విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్


విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్

విలాస

మావోయిస్టు నాయకులు హరిభూషణ్, దామోదర్లు విలాస జీవితం గడుపుతూ ఆదివాసులను తెలంగాణ మీదికి పంపుతున్నారన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఆరోపణలపై సీపీఐ మావోయిస్టు పార్టీ మండి పడింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సబ్యుడు మహేష్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠం...

2020 జూలై 17, 18 తేదీలలో ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో డిజిపి మహిందర్ రెడ్డి పర్యటించి పోలీస్ అధికారులను సమావేశ పరిచారు. ఈ నేపధ్యంలో మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, అరాచకులని, వ్యాపారస్తులను, కంట్రాక్టర్లను, డాక్టర్లను, ప్రొఫెషనల్స్ ను బెదిరిస్తూ హరిభూషణ్, దామోదర్, చికెన్, మటన్, డ్రైఫ్రూడ్స్ తింటూ సినిమా షికార్లు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, అదివాసీలను తెలంగాణ పై తోలుతున్నారని గిరిజనులమని తెల్సికూడా విషపూరిత, కుట్రపూరిత ప్రకటనలు చేశాడు. ఇది అబద్దాల కోరు, దివాళకోరు తనానికి నిదర్శనం.నిజం చెప్పులు తొడిగే లోపే అబద్దం ఆరు సార్లు ఊరంతా తిరిగిందటా. మీ గోబెల్స్ ప్రచారం కూడా దానికి తీసిపోదు.

తెలంగాణలో అభివృద్ధి జరిగిందని రోడ్లు, విద్య, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతే అడ్డుకోవడానికి అరాచకాలు సృష్టించడానికి మళ్ళీ ప్రవేశిస్తున్నారని విచక్షణ లేకుండా మాట్లాడారు. అసలు అభివృద్ధి నిరోధకులు ఏవరు?

అభివృద్ధి అంటే మీ దృష్టిలో భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు మాత్రమే. అసలు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టి మరింత నియంతృత్వంగా మారింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. హరితహారం పేరుతో రైతుల సొంత భూముల నుండి గెంటివేస్తున్నారు. ఖనిజ సంపదను అదవులను బడా కార్పోరేట్ సంస్థలకు అమ్మివేస్తూ ప్రజలను నిర్వాసితులు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్మికులను, ఉద్యోగులను గెంటివేస్తున్నారు. మూత పడిన ప్రభుత్వ పరిశ్రమలను తెరవడం లేదు. నిరుద్యోగులకు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. బడా కంపెనీలను పెద్ద ఎత్తున అహ్వానిస్తూ చేతి వృత్తులను ధ్వంసం చేస్తున్నారు. పోలీసులకు సూపర్ అధికారాలు కట్టబెట్టి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాలను చట్టవిరుద్దంగా నిషేదిస్తున్నారు. అప్రజా స్వామికంగా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలన్నింటికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై, సంస్థలపై ప్రభుత్వ కిరాయి సాయుధ బలగాల ద్వారా, కాషాయి మూకల ద్వారా క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారు.

గత 12 యేండ్లుగా ప్రపంచ సంక్షోభం కొనసాగుతూ అది మరింత తీవ్రతరం అవుతుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంధ్యాన్ని ఎదుర్కొంటుంది. దీనితో పేదరికం, ఆకలి చావులు నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు అసలు విషయాన్ని కప్పిపుచ్చడానికి పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ బూటకపు పథకాలను బూర్జువా మీడియా ద్వారా ఎడతెరిపి లేకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

సేవా రంగాలను ప్రైవేటీకరించి సామాన్యుడికి విద్య, వైద్యం అందకుండా చేయడం అభివృద్ధా? భూస్వామ్య, బడా కార్పొరేట్ సంస్థల, సామ్రాజ్య వాదుల ప్రయోజనాల కోసం పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించి స్థానిక ప్రజలను నిర్వాసితులను చేయడం అభివృద్దా? సాధారణ రైతాంగానికి, సాగు, తాగు నీరు అందకుండా గోదావరి జలాలను ముఖ్యమత్రి కేసీఆర్ వారి భూస్వాములకు తరలించడం ఎవరి అభివృద్ధి కోసమో చెప్పాలి? హరితహారం పేరుతో ఆదివాసీలను గెంటివేసి జల్, జంగల్,
జమీన్ పై సంపూర్ణ హక్కులను హరించి వేయడం అభివృద్ధా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు ఎన్ని ఎకరాలకు ఎన్ని టిఎంసిల నీరునందిస్తున్నారో చెప్పగలరా? సామాన్యుడిని పీల్చి పిప్పి చేయడానికి దోపిడీ వర్గాల మార్కెట్ కోసం చేసే రోడ్ల నిర్మాణాలు ప్రజల అభివృద్ధి ఎలా అవుతుంది. వ్యసాయ రంగాన్ని గాలికి వదిలి గింజ గింజను కొనుగోలు చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం దళారీల పాలు చేసిన వైనం తెలంగాణ‌ ప్రజలకు తెలియంది కాదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు, రైతాంగానికి అందుబాటులో ప్రభుత్వ మార్కెట్స్ లేని దయనీయ పరిస్థితులు తెలంగాణ ప్రజలను అడిగితే మీ అభివృద్ధి గురించి పూస గుచ్చినట్లు చెప్తారు.

