వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

వీవీ

వరవరరావు ను అక్రమ కేసులో జైల్లో ఉంచారని ఆరోపిస్తూ వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

కరోనా వైరస్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరవరరావును వెంటనే జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం!
ఉపా, ఎన్ ఐఎ కేసులను ఎత్తివేయాలి. అడవుల నుండి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలి.
నిరసనగా జూలై 25న తెలంగాణ రాష్ట్ర బంద్ ను పాటిద్దాం!
భీమాకోరేగాం అక్రమ కేసులో అకారణంగా జైలులో ఉన్న‌ విప్లవకవి, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త అయిన వరవరరావుకు కరోనా వైరస్ అంటుకొని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన్ని జూలై 14 తారీఖున ముంబాయి లోని తలోజా జైలు నుండి జెజె ఆసుపత్రిలో చేర్చారు. ఆ వెంటనే సేయింట్ జార్జీ ఆసుపత్రిలోకి మార్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు సరియైన ఆరోగ్య బులిటిన్ ను ప్రకటించడం లేదు. అయన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆయన జైలులో ఉన్నప్పుడు తనకు తాను నడవలేకపోవడం, టాయిలెట్‌కు వెళ్ళలేకపోవటంతో పాటు కనీసం బ్రెష్ చేసుకునే శక్తి కూడ కొల్పోయాడు. అయన జైలుకు వెళ్ళినాటికే అనేక వ్యాధులతో బాధపడుతున్నాడు.
కరోనావైరస్ వ్యాప్తి తరువాత ప్రజలు, మేధావులు, కవులు, ప్రజాస్వామికవాదులు, దేశ విదేశాల్లోని ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు 81 సంవత్సరాలు వయస్సున్న వరవరరావుకు కరోనా ముప్పు ఉందని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. కరోనా ముప్పు, ఆరోగ్యస్థితిని దృష్టిలో ఉంచుకొని అయన పలుమార్లు న్యాయస్థానాలకు బెయిల్ గురించి పిటీషన్లు వేసుకునప్పటికీ వాటన్నింటిని కొట్టివేసి ఆయనకు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించాయి. ఆరోగ్య పరిస్థితి పై సకాలంలో ఆయన కుటుంబానికి సమాచారం ప్రభుత్వం ఇవ్వటం లేదు. కనీసం ఆయనతో కుటుంబ సభ్యులకు ములాఖత్ లకు కూడ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎంతో మంది కరోనా వైరస్ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానితో ఈ రోజు వరవరరావు కరోనా వైరస్ సోకి ప్రాణప్రాయ స్థితిలో ఉన్నాడు.
ఆయన 81 సంవత్సరాల వృద్ధుడని, కరోనా ముప్పు ఉంటుందని, ఆయన జీవితంలో అనేక సార్లు జైలు జీవితం అనుభవించడమే కాకుండ అనేక కేసుల్లో బెయిల్ పొంది కూడ ఉన్నాడు. వరవరరావు విడుదలకు చొరవ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రికి ఎంతో మంది ప్రముఖులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. వరవరరావు అరెస్టు కుట్రలో కేంద్రంలో మోడీ, అమిత్ షాలతో పాటు కేసీఆర్ కూడ భాగం పంచుకున్నాడు. కేసీఆర్ హిందూ ఫాసిస్టులతో చేయి కలిపి వరవరరావు అరెస్టుకు కుట్రపన్నాడు. వీరంతా కలిసి ఒక పథకం ప్రకారం వరవరరావును అక్రమ కేసులో ఇరికించారు.
వరవరరావు, సాయిబాబా, అనంద్ తేలు తుంబ్డే, సుధాభరద్వాజ్, వెర్నర్ గోంజాల్వేస్, గౌతమ్ నవలఖా తదితరులతో 12 మంది కవులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలను ʹఅర్బన్ నక్సల్స్ʹ అంటూ తప్పుడు ముద్ర వేస్తూ, భీమాకోరేగాం తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారు. వీరిలో ఎవరికి కనీసం బెయిల్స్ కూడ ఇవ్వడం లేదు. దేశంలో బ్రాహ్మాణీయ హిందూ ఫాసిస్టులైన బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత