అందిస్తామని శక్తి భట్ ఫౌండేషన్ తెలిపింది.

పూణే నగరం సమీపంలోని బీమా కోరేగావ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు వీరికి సంబంధం ఉందని పలు సెక్షన్ల కింది వీరిద్దరితో పాటు 11 మందిపై 2018లో కేసు నమోదైంది. దేశ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఉపా కేసు కూడా నమోదు చేశారు. ఎల్గార్ పరిషత్ జరిగిన మరుసటి రోజే ఈ అల్లర్లు జరగడంతో పూణే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరిని ఈ ఏడాది ఏప్రిల్ 14న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇదే కేసులో గతంలోనే హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరున్ ఫెరీరా, వెర్నోన్ గున్జాల్వేస్, విరసం కవి వరవరరావు అరెస్టయ్యారు.

కాగా, గత 12 ఏండ్లుగా సాహిత్యంలో శక్తి భట్ అవార్డు ప్రకటిస్తున్నారు. దక్షిణాసియా ప్రాంతంలోని శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా దేశాలకు చెందిన రచయితలకు ఈ అవార్డు అందజేస్తున్నారు. ఈ అవార్డు ద్వారా రూ. 2 లక్షల నగదు ఒక ట్రోఫీ బహుకరిస్తారు.

Keywords : anandteltumbde, gautham navalakha, shkti bhatt
(2020-08-10 01:10:42)No. of visitors : 260

Suggested Posts


0 results

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


గౌతమ్