ప్రజల అభివృద్ధి గురించి అభివృద్ధి నిరోధకులే చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వుంటుంది. తెలంగాణ ప్రజల నిజమైన అభివృద్ధి కోసం వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారం కోసం సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రజల పక్షాన నిలిచి త్యాగాలకు కష్టాలకు ఓర్చి పోరాడుతుంటే అగ్రవర్ణ భూస్వాములు, బ్యూరాక్రట్లు, తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్, డిజిపి మహేందర్‌ రెడ్డి తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, అస్తులు, అంతస్తులు రక్షించడం కోసం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకోవడానికి, అరాచకాలు సృష్టించడానికి ప్రవేశిస్తున్నారనే బురద జల్లి విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మీరు పన్నుతున్న కుట్రపూరిత పథకాలు మా ప్రజలందరికి తెలుసు. ఆసిపాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వరకు వేలాది గ్రేహౌండ్స్ బలగాలను మోహరిస్తూ మా దళాలపై నిత్యం దాడులు కొనసాగిస్తున్నారు. ఆ దాడులను మరింత తీవ్రతరం చేసి కౄరమైన మరో రక్త చరిత్రను సృష్టించడానికే మావోయిస్టు ప్రాంతాలలో డిజీపి పర్యాటిస్తున్నారనే విషయం మా ప్రజలకు తెలుసు. మావోయిస్టు పార్టీకి, ప్రజా నేతలకు ప్రజలలో వున్న కీర్తి ప్రతిష్టలను దిగజార్చి విప్లవోద్యమంపై వారికున్న విశ్వాసాలను నమ్మకాలను పొడగొట్టడానికి ప్రజల నుండి వేరు చేసే ప్రయత్నలో భాగమే ఈ పోలీసుల దుష్ప్ర‌చారమని ప్రజలందరికి తెలుసు.

తెలంగాణ ప్రజలు మావోయిస్టు పార్టీని తరిమికొడితే ఛత్తీస్ గఢ్ పారిపోయారని విడ్డూరపు ప్రకటనలు నిసిగ్గుగా చేస్తున్నారు. వాస్తవానికి నియంతృత్వ దోపిడీ పాలక ప్రభుత్వాలు వారి ఎంగిలి మెతుకులు తిని బ్రతికే పోలీసులు గత 50 సంవత్సరాలుగా విప్లవోద్యమంపై, విప్లవ ప్రజానీకంపై కూరమైన పాశవిక దమనకాండను కొనసాగిస్తూ అనాగరిక చర్యలతో అణచివేసిన మీ ఘనమైన రక్త చరిత్రను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పటికి ఎప్పటికి ముర్చిపోరు. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయోగించిన పైశాచిక చర్యలు అన్నీఇన్నీ కావు. అరెస్టులు, చెప్పనలవి కాని థర్డ్ డిగ్రీ చిత్రహింసలు , హత్యలు, అత్యాచారాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, గృహ దహనాలు, పంటల విధ్వంసం, అస్తులను నష్టపరచడం, విష ప్రయోగాలు, నరహంతక నల్ల దండు ముఠాలను సృష్టించి ప్రజాస్వామిక శక్తులపై దాడులు, కోవర్టులు, పిచ్చుకపై బ్రహ్మస్త్రం లాగా సాధారణ ప్రజలపై టాడా, ఉపా కఠినమైన చట్టాలను మోపడం, నిషేధాలు, నిర్భంధ ఆపరేషన్లు ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాంతాడు పొడుగు ట్రాక్ రికార్డును తవ్వితే మీ నేరపూరిత చరిత్ర బయట పడుతుంది. కావలసినన్ని కూరమైన అణచివేత ఆయుధాలను ఉపయోగించి ప్రజలు తరిమి వేశారని చెప్పడం సిగ్గు తప్పిన మాటలు గాక మరి ఏమవుతుంది?. మీ మూలంగా తెలంగాణలో కష్ట, నష్టాలకు శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురికాని కుటుంబం లేదనంటే అతిశయోక్తి కాదు.మీరు పెట్టిన చిత్రహింసలకు, వేధింపులకు ఆత్మహత్య చేసుకొని, కేసుల పాలై వీధిన పడ్డ కుటుంబాలున్నాయి. ప్రజలపై మీరు అకారణంగా మోపిన కేసుల మూలంగా ఇప్పటికి వేలాది మంది కోర్టుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే వున్నారు. అతి అల్పమైన విషయాలను ప్రస్తావిస్తూ హరిభూషణ్,దామోదర్లు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పాసినోటి అబద్దాల కంపును ప్రచారం చేస్తున్నారు. విప్లవోద్యమంలో పని చేస్తున్న మమ్మల్ని హత్యలు చేయడానికి అనేక కుట్ర ప్రయత్నాలు, ఆపరేషన్లు, క్రూర నిర్భంధాలు ప్రయోగిస్తూ విలాసాలు అనుభవిస్తున్నారని చెప్పడం హాస్యస్పదం. విప్లవోద్యమం అనేక ఆటుపోట్లు, కష్ట నష్టాలు, ఓటమి, గెలుపు, తిరోగమనం, పురోగమనాల గుండా సాగుతుందని, గెరిల్లా యుద్ధంలో విలాసాలకు తావు లేదని మెడపై తల వున్నవాడికి మాత్రమే అర్థమవుతుంది. దోపిడీ స్వభావం కలిగిన మీ లాంటి వాళ్ళు మాత్రమే అధికారాన్ని అడ్డంపెట్టుకొని నియంతృత్వ విధానాలతో అక్రమంగా, అడ్డ దిడ్డంగా సంపాదిస్తూ కుప్పలు కుప్పలుగా ఆస్తులు పోగుజేస్తూ విలాసాలు అనుభవిస్తున్న మీరు మాత్రమే పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు చూడగలరు. పార్టీ అవసరాలకు ఉపయోగించే సెల్ ఫోన్లు, సైనిక దుస్తులు ప్రజలు ఇచ్చే ఆహారం విలాస వస్తువులా? అలానే అనుకుంటే సామాన్య ప్రజలు సైతం విలాసాలు అనుభవిస్తున్నారన్న మాట. ఎలాంటి ప్రాసంగికత లేని, పసలేని వాదనలు విప్లవ ప్రజల ముందు నిలబడవనే విషయం తెలుసుకోండి. మాపై బురద జల్లి ప్రజలను నమ్మిచడం సూర్యుడి పై ఉమ్మివేసినట్లు వుంటుంది. అస్తులు అంతస్తులు విలాసవంతమైన సౌకర్యాలు ఎవరి వద్ద ఉన్నా సామాన్య ప్రజానీకం జప్తు చేయడానికి మీరు సిద్ధమా?

