ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

ఇది

భీమా కోరేగావ్ కేసులో 12 వ నిందితుడిగా అరెస్టు చేయబడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హానీ బాబు ఇంటిపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం మళ్ళీ దాడులు నిర్వహించింది. దీనిపై స్పంధించిన హానీ బాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా న్యాయపోరాటం చేస్తామని, దేనికీ భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.

మిరాండా హౌస్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ʹʹమీరు హానీ బాబు లాగా న్యాయం కోసం మాట్లాడితే, మీరు కూడా అదే పరిణామాలను ఎదుర్కొంటారని ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సందేశం ఇస్తోంది. మేము వామపక్షవాదులం కూడా కాదు కాని మాపై మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారు. వారు మనకు తెలియని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇది భయపడే సమయం కాదు, ప్రతిఘటించే సమయం ʹʹ అన్నారు

2018 తర్వాత హానీబాబు ఇంటిపై దాడి చేయడం ఇది రెండోసారి. ʹʹసాయిబాబా రక్షణ మరియు విడుదల కమిటీ నగదు రసీదులను NIA స్వాధీనం చేసుకుంది. నాకు వాటి లెక్క కూడా చెప్పకుండా NIA హార్డ్ డ్రైవ్‌లు తీసుకుంది కాబట్టి వారు కోర్టులో ఏమి చెబుతారో నాకు తెలియదు. మీరు పరికరాలను తీసుకోవడానికి వీలు లేదని నేను వారికి చెబుతూనే ఉన్నాను. అయినా వాళ్ళు వినలేదుʹʹ అన్నారామె.

"విశ్వవిద్యాలయం వెలుపల నిరసనకు కూడా అడుగు పెట్టని వ్యక్తికి, రాజ్యాంగానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నవ్యక్తిపై వాళ్ళు మావోయిస్టు ముద్ర ఎలా వేస్తారు? ఒక వేళ పత్రాలలొ, కంప్యూటర్ లలో మమ్ములను దోషులుగా తేల్చే విషయాలు ఉంటే మేము పోలీసులు వచ్చే వరకు వాటిని ఎందుకు ఉంచుతాముʹʹ అని ప్రశ్నించిది డాక్టర్ జెన్నీ రోవేనా

"విద్యార్థులు మాట్లాడలేరు, ఉపాధ్యాయులు మాట్లాడలేరు, ఇది ఫాసిజం. కరోనా మహమ్మారి లేకపోతే,ఢిల్లీ యూనివర్సిటీలో చెలరేగే నిరసనలను ఊహించుకోండి. ఈ మహమ్మారి కన్నా ముందు చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ఇప్పుడు కరోనా లేకపోతే ఆ నిరసన‌ ఈసారి ఇంకా భారీగా ఉండేది" అని ఆమె అన్నారు.

"నా కళాశాల స్నేహితుల నుండి బాబు స్నేహితుల వరకు ప్రతి ఒక్కరూ మాకు తమ మద్దతును ప్రకటించారు. అది మాకు అతిపెద్ద బలం." అని ఆమె తెలిపారు.

"వాళ్ళను ఎదుర్కొనేందుకు నా కుటుంబం, హానీ బాబు సిద్దంగా ఉన్నాముʹʹ అన్నారు డాక్టర్ జెన్నీ రోవేనా

Keywords : hany babu, delhi university, Jenny Rowena, bhima keregaon, elgar parishad
(2024-04-14 10:44:40)



No. of visitors : 817

Suggested Posts


Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee

We would like to extend our appreciation of the directions made by you on 12.05.2020, liberalizing the conditions for the release of undertrial prisoners in Maharashtra jails, and also clarifying that those undertrials who are otherwise excluded from this category (including those who are charged under Special Acts such as UAPA, NDPS etc) are eligible to

భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు

దళితుల ఐక్యత కు, పోరాటానికి చిహ్నమైన భీమా కోరేగావ్.. పాలకులను ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన భీమా కోరేగావ్ లో దళితులు నిర్వహించిన‌ విజయోత్సవాలపై దుర్మార్గమైన దాడులు చేసి దళితుల మరణానికి, వందలాది మంది గాయాలపాలవ్వడానికి కారణమైన హిందూ మతోన్మాద ఉగ్రవాదులను వదిలేసిన పోలీసులు దళితులకు మద్దతుగా నిలబడ్డవారిపై విరుచుకపడుతున్నారు.

