ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !


ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !

ఉద్యమాల

ఉ.సా. గా ప్రసిద్దుడైన ఉ.సాంభశివరావు కరోనా వైరస్ తో ఈ రోజు గాంధీ దవఖానాలో కన్ను మూశారు. తన విద్యార్థి దశ నుండే విప్లవోద్యమం వైపు వచ్చారు ఉ.సా. మార్క్స్ ఆలోచనలనూ, ఫులే, అంబేద్కర్ ఆలోచనలనూ కలిపి భారత సమాజ విముక్తి సిద్ధాంతం తయారు చేయాలని తీవ్రంగా ప్రయత్నించిన మేధావి. ఆయన మరణంపట్ల ధిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అనేక సంస్థలు, వ్యక్తులు ఉ.సా.కు నివాళులు అర్పించారు.

ఉసా గారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు
ఉసా (ఉప్పుమాగుచారి) సాంబశివరావు గారికి జోహార్లు
ఉసా గా సుప్రసిద్ధులైన సాంబశివరావు గారి ఉద్యమ జీవితం ఆయన విద్యార్థి జీవితంలోనే మొదలైంది. 1980ల తొలి రోజుల నుండి ఆయన పూర్తికాలపు ఉద్యమ కార్యకర్త. భారత సామాజిక పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించి తన జీవిత కాలమంతా విభిన్న సామాజిక అస్తిత్వాల ప్రజలందరినీ ఉద్యమాల్లోకి సమీకరించే కృషి చేశారు. కారంచేడు ఉద్యమాల నుండి ఇటీవల పాతపల్లి, లక్ష్మీంపేట ఘటనల వరకు దళితులపై, స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ సామాజిక ఉద్యమ నిర్మాణానికి నిరంతరం కృషి చేశారు. కరువులు,వలసలు,తెలంగాణ వంటి సమస్యలపై కేంద్రీకరించి పీడిత ప్రజల సమస్య ఉత్పత్తిలో కాదు--పంపిణీలో ఉందని, భౌతిక, సహజ వనరులపై పేదల హక్కు స్థిరపడాలని వాదించేవారు. ఎదురీత పత్రిక నుండి దేశి దిశ అనే మీడియా సంస్థ ద్వారా తాజాగా ఆయన సమాజాన్ని చైతన్య పరిచే కృషి చేశారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ చేత పుట్టి, గొప్పగా పెరిగి విస్తరించిన కరోనా వంటి వ్యాధి బారినపడి పూసా వంటి సామాజిక ఉద్యమకారుడు మరణించడం ఉద్యమాలకు తీరనిలోటు. ప్రజా ఉద్యమాలు, బాధితులు తమ కోసం ఆరాట పడే మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం. ఉసా జీవితానుభవాల నుండి, ఆచరణ నుండి ఈతరం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఆధిపత్యాలు, అణచివేతలు లేని ప్రజాస్వామిక సమాజ నిర్మాణమే మనం ఉసా గారికి అర్పించే నిజమైన నివాళి కాగలదని నమ్ముతున్నాము. ఉసా గారికి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి, బంధు మిత్రులకు మా సహానుభూతిని తెలుపుతున్నాము.

ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్ ప్రొ. జి.లక్ష్మణ్
యం.రాఘవాచారి*
ఎస్.అనిత
కె.రవిచందర్
కో-కన్వీనర్లు