సాధారణ పోలీసులారా! మీ వ్యక్తిగత జీవితం కోసం సర్వ మానవాళి వినాశనానికి పాల్పడకండి. మన కంట్లో మన వేలినే పెట్టడానికి దోపిడీ పాలక వర్గాలు పేదరికం, నిరుద్యోగాన్ని అసరా చేసుకొని కుహనా దేశభక్తిని నూరిపోస్తూ మీ చేత ఆధునిక ఆయుధాలు పట్టించారు. మన వర్గం, జాతి, సెక్షన్ల ప్రజలు అస్తిత్వం కోసం జీవన మరణ పోరాటాలు చేస్తుంటే మనలో మనం కొట్టుకొని చావడానికి కుటిల నీతిని ప్రయోగిస్తున్నారు. మనల్ని మనం చంపుకొనే పోలీసు ఉద్యోగం అవసరమా? అలా చేయడం చెట్టు కొమ్మపై కూర్చొని దాని మొదలు నరుక్కునేటంతటి అమాయకంగా ఆలోచించడమే. సర్వ మానవాళిని వినాశనం చేయడం ఎంత ప్రమాదకరమో ఒక్క క్షణం ఆలోచించండి. నిజమైన దేశభక్తి వుంటే పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడండి.

ప్రియమైనా ప్రజలారా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి యాజమానులైన సామ్రాజ్యవాదుల, భూస్వాముల, బడా పెట్టుబడి దారుల దోపిడీ ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారు. ఫలితంగా ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కారణమైన నూతన ఆర్థిక విధానాలనూ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. దోపిడీ పీడనలకు ఆటంకంగా నిలుస్తున్న యావత్తు విప్లవ, జాతి విముక్తి, ప్రజాస్వామిక, లౌకిక, దేశ భక్తి శక్తులను 2022 నాటికి నిర్మూలించాలనే ఫాసిస్టు మోదీ, అమిత్ షా నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రమాదకరమైన ప్రతిఘాతుక వ్యూహాత్మక సమాధాన్ ప్రతీఘాతుక దాడిని ఓడించడం మన ముందున్న తక్షన కర్తవ్యం. తెలంగాణలో మావోయిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకొంటూ ప్రజా యుద్ధానికి క్రియాశీలక మద్దతునందించండి.

విప్లవాభివందనాలతో

మహేష్
తెలంగాణ రాష్ట్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : cpi maoist, telangana, mahesh,DGP, haribhushan, jagan, mahesh
(2020-09-19 00:08:44)No. of visitors : 2312

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


విలాస