వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి...వీవీ కుటుంబం డిమాండ్


వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి...వీవీ కుటుంబం డిమాండ్

వరవరరావు

ప్రముఖ రచయిత, కవి వరవరరావు అనారోగ్యంతో ప్రస్తుతం ముంబై లోని నానావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విష్యం తెలిసిందే. ఆయనను జేజే ఆస్పత్రి నుండి సేయింట్ జార్జ్ ఆస్పత్రికి మార్చే ముంది ఆయనకు తలకు దెబ్బ తగిలి కుట్లు పడ్డాయన్న విషయం మీడియాలో రావడం తప్ప ఆస్పత్రి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రకటించకపోవడం పట్ల వరవరరావు కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవిచారణ క్రమంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యస్థితి గురించి కుటుంబానికి తెలియజేయకపోవడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, అమానుషం అని వరవరరావు భార్య హేమలత, కూతుర్లు సహజ, అనల, పవన ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం....

వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి

వరవరరావు ఆందోళనాకరమైన ఆరోగ్య స్థితి గురించి, ప్రత్యేకంగా నిన్న నానావతి ఆస్పత్రిలో చేర్చే సమయానికి ఆయన తలపై ఉన్న గాయం గురించి ప్రచార మాధ్యమాల్లో హోరెత్తుతుండగా అధికారికంగా కుటుంబానికి ఎటువంటి సమాచారం లేదు. న్యాయవిచారణ క్రమంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యస్థితి గురించి కుటుంబానికి తెలియజేయకపోవడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, అమానుషం.

గత వారం రోజులలో ఆయనను తలోజా జైలు నుంచి జెజె ఆస్పత్రికి, సేంట్ జార్జి ఆస్పత్రికి, నానావతి ఆస్పత్రికి తరలించగా, కుటుంబానికి అందిన అధికారిక సమాచారం ఆయనకు కోవిడ్ పాజిటివ్ ఫలితం వచ్చిందని మాత్రమే. మిగిలిన సమాచారమంతా ఇతర మార్గాల ద్వారా తెలిసిందే. కోవిడ్ విషయం కూడ ఆయనను జెజె ఆస్పత్రి నుంచి సేంట్ జార్జి ఆస్పత్రికి తరలించారని తెలిసి, నిర్ధారణ కోసం ఫోన్ చేయగా జైలు అధికారులు నిర్ధారించారు. ఇక గత రెండు రోజులుగా నానావతి ఆస్పత్రికి తరలించడం, ఆయన ఆరోగ్య స్థితి మరింత క్షీణించడం, నానావతి ఆస్పత్రిలో వైద్యులు ఆయన తలకు గాయమైందని, కుట్లు పడ్డాయని గుర్తించడం వంటి వార్తలన్నీ కూడ కుటుంబానికి పత్రికా మిత్రుల ద్వారా, పౌర సమాజ కార్యకర్తల ద్వారా తెలిసినవే. అధికారికమైన, పారదర్శకమైన సమాచారం లేని సమయంలో ఊహాగానాలు, వదంతులు, అర్ధసత్యాలు వ్యాపిస్తూ కుటుంబానికి, మిత్రులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

జెజె ఆస్పత్రిలోనో, సేంట్ జార్జి ఆస్పత్రిలోనో ఆయన తలకు గాయమై, కుట్లుపడ్డాయని నానావతికి తీసుకువచ్చినప్పుడు గుర్తించారని ఇవాళ వచ్చిన వార్త మమ్మల్ని తీవ్రంగా దిగ్భ్రాంతి పరుస్తున్నది. ఆయన క్షేమం గురించీ, ఆరోగ్యం గురించీ మా ఆందోళనను పెంచుతున్నది. ఆయన ఆరోగ్య స్థితి గురించి, చేస్తున్న చికిత్సాసరళి గురించి, రానున్న ప్రమాదాల గురించి అధికారిక పారదర్శక సమాచారం అందుకోవడం కుటుంబానికి ఉన్న హక్కు. కాని సంబంధిత పోలీసు, జైలు, ఆస్పత్రి అధికారులు తమ బాధ్యతా నిర్వహణను ఘోరంగా ఉల్లంఘిస్తూ, కుటుంబానికి అత్యవసరంగా తెలియజేయవలసిన సమాచారాన్ని తెలియజేయడం లేదు. ఇది కుటుంబానికి ఉన్న సమాచార హక్కుకు తీవ్రమైన విఘాతం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల, సంస్థల దారుణమైన బాధ్యతారహిత ప్రవర్తన కూడ.

ఈ పరిస్థితిలో మేము మహారాష్ట్ర ప్రభుత్వంపై ఈ కింది డిమాండ్లు పెడుతున్నాము.

1. వరవరరావు తనంతట తాను ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉన్నారు గనుక ఆయనకు సహకరించడానికి, తోడు ఉండడానికి కుటుంబ సభ్యులను ఒకరిని అనుమతించాలి.
2. వరవరరావు ఆరోగ్య స్థితి గురించి, చికిత్సా సరళి గురించి రోజుకు ఒకసారో, రెండు సార్లో తాజా సమాచారాన్ని పారదర్శకంగా అధికారికంగా అందజేయమని జైలు అధికారులను, ఆస్పత్రి అధికారులను తక్షణమే ఆదేశించాలి.
3. కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ఆస్పత్రిలో ఎవరిని సంప్రదించాలో స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
4. ఆయనకు జరుగుతున్న చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ కుటుంబానికి అందుబాటులో ఉంచాలి.
5. ఆయనకు సాధారణ బెయిల్ గాని, వయసు, ఆరోగ్యం, కొవిడ్ కారణాల మీద మధ్యంతర బెయిల్ గాని ఇవ్వడానికి వీలుగా న్యాయప్రక్రియలో అడ్డంకులన్నీ తొలగించాలి.

పి హేమలత – భార్య,
పి సహజ, పి అనల, పి పవన – కూతుళ్లు

Keywords : varavararao, nanavathi hospital, health, JJ Hospital, maharashtra, hemalatha
(2020-08-10 00:49:56)No. of visitors : 276

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


వరవరరావు