దళిత బహుజన ఉద్యమనాయకుడు,మేధావి,కవి,రచయిత కళాకారుడు,సిద్ధాంత కర్త లాంటి అనేక లక్షణాలు కలిగిన అరుదైన వ్యక్తులలో ఉ.సా అన్న ఒకరు.1985 కారంచేడు నరమేధం సందర్భంగాజరిగిన ఉద్యమపరిచయం నుండి నేటివరకు అనేక విషయాలు ఆయన్నుండి నేర్చుకున్నా."కారంచేడు దళితులపై కమ్మభూస్వాములదాడి"అని ఆయన రాసిన కరపత్రంపై.అపుడు ఆయన పనిచేస్తున్న పార్టీలో వచ్చిన విబేధాలకారణంగా పార్టీకి దూరమయ్యాడు.మారోజు వీరన్న"కుల-వర్గ సిద్దాత"డాక్యుమెంట్ తయారీలోఉసా అన్నపాత్ర కీలకం.మాకలయిక సందర్భంలో "కారంచేడు నన్ను పార్టీకి దూరం చేస్తే.నిన్ను ఉద్యమబాట పట్టించింది ప్రభాకర్"అనిఅనేక సార్లు గుర్తు చేసేవాడు.ఈదేశ పీడిత ప్రజల విముక్తికి కుల-వర్గ పోరాటాలవసరమని బలంగా నమ్మి చివరి క్షణాలవరకు ఆచరణలో వున్నవ్యక్తి. నాకుటుంబం హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఒక కుటుంబ సభ్యులుగామా బంధం మరింత బలపడింది.రాజ్యహింస,అగ్రకులోన్మాద దాడులు జరిగిన ప్రతి సందర్భంలో చాలా సీరియస్ గా స్పందించేవాడు.వెంటనే బాధితులను పరామర్శించి వాళ్ళకు బరోసాగా నిలిచేవారు మిగిలిన వాళ్లను నిల బెట్టేవాడు. ఊ.సన్న అంటే ఒక బరోసా.1992లో చీమకుర్తి (మావూరు)లోముగ్గురు దళితమహిళల అత్యాచార హత్యల సందర్భంగా జరిగిన ఉద్యమంలో నేను కన్వీనర్ గా ఉ.సా అన్న,కా.సత్యమూర్తి,కొండాలక్ష్మణ్ బాపూజీ కో-కన్వీనర్లుగా జరిగిన రాష్ట్రస్థాయి ఉద్యమంనుండి లక్షింపేట ఉద్యమం దాకా,అమరుడు తారకంసార్, ఉసా అన్న ల జీవితాచరణ ,ఉపన్యాసాలు,రాతలనుండి నేను చాలానే నేర్చుకున్నాను. గుంటూరు జిల్లా చుండూరు ప్రక్కనేవున్న బ్రాహ్మణకోడూరు లోని "ఊరులో అంటరానికులం"లో పట్టిన ఉసా అన్నవెలివాడ బతుకులబాగుకోసం ఉద్యమించాడు.తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.రెండు రాష్ట్రాలలో నిప్రజలతో విస్తృత పరిచయాలువున్న ఉసా అన్ననిత్యం జనంమద్య, జనంతో ఉండే ఉసా అన్న మహాప్రస్థానం వేలాది మంది ఆప్తులతోజరగాల్సివుండె.కరోనా కాటుకుబలై ఒంటరిగా వెళ్లిపోతున్నాడు.కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఇంకా ఎంతమంది ప్రజలతో,ప్రజలకోసంజీవించిన ఉద్యమకారులుఈవిధంగా ఒంటరి ప్రయాణంచేయాల్సివస్తుందోకదా,ఇది అత్యంత విషాదకరం.

నిత్యంహైదరాబాద్ లోని"అంకుష్"లో కలుసుకున్నపుడు జరిగిన చర్చలు గుర్తుకొస్తూ దుఃఖం ఆగడంలేదు. నీతో ఎప్పుడూ "మాఒంగోలుగిత్త"అనిపిలిపించుకునే నేను నీచివరిచూపుకు నోచు కోలేక పోతున్నందుకు ఇంకా బాధగావుందన్నా.......

......మొదటితరం దళిత ఉద్యమ నాయకుల్లో ఒకరైన ఉసా అన్న లేకపోవడం దళిత బహుజన ఉద్యమాలకు తీరనిలోటు..
...........జోహార్ ఉసా అన్న.........
- దుడ్డు ప్రభాకర్

చిరకాల మిత్రుడు, ఉద్యమాల ఉపాధ్యాయుడుగా అందరికీ చిరపరిచితుడు ఉ. సాంబశివరావు (ఉ.సా.) గారు కొవిడ్ తో రాత్రి మరణించారని తెలిసింది. 1970ల మధ్యలో అప్పటి యు సి సి ఆర్ ఐ (ఎం ఎల్) కార్యకర్తగా కొండమొదలు పోరాటంతో మొదలై, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సెంటర్, ఎదురీత, దళిత బహుజన సమీకరణ కోసం అనేక ప్రయత్నాల నుంచి దేశీ దిశ దాకా ఐదు దశాబ్దాల పీడిత ప్రజా పక్షపాతం, అనేక ప్రజా ఉద్యమాలలో నిరంతర ఆచరణ, పాట, ఉపన్యాసం, రచనల వంటి విస్తృతమైన మేధో కృషి, మార్క్స్ ఆలోచనలనూ, ఫులే, అంబేద్కర్ ఆలోచనలనూ కలిపి భారత సమాజ విముక్తి సిద్ధాంతం తయారు చేయాలని తీవ్రంగా ప్రయత్నించిన మేధావి -- తెలుగు సమాజంలో గణనీయమైన గౌరవ ప్రతిష్ఠ లను సంపాదించిన మంచి మనిషి. ఉ.సా. గారూ కన్నీటి జోహార్లు...
- ఎన్.వేణుగోపాల్