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...

భీమా కోరేగావ్ / ఎల్గర్ పరిషథ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసింది ఎన్ ఐ ఏ. కళా కారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే రమేష్ గైచోర్ల ను నిన్న(సెప్టంబర్7, 2020) అరెస్టు చేయగా కళాకారిని, రచయిత, దళిత కార్యకర్త జ్యోతీ జగతాప్ ను ఈ రోజు (సెప్టంబర్ 8, 2020)అరెస్టు చేశారు. దీంతో భీమా కోరేగావ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టయినవాళ్ళ సంఖ్య 15కు చేరుకుంది.

ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు డాక్టర్ పికె విజయన్, రాకేశ్ రంజన్‌లకు ఎన్ఐఏ సమన్లు పంపడాన్ని ఖండించండి!

హిందూ కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు డాక్టర్ పి.కె. విజయన్, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌ లో ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాకేశ్ రంజన్‌లు ఇద్దరూ విశ్వవిద్యాలయ సముదాయానికి దశాబ్దాల జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్తలు. వారు ప్రజాస్వామిక హక్కులు, ఉన్నత విద్య అందుబాటు మరియు కుల, వర్గ, సముదాయ ప్రాతిపదికన వివక్ష వంటి సమస్యలపై పని చేశారు.

ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ

భీమా కోరే గావ్ కేసులో నిన్న అరెస్టు కాబడిన కబీర్ కళా మంచ్ కళాకారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే , షాహిర్ రమేష్ గైచోర్ లను ఎన్ ఐ ఏ కొంత కాలంగా విచారణ పేరుతో వేధిస్తోంది. ప్రధాని హత్యకు కుట్ర కేసులో సాక్షులుగా మారాలని

కరోనా కాలంలో...ఆనంద్ తేల్తుంబ్డే కు తాత్కాలిక బెయిల్ తిరస్కరించిన కోర్టు

ఎల్గర్ పరిషత్ - భీమా కోరెగావ్ కేసులో నిందితుడు విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే వైద్య కారణాలపై దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టు అతన్ని తలోజా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

స్టాన్ స్వామి మృతికి నిర‌స‌న‌గా జైల్లో నిరాహార దీక్ష‌

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో నిందితులుగా తలోజా జైల్లో ఉన్న పది మంది హక్కుల కార్యకర్తలు నిరాహార దీక్ష‌కు దిగారు. త‌మ‌తో పాటు స‌హ నిందితుడిగా ఉన్న‌ ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్యంతో మృతి చెంద‌డానికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ వీరు ఒక రోజు నిరాహార దీక్ష‌ను చేప‌ట్టారు.

ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc

వరవరరావు, ప్రొఫెసర్‌ షోమాసేన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌ టెల్టుంట్లే, గౌతమ్‌ నవలాఖా లాంటి మేధావులను,సుధా భరద్వాజ్‌ లాంటి న్యాయవాదులను, మరికొద్దిమంది బుద్ధిజీవులను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైళ్ళలో నిర్పంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన గురిని మరికొద్దిమందిపైకి ఎక్కుపెట్టింది. మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమకారు

అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹ

ఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అవడానికి వెళ్లబోతూ, ఈ వారం బైట గడపడానికి, నాకొక వారం స్వేచ్ఛ ఇవ్వడానికి ఏప్రిల్ 8న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇచ్చిన తీర్పుకు సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, ఈ లాక్ డౌన్ సమయంలో కూడ, ఒక వారం రోజుల స్వేచ్ఛ అంటే చాల విలువైనది.

Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR

The Campaign Against State Repression (CASR) condemns the arrest of Professor Hany Babu MT at Mumbai by the National Investigation Agency (NIA) in connection with the Bhima Koregaon-Elgaar Parishad case.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇది