పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు

పాలకుల


డాక్టర్ హరేంద్ర రావత్ అనే వ్యక్తి యిచ్చిన ఫిర్యాదు మేరకు డెహ్రాడూన్ పోలీసులు జూలై 31 న అర్ధరాత్రి ʹసంధ్యా దైనిక్ʹ అనే దినపత్రిక క్రైమ్ స్టోరీ సంపాదకుడు రాజేష్ శర్మ ఇంటిపై దాడి చేసి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతని పట్ల‌ జర్నలిస్టు పట్ల వ్యవహరించాల్సిన తీరుగా కాక ఓ గ్యాంగ్ స్టార్ తో వ్యవహరించిన పద్దతిలోవ్యవ‌హరించారు పోలీసులు.‌ డెహ్రాడూన్ పోలీసుల ఈ దుశ్చర్యలన్నీ సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
నిన్న కోర్టు హాజరు సమయంలో... జైలులో లేదా పోలీసు కస్టడీలో తన హత్య జరిగే అవకాశం వుందని జర్నలిస్టు రాజేష్ జడ్జి ముందే సందేహం వ్యక్తం చేశాడు. ఒక జైలుపోలీసు అధికారి ద్వారా అతనికీ ఈ విషయం తెలిసింది. రాజేష్ శర్మను అరెస్ట్ చేసిన తరువాత, ఒక పోలీసు అధికారి అతనికి పిస్టల్ గురి పెట్టి, "ప్రభుత్వమూ, పోలీసు అధికారులు మాతో ఉన్నప్పుడు, మేం ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది" అని కూడా అన్నాడు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తన అరెస్టు జరిగిందని జర్నలిస్ట్ ఎడిటర్ రాజేష్ శర్మ ఆరోపించారు. ఈ ఆరోపణ వెనుక ఒక బలమైన ఆధారం ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ రాజేష్ శర్మపై ఫిర్యాదు చేసిన డాక్టర్ హరేంద్ర రావత్ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండటమే కాకుండా మాజీ సలహాదారుగా కూడా ఉన్నారు, ఉత్తరాఖండ్ ప్రభుత్వవ్యవహారాల్లో జోక్యం చేసుకొంటూ ఉంటాడు. రాజేష్ శర్మ ఈ వారం క్రైమ్ స్టోరీలో SIDCUL(The State Industrial Development Corporation of Uttarakhand Limited) కుంభకోణంపై రెండు కథనాలు రాశాడు. ఇప్పుడు SIDCULకుంభకోణంకి సంబంధించిన ఫైళ్ళన్నీ మాయమైపోయాయి.

ముఖ్యమంత్రి సన్నిహితుడి అవినీతిని బహిర్గతం చేసిన నలుగురు జర్నలిస్టులపై రాజద్రోహం కేసు


ముఖ్యమంత్రి అవినీతిని బహిర్గతం చేసిన నలుగురు జర్నలిస్టులు ఉమేష్ శర్మ, రాజేష్ శర్మ, ఎస్పీ సెమ్వాల్, అమృతేష్ చౌహాన్ లపై రాజద్రోహం కేసు నమోదైంది.ఈ జర్నలిస్టులు తప్పుడు వార్తలను ప్రచురించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని చార్జిషీట్ పేర్కొంది. జూలై 31 అర్ధరాత్రి రాజేష్ శర్మను ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ శర్మ సంబంధిత పత్రాలను ఉమేష్ శర్మకు అందించినట్లు ఆరోపించారు.
ఈ విషయంపై దర్యాప్తు కోసం డిఐజి అరుణ్ మోహన్ జోషి, ఎస్పీ క్రైమ్ లోక్‌జిత్ సింగ్ నాయకత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) ఏర్పాటు చేశారు. జూలై 7న డాక్టర్ హరేంద్ర సింగ్ రావత్ ఇచ్చిన వాంగ్మూలంలో, కొంతకాలం క్రితం తన పరిచయస్తుడు జ్యోతి విజయ్ రావత్ జర్నలిస్ట్ ఉమేష్ శర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తనకు చెప్పాడని డిఐజి జోషి తెలిపారు. డీమోనిటైజేషన్ సమయంలో జార్ఖండ్‌కు చెందిన అమృతేష్ చౌహాన్ అనే వ్యక్తి తనను జార్ఖండ్ గో సేవా కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి లంచం డబ్బును ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు అందించడానికి డాక్టర్ హరేంద్ర రావత్, అతని భార్య సవితా రావత్ బ్యాంకు ఖాతాల్లో వేశారని ఆ వీడియోలో వున్నది. ఈ డబ్బు లావాదేవీకి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా వీడియోలో చూపించారు. అలాగే, వీడియోలో, డాక్టర్ హరేంద్ర సింగ్ భార్య, ముఖ్యమంత్రి భార్యకు స్వయానా అక్క అవుతుందని కూడా అన్నారు. ఉమేష్ శర్మ, అమృతేష్ చౌహాన్‌ లు తమ ఇతర సహచరులతో కలిసి తమ వ్యక్తిగత సమాచారాన్ని కుట్రపన్ని, చట్టవ్యతిరేక ఫద్ధతులలో స్వాధీనం చేసుకుని బహిర్గతం చేశారనేది ఆరోపణ.
గెజిటెడ్ అధికారి దర్యాప్తులో చెప్పిన విషయాలు, పత్రాలు నకిలీవని తెలిసాయి. నిందితుడు ఉమేష్ శర్మ తన ఇతర సహచరులతో కలిసి న్యూస్ ఛానల్స్, పోర్టల్ లలో తప్పుదోవ పట్టించే వార్తలను ప్రసారం చేశారని, నిందితుడైన ఉమేష్ తో పాటు అమృతేష్ చౌహాన్, ఎస్పీ సెమ్వాల్, రాజేష్ శర్మలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో తప్పుదోవ పట్టించే పత్రాలతో, తప్పుదోవ పట్టించే వీడియోను ప్రసారం చేశారని చార్జ్ షీట్ లో ఆరోపించారు.
ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ జర్నలిస్ట్ దీప్ మైతాని ఇలా అన్నారు- "అద్భుతమైన ఉత్తరాఖండ్! గోసేవా కమిషన్‌లో ఛైర్మన్ పోస్టును 50 లక్షలకు పంపిణీ చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిపై అభియోగం వచ్చింది. ఆ పదవి కోసం డబ్బులు ఇచ్చిన అతను లైవ్ వీడియోలో ఆ విషయాన్ని ఒప్పుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఒక సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ఉమేష్ కుమార్ పై దేశద్రోహ కేసు పెట్టించానని కూడా చెప్పాడు. అంతే కాదు, ముఖ్యమంత్రి సలహాదారు ఆడియో, ఇతర సలహాదారుల స్టింగ్ ఆపరేషన్ వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రసారంలో వున్నాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు ఈ ఒప్పందాన్ని చేయించారని, పైసలు యిచ్చిన వారిని సంయమనం పాటించమని సలహా ఇస్తున్నారని ఈ వీడియోలో స్పష్టంగా వుంది. అయితే ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఈ సంఘటనను వెల్లడించిన విలేకరుల మీద కేసు పెట్టారు. వాట్సాప్ స్క్రీన్ షాట్ నుంచి బ్యాంక్ ఖాతాల రసీదుల వరకు నకిలీవిగా ప్రకటించి జర్నలిస్టులు అబద్ధాలు చెబుతున్నట్లుగా రుజువుచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గొప్ప నైతిక వాదిగా, ఆదర్శవాదిగా నటించే ఈ ప్రభుత్వ చర్యలకు, మాటలకు చాలా తేడా ఉంది. మాఫియాలను కాపాడటం దగ్గర నుండి తమకు కావలసిన వారికి పదవులను పంపిణీ చేయడం వరకు ప్రభుత్వం చేసే ప్రతి చర్య ప్రజల ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో వుంది. నిజం రాయడం, చెప్పడం నేరంగా మారింది. నిర్భయమైన జర్నలిజం గొంతును అణచివేయడానికి జైలుకు పంపడం ఇప్పుడు ప్రభుత్వానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం. ఈ ప్రజా వ్యతిరేక నియంతృత్వానికి వ్యతిరేకంగా మా నిరసన చివరి శ్వాస వరకు కొనసాగుతుంది! ʹʹ

ప్రభుత్వానికి సన్నిహితంగా వున్న మైనింగ్ మాఫియాపై వార్త ప్రచురించినందుకు ఇద్దరు పాత్రికేయులపై కేసు

