అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC

అక్రమంగా

భీమాకోరేగావ్ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హానీ బాబును విడుదల చేయాలంటూ పౌరహక్కుల సంఘం, తెలంగాణ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....

మానవ హక్కుల కార్యకర్తలపై NIA చేస్తున్న కుటిల దాడులను ఆపివేయాలి!
రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలి!

భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీ బాబును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముంబయిలో అరెస్టు చేయడాన్నిరాజ్య అణచివేత వ్యతిరేక కేంపెయిన్ (సిఎఎస్ఆర్) ఖండిస్తూంది.
ఢిల్లీ, ముంబైలలో COVID-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, NIA ఢిల్లీ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ బాబును సాక్షిగా రమ్మని పిలవడంతో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని తిరస్కరించడంతో ముంబైకి వెళ్ళక తప్పలేదు. 2020 జూలై 24 నుండి ఎన్ఐఏతో సహకరిస్తున్న ప్రొఫెసర్ బాబుకు, ప్రశ్నించడం అంటే కేవలం ఇతరులపై తప్పుడు సాక్ష్యాలను ఇవ్వమనీ, తాను మావోయిస్టుల కోసం పని చేస్తున్నాననే అబద్ధపు ఆరోపణలను ఒప్పించడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని త్వరలోనే స్పష్టమైంది.
ప్రొఫెసర్ బాబు ఈ అసంబద్ధమైన అబద్ధాలను తీవ్రంగానూ, ఖచ్చితంగానూ నిరాకరించారు. ఈ కారణంగానే, విచారణ పేరిట ఐదు రోజుల నిరంతర వేధింపుల తరువాత, తన కార్యాలయంలోనే ఉన్నప్పటికీ, అతన్ని నిందితుడిగా మార్చి, అధికారికంగా అరెస్టు చేసి, విచారణ కోసం ఎన్‌ఐఏ తిరిగి కస్టడీకి యివ్వాలని కోరడం ఎంతో అసంబద్ధమైన విషయం. 2019 సెప్టెంబర్‌లో ప్రొఫెసర్ బాబు ఇంటిపైని మహారాష్ట్ర పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేశారు. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకుని, జప్తు చేసిన పరికరాల హాష్ విలువ ఇవ్వలేదు. ఈ నియమ ఉల్లంఘన వల్ల స్వాధీనం చేసుకున్న పరికరాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం వుంటుంది.
జప్తు చేసిన పరికరాల హాష్ విలువను యివ్వడానికి దర్యాప్తు సంస్థలు పదేపదే నిరాకరించాయి. ఈ విలువల వల్ల పరికరంలో జరిగిన కార్యకలాపాల సమయాన్ని తెలుసుకోవచ్చు. అయితే వాస్తవానికి, పరికరాలను జప్తు చేయడం, వాటిలో కల్పిత సాక్ష్యాలను పెట్టడం, ఆ ప్రాతిపదికన మీడియా ట్రయల్ నిర్వహించడం వంటి విధానాలు అమలుచేస్తున్నారని స్పష్టమైపోయింది. అయినా దురదృష్టవశాత్తు, కోర్టులు కూడా ఈ అక్రమాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇది రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న, అట్టడుగు, అణగారిన కులాలు, సముదాయాలు, వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులను క్రూర వేధింపులకు గురిచేయడం, బెదిరించడం తప్ప మరొకటి కాదు. ప్రొఫెసర్ బాబు కుల వ్యతిరేక కార్యకర్త, విశ్వవిద్యాలయం లోపలా, బయటా కూడా సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారు. డాక్టర్ జి.ఎన్. సాయిబాబా రక్షణ- విడుదల కమిటీ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి) లో కూడా పనిచేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలలో కుల వివక్ష, మరణశిక్షలకు వ్యతిరేకంగానూ, రాజకీయ ఖైదీల హక్కుల కోసమూ ఆయన మాట్లాడుతున్నారు.
రాజ్య ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడుతున్న కార్యకర్తలను నిర్బంధించి, నిశ్శబ్దం చేయటానికి భీమా కోరెగావ్ వద్ద జరిగిన హింసాకాండ తరువాత చేస్తున్న కుట్ర అని హనీ బాబును ఎన్ఐఏ అరెస్ట్ చేయడంలో తెలుస్తోంది. హింసకు నిజమైన కారకులు, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్న సంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటేల నుండి దృష్టిని మళ్ళించడానికి కూడా ఇది జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య, ప్రగతిశీల విద్యావేత్తలు, కార్యకర్తలు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కవులు, కార్మిక సంఘాల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించబడింది. ఈ అరెస్ట్ తరువాత ప్రొఫెసర్ బాబును అర్బన్ నక్సల్ గా ముద్ర వేసే అవకాశం వున్నదని వూహించవచ్చు. కల్పిత సాక్ష్యాలను సృష్టించడం తప్ప ఈ ఆరోపణలు నిరూపించలేనివిగా, ఆధారాలు లేనివిగా ఉంటాయి, ఇవి ఎలాగూ న్యాయమైన విచారణ పరిశీలనలో నిలబడవు.
ఏదేమైనా, అనేక సందర్భాల్లో చూసినట్లుగా, అపరాధాన్ని నిరూపించడం కాదు, రాజ్య ప్రాయోజిత మీడియా వేటాడుతూ రాక్షసంగా చిత్రిస్తుంటే, సుదీర్ఘకాల ఒంటరితనం నిర్బంధాల ద్వారా శిక్షించడమే ఇందులోని ఉద్దేశ్యం. విప్లవకవి వరవరరావు, డాక్టర్ జి.ఎన్. సాయిబాబా, ప్రొఫెసర్ ఆనంద్ తేటెల్తుంబ్డే తదితరుల విషయంలో చూసినట్లుగా లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల జీవన హక్కును పరిగణనలోకి తీసుకోకుండా ఈ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
మన సమాజంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ప్రొఫెసర్ హనీ బాబు అరెస్టును, మరింకెంతోమంది కార్యకర్తలు, కళాకారులు, జర్నలిస్టులపై జరుగుతున్న అరెస్టు బెదిరింపులను ఖండించాలని పౌర హక్కుల సంఘం.
డిమాండ్స్:
1. కల్పిత భీమా కోరేగావ్ కేసులో అభియోగాలు మోపిన కార్యకర్తలు, మేధావులందరినీ వెంటనే విడుదల చేయాలి!
2. CAA, NRC, NPR వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలి!
3. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి! రియు జైళ్ళలో రద్దీని తగ్గించాలి!
4. UAPA, PSA, NSA సహా అన్ని ఇతర కఠినమైన చట్టాలను రద్దు చేయాలి!

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.

పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
జులై 28, 2020....
హైదరాబాద్...

Keywords : bhima koregaon, prof.Hany babu, NIA, Delhi University
(2024-04-14 21:14:44)



No. of visitors : 897

Suggested Posts


భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్

భీమాకోరేగావ్ (ఎల్గర్ పరిషద్) కేసులో ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హానీ బాబును ఎన్నైఏ పోలీసులు అరెస్టు చేశారు.

ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్

భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేయబడ్డ జార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామితో సహా మొత్తం 16 మంది సామాజిక, హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ

భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్

జనవరి 1, 2018 న భీమా కోరెగావ్‌లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అవకాశంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తోంది. ఈ విషయం చర్చించడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ సెప్టెంబర్ 10 న ముంబైలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌

10,000 పేజీలకు పైగా వున్న ఈ చార్జిషీట్ లో మొత్తం ఎనిమిది మంది కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) భావజాలాన్ని మరింత వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అక్రమంగా