విప్లవ, ప్రజాస్వామిక శక్తుల పై దేశ వ్యాప్తంగా అణచివేత ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద ఆర్థిక ద్రవ్య సంక్షోభం, దేశంలో దివాళ తీస్తున్న ఆర్థిక పరిస్థితిలో ప్రజలు ఎక్కడిక్కడ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతూ అందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనలను అణచడానికి ʹఅర్బన్ నక్సల్స్ʹ తుక్డే తుక్డే గ్యాంగులంటూ ప్రభుత్వం, బిజెపి - ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు గ్యాంగ్ లు తీవ్ర దమనకాండకు పాల్పడుతున్నాయి. ఈ సంవత్సరంలో ముందుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టి ప్రజలకు సరైన వైద్య చికిత్సలు అందించకపోవడం, లాక్ డౌన్ పేరిట పేదల కడుపు కొట్టడం, ప్రజలపై నిర్భందాన్ని అమలు చేయడం, కరోనాను అరికడుతున్నామని పాలక వర్గాలు బూటకపు ప్రచారాలు చేస్తూ వేలాది మంది మరణాలకు కారణమవుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కరోనా కాలంలో సంక్షోభం నుండి బయట పడడానికి ప్రజల పై కూరమైన నిర్బంధం, దోపిడీ రూపాలను అమలు చేస్తున్నాయి.
అనేక మంది పోరాటకారులను జైళ్ళల్లో అక్రమంగా నిర్భందిస్తున్నాయి. అందుకని వరవరరావు, సాయిబాబా లతో పాటు అనేక మందికి ప్రభుత్వాలు కరోనా కాలంలో కూడ బెయిల్ ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు.
ప్రియమైన ప్రజలారా! విప్లవ కవి, రాజకీయవేత్త‌, సామాజిక కార్యకర్త అయిన వరవరరావు తెలుగు ప్రజల్లో అత్యంత గుర్తింపు కలిగిన వ్యక్తి. ఆయన తెలుగు ప్రజలు జరిపిన అనేక ప్రజాస్వామిక ఉద్యమాల్లో తన రచనలతో, కవితాగానాలతో ఉద్యమాలకు దిశానిర్దేశం చేశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా 50 ఏళ్ళు పాల్గొన్నాడు. నక్సల్బరీ పోరాటాన్ని కవితాగానం చేసాడు. అయన ఈ పోరాటాల్లో భాగంగా అనేక కుట్ర కేసుల్లో అక్రమంగా ఇరికించబడి జైళ్ళల్లో ఉన్నారు. 80 ఏళ్ళ వయస్సులో కూడ అయన నమ్మిన ఆశయాల కోసం జైలు శిక్షలకు వెరవక పోరాడుతున్నాడు. నేడు తెలంగాణ ప్రజలందరు కలిసి కట్టుగా పోరాడి వరవరరావును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజల బాధ్యతగా చేపట్టాల్సిన అవసరం ఉంది.
వరవరరావు, సాయిబాబాలతో పాటు తక్కిన 12 మందిని, మరెందరో ప్రజా సంఘాల కార్యకర్తలను జైళ్ళ నుండి బేషరతు గా విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం. అందుకు తెలంగాణ రాష్ట్రంలో జూలై 25 తారీఖున సంపూర్ణంగా బంద్ ను పాటించి ప్రభుత్వాల పాసిస్టు విధానాలను వ్యతిరేకిద్దాం.
అర్బన్ నక్సల్స్ పేరిట అక్రమంగా అరెస్ట్ చేసిన వరవరరావు, సాయిబాబా లతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరత్ గా విడుదల
చేయాలి!
హిందూ ఫాసిస్టులైన మోడీ, అమిత్ షా వారితో జత కలిసిన కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేద్దాం!
రాజకీయ ఖైదీలను బేషరత్ గా విడుదల చేయాలి!
60 ఏళ్ళు పైబడిన సాధారణ ఖైదీలనందరిని విడుదల చేయాలి!
ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకు వ్యతిరేకంగా పోరాడుదాం!
ఉపా,ఎనైఏ కేసులను ఎత్తివేయాలి.
అడవుల నుండి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలి.

జగన్
అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కమిటి
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : varavararao, maoists, maharashtra, bhima koregav, health
(2024-04-18 06:51:40)



No. of visitors : 1357

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వీవీ