కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు


కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు

కుల

ఉ.సా(ఉప్పుమావులూరి సాంబశివరావు)గారి పేరు ఎరుగని రచన, ఉద్యమ ప్రియులు వారెవరూ రాష్ట్రంలో లేరు. అలాంటి ఈ ఉసా ఈ 25 అర్దరాత్రి కరోన మహామ్మరితో పోరాడి మరణించారు. 1951 పిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి తాలుకాలోని బ్రాహ్మణ కోడూరులో బిసి మంగలి కులంలో జన్మించారు. ఈ 69 ఏళ్లలో 20 ఏళ్లు విప్లవోధ్యమంలో, మరో 30 ఏళ్లు సామాజిక అస్థిత్వ, ప్రాంతీయ ప్రజాస్వామ్య ఉద్యమాలలో కొనసాగారు. రాష్ట్రంలో వివిధ ఉద్యమాలను నిర్మించిన ఉద్యమాకారుడిగా, ఆ ఉద్యమాలకు ఉపాధ్యాయుడిగా దశ - దిశను నిర్దెేశించిన సామాజిక సిద్దాంతవేత్తగా సుపరిచితుడు ఉసా. అలాంటి ఉసా గారి కోసం మాట్లాడుకోవడం అంటే తను జీవించిన జీవనవిధానం కోసం, తను నమ్మి ఆచరిస్తున్న సిద్దాంతం గురించి మాట్లాడుకోవడమే. అయితే గత 4 ఏళ్ళ‌క్రితం ఉసా గారి జీవిత సహచరి పద్మగారు కూడా మరణించారు. ఆయ‌న ఈ 49 ఏళ్లలో మొక్క‌వోని ధైర్యంతో మెజార్టీ బడుగువర్గ శ్రామిక ప్రజల పక్షాన, అగ్రకుల దళారీ దోపిడివర్గ పాలకులకు గులాంగిరి చేయకుండా స్వతంత్ర ప్రత్యామ్నాయంతో రాజీలేకుండా పోరాడుతూ నిలబడ్డ గొప్ప ఉద్యమకారుడు ఉసా.
ఉ.సాగారు మెజార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి భూమిక మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు దృక్పదంతో పాటు మహాత్మజ్యోతి భా ఫూలే, డా|| బిఆర్‌ అంబేద్కర్‌ల కులనిర్మూలన అవగాహ‌నను విమర్శనాత్మకంగా స్వీకరించి అలవర్చుకోవడమే. ఈ మార్క్సిస్టు దృక్పదాన్ని దేశీయ నిర్దిష్టపరిస్థితులకు తగ్గట్టు అన్వయించి ఈ దేశంలో సామాజిక విప్లవం తీసుకువచ్చే కార్యక్రమం అవసరమని నమ్మి ఆచరణలో కొనసాగుతున్న వ్యక్తి ఉ.సా. తాను కొనసాగిన యుసిసిఆర్‌ఐ-ఎంఎల్‌ విప్లవ పార్టీలో ఈ దేశంలో వర్గవ్యవస్థతో పాటు కులవ్యవస్థ ఉన్నదని చర్చరావడానికి గల కారణం 1985లో కారంచేడులో దళితులను అగ్రకుల భూస్వామ్య పెత్తాందారులు మారణహోమాన్ని సృష్టించడమే. కారంచేడులో జరిగిన ఘటన ʹదళితులపై భూస్వాముల దాడి-యుసిసిఆర్‌ఐ-ఎంఎల్‌ విప్లవ పార్టీ తరుపున‌ కరపత్రం వెలువడింది.ʹ అసలు ʹకారంచేడులో దళితులపై అగ్రకుల కమ్మ భూస్మాముల దాడి జరిగిందని ఈవిషయంపై కరపత్రం ప్రచురించి పంచి దళితులకు అండగానిలవాలన్నందునేʹ యుసిసిఆర్‌ఐ-ఎంఎల్‌ పార్టీ నుండి ఉసాను బ్రాహ్మణియ అగ్రకుల మార్క్సిస్టులు బహిష్కరించారు. అందుకు అగ్రకులాలు అని పేర్కోంటు కరపత్రంవేస్తే కమ్మకులస్తులు మన పార్టీకి సహ‌కరించరని, ఉన్నవాళ్లు పార్టీని వీడుతారనే కుంటిసాకులు చూపారు. ఈ కుంటిసాకులోనే అగ్రకులకులత్వం దాగి ఉందని గ్రహించి కుల-వర్గదృక్పదంతో ఎదురీత పత్రికతో అమరుడు కెజి సత్యమూర్తిగారితో ఎంఎల్‌సెంటర్ ను ఏర్పాటు చేసి ఉసా ప్రజలవద్దకు వెళ్ళ‌గలిగారు. కారంచేడు సంఘటన, మండల్‌ కమీషన్‌ ఉద్యమంతో సిపిఐఎంఎల్‌-జనశక్తి పార్టీ ఏర్పరచిన ʹడపోడంʹతో కులసమస్యపై కొన్నాళ్ళు ప్రయాణించారు. బిసి రిజర్వేషన్ల పెంపుదలకై బలమైన ఉద్యమాలు రావడంలో తెలుగు సమాజంలో రాజకీయ దిశనిర్దేశం చేయడంలో ఉపాధ్యయుడు ఉసాగారు ముందున్నారు.