ఉసా గార్కి విప్లవ జోహార్లు!
–----------------------------------------- --
కరోనా వైరస్ ఉసా (ఉప్పుమావులూరి సాంబశివరావు)గారిని పొట్టన పెట్టుకున్నది.సామాజిక అణచివేత పై, వర్గ దోపిడిపై గత ఐదు దశాబ్దాలకు పైగా అలుపెరగకుండా పోరాడుతున్న ఉసా గారు ఇకలేరనే వాస్తవం గుండెల్ని పిండేస్తున్నది.మొన్న నిస్సార్,నేడు ఉసా ...రేపేవరనే ప్రశ్న?
గుంటూరు జిల్లా బ్రహ్మణకోడూర్ లో పుట్టిన ఉప్పుటూరి సాంబశివరావు గారు విద్యార్థి గా ఉన్నపుడు విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు.ప్రజాతంత్ర విద్యార్థి సంఘo(DSO) లో పని చేసారు.ఈ సమయంలోనే పూర్తి కాలం విప్లవ కార్యకర్తగా మారారు.ఆనాటి UCCRI(ML) పార్టీ లో నాయకుడుగా ఎదిగి 1982 లో అనుకుంటా నల్లగొండ జిల్లా మోత్కూర్ ప్రాంతంలో రైతాంగంలో పని చేశారు. అనాడు విద్యుత్ లోఓల్టేజీ సమస్య కారణాన కరెంట్ మోటార్లు కాలి పోయు రైతులు విపరీతంగా నష్టపోతుంటే ,ఆ సమస్యపై విశాల ఉద్యమాన్ని నడపడంలో ఉసా గారు ముందున్నారు.
ఆ పార్టీ నుండి బయటకొచ్చి ఉసా గారు ఎదురీత పత్రికను ఇతర కామ్రేడ్స్ తో కలిపి చాలా కాలం నడిపారు.దళితవాదాన్ని విస్తరింప చేశారు.సామాజిక అణిచివేత ను దనుమాడుతూనే వర్గ,కుల సమస్యపై దృష్టి సారించి లోతుగా అధ్యయనం చేశారు.అనేక పుస్తకాలను వెలువరించారు.ప్రసంగాలను చేశారు.ఆద్బుతమైన పాటలను రాసారు.సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల నిర్ములన కోసం విస్తారంగా పని చేసారు. అట్టడుగు ప్రజల గొంతుకయ్యారు.సమాజ మార్పు కోసం బహుముఖoగా కృషి సాగించారు.ఈ క్రమమే ఉసా ను ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మార్చింది.విప్లవ, దళిత ,సామాజిక ఉద్యమాల మధ్య సమన్వయ సాధనకు నిరంతరం యత్నించారు. అనతి కాలంలోనే ఉసా గారు దళిత,బహుజన మేధావిగా ఎదిగారు.
"దేశీ దిశ" అనే పత్రికను,వెబ్ ఛానలు ను ఇతర సామాజిక మిత్రులతో కలిసి నడుపుతున్నారు.
తెలుగు నేలపై పీడితుల, తాడితుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న దిటవైన గుండె చప్పుడు నేడాగి పోయింది. కాదు కాదు కరోనా కాటేసింది.కరోనాను సృష్టించిన దోపిడీ వ్యవస్థ నిర్దాక్షిన్యంగా చంపేసింది.
కామ్రేడ్ ఉసా కు కన్నీటి విప్లవ జోహార్లు
- గోవర్ధన్, (సీపీఐ ఎం ఎల్ న్యూ డెమాక్రసీ)

బహుజన,దళిత ఉద్యమ మేధావి, ఉపాధ్యాయుడు, సామాజిక విప్లవకారుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి బలయిపోయాడు. ఉద్యమాల సారథి మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా అయిన ఊసాగారికి జోహార్లు. ‍
-సంధ్య పీఓడబ్ల్యూ

నీ కోసం ఓ కన్నీటి చుక్క!

అయ్యో! ʹఉసాʹ ఇక లేరా!?

ఇది చాలా అన్యాయం...

ఈ దశలో ʹఉసాʹను కోల్పోవడమంటే దళిత బహుజన తాత్వికుడు, ఉపాధ్యాయుడు, మేధావి, కార్యాచరణ దిక్సూచిని నడిసంద్రంలోనే కోల్పోయినట్లనిపిస్తోంది.

ఎన్నో సందర్భాల్లో పరస్పరం మాట్లాడుకోగలిగిన పరిచయం..

ప్రొ.జయశంకర్ అంతిమ యాత్ర, ఏకశిలా పార్కు సంతాప సభానంతరం బహుజన తాత్విక పుస్తకాన్ని నా చేతికి ఇచ్చిన జ్ఞాపకం.

ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా లు, ధర్నాలలో పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకున్న మహత్తర జ్ఞాపకం.

శిష్ట బ్రాహ్మణ పొగరు అణిచేలా ఒక్క మాట కూడా పొల్లుపోకుండా మాట్లాడ్డం, అంతే స్పష్టతతో సూక్ష్మాతి సూక్ష్మ పొరపాటు లేకుండా రాయడం..

ʹచేతివృత్తుల కరామత్ʹ.. విశ్వ నాగరికతా నిర్మాణంలో చేతి వృత్తుల గౌరవనీయ పాత్రను ప్రస్తుతించే గొప్ప చారిత్రక పాత్ర పోషించిన కర్తవ్యపరాయణత్వం..

బహుజన రాజకీయాలున్నా, విప్లవ సాంస్కృతిక పోరాటాల్లో అరమరికలు లేకుండా పాల్గొనడం..

ఇన్ని విశిష్టతలు ఉన్న మహత్తర బహుజన శ్రామిక మేధావిని కోల్పోవడం ఎంత సర్ది చెప్పుకున్నా తట్టుకోలోని ... లాస్..ఎ బిగ్ ప్రొఫౌండ్ లాస్!

నమ్మలేని ఈ నిజం .. అబద్దమైతే బాగుండును.

ఈ దుఃఖం తీరనిది.

ʹఉసాʹగా కీర్తి గడించిన ఉప్పుమాగులూరి సాంబశివరావు, నీకు ఘనమైన నివాళులు!

నీ కోసం ఓ కన్నీటి చుక్క!
-బాసిత్.

బహుజన,దళిత ఉద్యమ మేధావి, ఉపాధ్యాయుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి బలిపోయాడు. ఉద్యమాల సారథి మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా అయిన ఊసాగారికి జోహార్లు.
‍ -బండి దుర్గా ప్రసాద్

ఉద్యమాల సూరీడు
నల్లా నల్లని సూరీడు
పౌర హక్కుల సూరీడు
ధమ్మాన్ని ఆచరించిన సూరీడు
అంబేడ్కర్ ను తాత్విక పునాదిగా చేసుకున్న సూరీడు
వెలివాడల గుడిసెల్లో పొద్దుపొడుపు ఈ సూరీడు
పడమటి సంధ్య లో కుంకిన సూరీడు
సూరీడమ్మా... సూరీడు.. చీకటి సామ్రాజ్యాన్ని చీల్చే తొలి సంజె మా సూరీడు
(ఊ..సా.. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా,, అంబేద్కర్ రచనలను వివరిస్తూ.. ఈ దేశానికి లాల్ నీల్ కలయిక ఆవశ్యకత గురుంచి సైద్ధాంతిక భూమిక ను తయారు చేసిన వాడు... ఆయన మృతి పౌర ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు...జొహార్లు)
- చిలకంపల్లి కొండా రెడ్డి

పెద్దలు ఉ. సాంబశివరావు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. దాదాపు 20 ఏళ్ల ఉద్యమ పరిచయం. మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలు కానప్పటినుంచి దగ్గరగా చూస్తున్న వ్యక్తి ఉసా గారు. అన్నింటిలో ముందుండేవారు. ప్రత్యేక తెలంగాణ కు సీమాంధ్రులు వ్యతిరేకం అని సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రకటిస్తే.... ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు అనుకూలంగా ఉన్నారంటూ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ సంఘీభావ సభలు నిర్వహించి న వ్యక్తి. అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి... అస్తిత్వ పోరాటాలకు అండగా వుండే మనిషి. అలాంటి వ్యక్తి మరణం సమాజానికి తీరనిలోటు. ఆయనవేసిన బాటలో అనేకమంది నాయకులుగా ఎదిగారు ఆయనొక మార్గదర్శి. జోహార్ ఉసా సర్
- క్రాంతి కిరణ్

Keywords : U.Sambhashivarao, death, corona,
(2020-09-18 11:55:15)No. of visitors : 424

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


ఉద్యమాల