ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే


ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే

ఉద్యమాల

కొందరు ప్రజల కోసమే జీవిస్తారు. వారి కుటుంబం, వ్యాపకం, అన్ని ప్రజా ఉద్యమాలతోనే ముడిపడి ఉంటాయి. ఉద్యమాల వలన కలిగే బాధలను సుఖాలు గా, మనుషులను ఆస్తులుగా భావిస్తారు. సమాజ శ్రేయస్సే తమ శ్రేయస్సని, బాధలు,దోపిడీ,లేని నవ సమాజం కోసంకలలు కంటారు. ఆ కలల సాకారం కోసం తమ జీవితాన్ని వెచ్చిస్తారు. ఆ కోవకు చెందిన వాడే మన ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సాంబశివరావు(ఉసా). నాకు ఊహ (సామాజిక స్పృహ) తెలిసినప్పటి నుండి ఉసా,నాకు తెలుసు. చాలాకాలం కలిసి పని చేశాం కూడా. ఆయన యూ సి సి ఆర్ ఐ ఎం ఎల్,లో పని చేసినా, సి పి ఎస్ ఐ ( వీరన్న)తో కలిసి నడిచినా, దళిత, బహుజన ఉద్యమాలతో మమేకమైనా, నిన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడినా, ఎప్పుడూ ఆయన దళిత, బహుజన,పీడిత ప్రజా పక్షం వైపు నిలిచారు. అలాంటి అనేక ప్రజా ఉద్యమాలలో తనదైన గళాన్ని వినిపించారు. ఉద్యమకారుడిగా, ఉపన్యాసకుడిగా, ప్రజా ఉద్యమ కారులందరికీ ఆత్మీయుడు ఉసా. జనశక్తి నుండి వీరన్న విడిపోయి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించినప్పుడు, ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం, బి డి ఎస్ ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నేను పని చేశాను. ఆ కాలంలో వీరన్న నెలకొల్పిన అనేక కుల హక్కుల పోరాట సంఘాల, సదస్సులు, సెమినార్లు అన్నింటికీ ముఖ్య వక్త ఉసా నే. ఈ దేశంలో కులము దాని నుండి ఏర్పడ్డ అనిచివేతను పారద్రోలేందుకు, అనగారిన వర్గాలు రాజ్యాధికారం పొందేందుకు, దోపిడీ, పీడన లను అంతమొందించేందుకు, ఆయన గళం ఎప్పుడూ నినదించింది. సునిశితమైన పరిశీలనతో కూడిన ఆయన ఉపన్యాసాలు, వాగ్దాటి ఎప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. నేను వందకు పైగా ఉపన్యాసాలు ఉసా, వి విని ఉంటాను. విన్న ప్రతిసారి ఒక క్రొత్త విషయాన్ని, నేర్చుకునే లాగా ఉంటాయి. నచ్చని వాళ్ళు నొచ్చుకున్న సరే, విషయాన్ని సూటిగా, విశ్లేషణాత్మకంగా, ప్రసంగించి అందర్నీ మంత్రముగ్దులను చేయడంలో ఉసా అగ్రగణ్యుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య శత్రు వైరుధ్యాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా ఆంధ్ర ప్రాంతంలో సదస్సు పెట్టిన సాహసి. అందుకే ఆయన ఉద్యమాల ఉపాధ్యాయుడయ్యారు. ఇట్లాంటి గొప్ప ప్రజా ఉద్యమకారుడు, మరణించడం, దళిత బహుజన విప్లవ ఉద్యమాలకు తీరని లోటు. ఇంకా చాలా కాలం బతికి ఉండాల్సిన, వయసులో, కోవిడ్ వ్యాధితో,మరణించి మనందరికీ దూరమైన, గొప్ప ఉద్యమకారుడు కి లాల్, నీల్ సలాం.
బిజిగిరి శ్రీనివాస్,ఎడిటర్ నినాదం దినపత్రిక

Keywords : u.sambhashivarao, uccriml, veeranna,
(2020-08-10 03:02:23)No. of visitors : 196

Suggested Posts


0 results

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


ఉద్యమాల