అమరవీరుడు మారోజు వీరన్న1997 మే17గ్రూపుతో వివిధ సామాజిక ప్రజాస్వామ్య అస్థిత్వవాద ఉద్యమాలైన మాదిగా, చాకలి, గొల్లకురుమ, గౌడ, ఎరుకల, లంబాడ, తుడూందెబ్బ ఈ సంస్థలకు ఉమ్మడి సంగం అయినా దళిత బహుజన మహాసభను తదితర వాటిని, 1997లో మలి దశ తెలంగాణ ఉద్యమంతో దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలంటూ ఇండినైజ్‌ చేసే బృహత్తర కార్యక్రమానికి కార్యరూపం దాల్చాడు. ఇక్కడే (కుల సమస్యపై రాజకీయ విధానం వ్యాప్తి చెందించడంతో) ఉసాగారికి క్రమక్రమంగా మారోజువీరన్నతో బావసారుప్యత సహచర్యం ఏర్పాడింది.
ఇండియా తరహా సిద్దాంతం - ఆచరణ చేసే విప్లవపార్టీ అవసరమని అందుకు ఇండియా సంయూక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ(దళితబహుజన శ్రామిక విముక్తి) ఆవిర్భవాన్ని ఆహ్వనించారు. ఆనాటికే ఉసా ఆదివాసి గిరిజనుడు కాకపోయినా (తూర్పూగోదావరి జిల్లా) కొండమొదలులో గిరిజనులకు అస్థిత్వం గిరిజనేతర అగ్రకులాలు లేకుండా చేస్తున్నారనీ, అందుకు గిరజనులకు అండగా నిలిచి పోరాడడం జరిగింది. తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతంలో యుసిసిఆర్‌ఐఎంఎల్‌ పార్టీతరుపున రైతాంగా పోరాటాలు నిర్మించారు. మరోవైపు తాను స్త్రీ కాకపోయినా స్త్రీలపై బ్రాహ్మణీయ మగపెత్తందారి దోపిడి, వివక్షత, ఆధిప్యతం కొనసాగరాదనీ మరియు తెలంగాణేతరుడైనను తెలంగాణలో తెలంగాణేతరులైన కోస్తాంధ్ర అగ్రకుల దళారీ పాలకులు ఆధిపత్యం, దోపిడి, వివక్షత చేస్తున్నారని ఎదురీత తరుపున చర్చకు తెరలేపాడు. మారోజు వీరన్న సారద్యంలో అణగారిన కులాల ఐక్యదండోర-మహాజన ఫ్రంట్ ను అగ్రకుల కమ్మ ప్రభుత్వం నిర్విర్యం చేసే పన్నాగాన్ని భగ్నంచేసే, ʹదండోరాʹని అగ్రకుల పాలకులకు తాకట్టుకాకుండా ప్రత్యామ్నాయంతో ప్రజలపక్షాన రాజకీయ అధికారాన్ని కైవసం వైపుగా సమన్వయం చేసే క్రియశీల ఉపాధ్యాయ పాత్రను పోషించాడు ఉసా. అణ‌గారిన కులాల ఓట్లు అణగారిన కులాలే వేసుకొని రాజకీయాధికారం కైవసం చేసుకునే ప్రయత్నంలో ఫ్రంట్ తరుపునా 4% ఓట్లు సాదించిన ఘ‌నత మారోజుతో అణగారిన శ్రామిక కులాలప్రజలు, నాయకులతో పాటు ఉసా కృషిమరువలేనిది. ఒక్కమాటలో ఉద్యమశక్తులే రాజకీయ శక్తులుగా మారాలని నినదించారు ఉసా గారు. ఇదే క్రమంలో తెలంగాణ ఉద్యమానికి, వివిధ సామాజిక ప్రజాస్వామ్య, అస్థిత్వవాద ఉద్యమాలను విప్లవ పార్టీనాయకత్వంలో నిర్మించడం అవసరమని ఆకాంక్షించిన ఉద్యమకారుడు కూడా. మనోట్లు మనం వేసుకొని అధికారం చేజిక్కించుకోవడంకై ఉసా సారధ్యంలో మహాజన పార్టీ ఏర్పరిచినా అగ్రకులాల ధనధాహానికి, చిరంజీవి బూటకపు సామాజిక న్యాయ రాజ్యం కుట్రకి మహాజన పార్టీ రద్దుకావడం జరిగింది. ఈ ప్రజారాజ్యంతో నిజమైన సామాజిక ప్రజారాజ్యం సాధించబడదని ఉసా మాట్లాడిన సందర్భంలో ఉసాగారికి అండగా తెలంగాణ బహుజన విద్యార్ధి సంఘంతో పాటు వివిద కులనిర్మూలన వాదులు అండగా నిలబడడం జరిగింది. వీరన్న రూపొందించిన ఇండియాలో ఏం చేయాలనే కులవర్గ సిద్దాంతాన్ని తయారు చేయడంలో ఉసా సహకారపాత్ర పోషించారు. విప్లవోధ్యమం బలహినపడడంతో వివిధ అస్థిత్వవాద సామాజిక ప్రజాస్వామ్య, ప్రాంతీయ ఉద్యమాలకు బైటి నుండి తల్లికోడిలా నేటికి నిలబడిన మాటత్పని, మడమ తిప్పని బుద్దిజీవుడు ఉసా.
తాను నమ్మిన మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు దృక్పదానికి పూలే, అంబేద్కర్‌ల కులనిర్మూలన అంశాలను విమర్శనాత్మకంగా స్వీకరించడం అంటే తాను మంగలికులస్తుడైన దళిత బహుజన, ఆదివాసి గిరిజన, మైనార్టీ, మహిళ, అగ్రకుల పేద, కార్మీక, రైతాంగా, కూలీగా కాకపోయిన తీవ్రవివక్షత, దోపిడి, ఆధిపత్యం, అన్యాయాలకు ఎక్కువగురైయ్యే వారి పక్షాన నిలబడి సిద్దాంతాన్ని రూపొందించి ఆచరించడం ఆయన నైజం. ఉదహారణగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి వలస సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులేనని అందుకు సామాజిక తెలంగాణ మహాసభతో ప్రజా ఉద్యమ రాజకీయ దృక్పదం రూపొందించడంలో ఉద్యమాల ఉద్యమకారుడు ఉపాధ్యాయుడు. తెలంగాణ మాట ఎత్తని కాలంలో ఎత్తిన తెలంగాణ గొంతులో సామాజిక తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని యునివర్శిటిలో నినదించడంలో మా ఉద్యమాల ఉపాధ్యయుడి ఎదురీతతో ఏర్పాడినదే ఈ సామాజిక తెలంగాణ మహాసభ. సామాజిక తెలంగాణకోసం సిద్దాంతం, కార్యచరణ, నిర్మాణం ఉసా. అంతేకాదు కులంతో తీవ్రవివక్షత, దోపిడి, ఆధిపత్యం, అన్యాయాలకు గురిచేస్తున్న వలస సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులే సీమాంధ్ర ప్రాంత అణ‌గారిన బడుగువర్గ పేదలపై కూడా వివిధ సామాజిక వర్గాల సంఘాలను జేఏసిలుగా ఏర్పరచిన మొట్టమొది ఆంధ్రవాడు ఉద్యమకారుడు ఉసా. మరోమాటలో గులాంగిరి చేయని స్వతంత్ర ప్రత్యామ్నాయ కుల-వర్గ పోరాటవాది ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉసా అని చెప్పక తప్పదు.
ఆదర్శనీయమైన వ్యక్తిత్వం, స్పూర్తిదాయకమైన ఉద్యమతత్వం, మేదోపరమైన సైద్దాంతికతత్వాన్ని, నిత్య సత్యశోధక పరిశోధక తత్వాన్ని ఉసా అలవర్చుకున్నారు. అలాంటి ఉసాగారితో నాకు ఆత్మీయ ʹగురుశిశ్యులʹ అనుబందం 10ఏళ్లుగా ఏర్పడి కొన‌సాగింది. ఉసా 69ఏళ్ల జీవితంలో 49 ఏళ్లు ప్రజలపక్షాన ప్రత్యామ్నాయ విప్లవవాదిగా జీవించడం అరుదైన చారిత్రక విషయం. అలాంటి ఉపాధ్యయుడు ఉసా మరణించడం విషాధాన్ని, దుంఖాన్ని మిగిల్చింది. నిబద్దతో, నిజాయితితో ప్రజలపక్షాన నిలబడి జీవిస్తూ, ఆచరించిన ఉసాకి జోహార్లు.
పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ, రాష్ట్రప్రధాన కార్యదర్శి
సెల్‌ నం: 9948872190

Keywords : u.sambhashivarao, uccriml, veeranna
(2020-09-18 21:28:50)No. of visitors : 262

Suggested Posts


0 results

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


కుల