భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్


భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్

భీమా

భీమాకోరేగావ్ (ఎల్గర్ పరిషద్) కేసులో ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హానీ బాబును ఎన్నైఏ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 2018 నుండి కొనసాగుతున్న అరెస్టుల పరంపరలో ఇది 12వది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ విప్లవకవి వరవర‌రావు, ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నావాలఖా, సుధాభరద్వాజ్, షోమాసేన్, మహేష్ రావత్, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, అరుణ్ ఫెరీరా, సుధీర్ ధావ్లే, వెర్నన్ గొంజాల్వేస్ లను గతంలోనే అరెస్టు చేయగా ఇప్పుడు ప్రొఫెసర్ హానీబాబును అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో నివసిస్తున్న హనీ బాబు ముసలియర్‌వెట్టిల్ తారైల్ ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అదే యూనివర్సిటీలో పని చేసిన‌ ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టు తర్వాత సాయిబాబా పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా హానీ బాబు గళమెత్తారు.
మరో వైపు హానీ బాబు అరెస్టును ʹక్యాపెయిన్ అగేనిస్ట్ స్టేట్ రిప్రషన్ʹ తీవ్రంగా ఖండించింది. భీమా కోరేగావ్ కేసులో తప్పుడు సాక్ష్యాలు అందించమని ఎన్నైఏ కొంత కాలంగా హానీబాబును వేధిస్తోందని, అతను ఒప్పుకోకపోవడంతో అతని ఆకేసులో ఇరికించారని ఆ సంస్థ ఆరోపించింది. ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన...

2019 సెప్టెంబర్‌లో ప్రొఫెసర్ బాబు నివాసంలో మహారాష్ట్ర పోలీసులు తన సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేశారు. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే జప్తు చేసిన పరికరాలకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు ఇవ్వలేదు. వాటి ద్వారా కల్పిత సాక్ష్యాలు సృష్టించారనేది అర్దమవుతున్నది.
ఇది రాజ్యాన్ని ప్రశ్నించే, అట్టడుగు,అణగారిన కులాలు,తరగతులు,వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులను వేధించడం బెదిరించడం కోసమే పాలకులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొఫెసర్ బాబు కుల వ్యతిరేక కార్యకర్త, విశ్వవిద్యాలయ లోపల,బైట‌ సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారు. డాక్టర్ జి.ఎన్. సాయిబాబా యొక్క రక్షణ మరియు విడుదల కమిటీ , రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్పీపీ) లో ఆయన భాగస్తుడు. ఉన్నత విద్యాసంస్థలలో కుల వివక్ష, రాజకీయ ఖైదీల హక్కుల గురించి ఆయన మాట్లాడారు.

రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరు మూయించడం, భీమా కోరెగావ్ వద్ద జరిగిన హింసాకాండకు పాల్పడిన సంభాజీ భిడే మరియు మిలింద్ ఎక్బోట్ వంటి ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్న వారి నుండి దృష్టిని మళ్ళించడానికి ఎన్నైఏ ఈ కుట్రలకు పాలడుతోంది.
ఇది ప్రజాస్వామ్య , ప్రగతిశీల భావాలుగల‌ విద్యావేత్తలు, కార్యకర్తలు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కవులు మరియు ట్రేడ్ యూనియన్లలో భయాన్ని వ్యాప్తి చేయడానికి జరుగుతున్న కుట్ర. ఈ కుట్రలను ఓడించడానికి సమాజంలోని ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని హానీబాబుతో సహా అనేక మందిని అరెస్టులు చేయడాన్నిఖండించాలని క్యాంపెయిన్ ఎగైనెస్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) కోరుతోంది.

1. కల్పిత భీమా కోరేగావ్ కేసులో అభియోగాలు మోపిన కార్యకర్తలు, మేధావులందరినీ వెంటనే విడుదల చేయాలి.
2.అక్రమంగా అరెస్టు చేసిన‌ CAA, NRC, NPRవ్యతిరేక కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
3. రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి.
4. UAPA, PSA, NSA మరియు ఇతర రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

క్యాంపెయిన్ ఎగైనెస్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR)

Keywords : bhima koregaon, Prof. Hany babu, Saibaba, Varavararao, NIA
(2020-09-27 12:41:39)No. of visitors : 490

Suggested Posts


అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC

భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీ బాబును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముంబయిలో అరెస్టు చేయడాన్నిరాజ్య అణచివేత వ్యతిరేక కేంపెయిన్ (సిఎఎస్ఆర్) ఖండిస్తూంది. ఢిల్లీ, ముంబైలలో COVID-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, NIA ఢిల్లీ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ బాబును సాక్షిగా రమ్మని పిలవడంతో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడే

భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్

జనవరి 1, 2018 న భీమా కోరెగావ్‌లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అవకాశంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తోంది. ఈ విషయం చర్చించడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ సెప్టెంబర్ 10 న ముంబైలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Search Engine

బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ
సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!
విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 25న దేశవ్యాప్త ఆందోళనలను జయప్రదం చేద్దాం -TDF
ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్
భారతదేశ జైళ్ళలో 50 శాతం ‌దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే ఎందుకున్నట్టు ?
మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
more..


భీమా