"కోట్‌ద్వార్‌లో నది వెంబడి ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల నది ఒడ్డున నివసిస్తున్న ప్రజలకు కలిగే ఇబ్బందులు, వారు ఎదుర్కోబోతున్న ప్రమాదం, ఇళ్లపై కలిగే దుష్ప్రభావం మొదలైన విషయాలపై నివేదిక ప్రచురించిన జర్నలిస్టులు రాజీవ్ గౌర్, ʹకర్మభూమి సందేశంʹ ప్రధాన సంపాదకుడు ముజిబ్ నైతానిలపై నకిలీ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు."అని పహార్ టివి బ్యూరో చీఫ్ నవల్ ఖలి చెప్పారు.
"మే 30న మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా మీడియాలో రిపోర్టు వచ్చాక, అదే రోజు శైలేంద్ర బిష్ట్ గర్హ్వాలి, మహేంద్ర బిష్ట్ అనే దుండగులు కర్మభూమి టివి ఎడిటర్ రాజీవ్ గౌర్‌పై ప్రాణాంతక దాడి చేసి తల పగలగొట్టారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తే అప్పటికే మాఫియా మాటలు విన్న పోలీసులు రాజీవ్ గౌర్ పైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ వారికి మైనింగ్ మాఫియా మాటలు మాత్రమే వినిపించాయి. అయితే జూలై 21న ఉత్తరాఖండ్ హైకోర్టు అరెస్ట్ వారెంట్‌ను ఆపుతూ ఆదేశాన్నిచ్చింది.
"రిపోర్టింగ్ కారణంగా, జర్నలిస్ట్ దీప్ మైథాని, గుణానంద్ జఖ్మోలాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. చాలా సందర్భాలలో 467, 460, 469 సెక్షన్లు కింద కేసులు పెడుతున్నారు.

సింగ్తాలి వంతెననిర్మాణం గురించి రిపోర్టు చేసినందుకు ʹపర్వత్‌జన్ʹ పత్రిక జర్నలిస్టుపై కేసుల నమోదు

టెహ్రీ - పౌరిని కలిపే సింగ్తాలి వంతెన, గర్హ్వాల్ - కుమావు నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఈ వంతెన అప్పటి భారతీయ జనతా పార్టీకి చెందిన ఉపరితల రవాణా మంత్రి జనరల్ ఖండూరి కలల ప్రాజెక్ట్. సుదీర్ఘ పోరాటం తరువాత, సింగ్తాలి వంతెన నిర్మాణ ప్రాజెక్ట్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. ఆ తరువాత, వంతెనను నిర్మించడానికి టెండర్ వేయవలసి ఉంది. కానీ బిజెపి మద్దతుదారులు అక్కడ బాబా రామ్‌దేవ్ ఆశ్రమాన్ని స్థాపించారు, యోగా తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆ ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ప్రభుత్వం ఇప్పుడు అక్కడికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో వంతెన నిర్మిస్తానని అంటోంది. అయితే ఆ ప్రాంతంలో ఫ్రాక్చర్ పర్వతం ఉంది, అక్కడ ఎలాంటి నిర్మాణమూ చేయకూడదు. ఒకవేళ అక్కడ వంతెన నిర్మిస్తే కనక మొత్తం పర్వతం కూలిపోతుంది. ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తిన పర్వత్‌జన్ జర్నలిస్టును దోపిడీ, బ్లాక్ మెయిల్‌లాంటి తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారు. గత సంవత్సరం అతను 2 నెలలు జైలులో గడిపాడు.

ప్రధాని, గృహమంత్రులకు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ రాసిన లేఖ

జర్నలిస్టులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకునేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఆగస్టు 1న లేఖ రాసింది. ఉత్తరాఖండ్‌లోని వివిధ జిల్లాల్లో జర్నలిస్టులను తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి హింసిస్తున్నారనీ ఆ లేఖలో పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, ఇతర ప్రభుత్వ పరిపాలనా విభాగాల ఉద్యోగులలాగే మీడియా వ్యక్తులు కూడా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వార్తాపత్రికలు, టీవి ఛానెల్స్ ప్రజలకు అంటువ్యాధికి సంబంధించిన సమాచారాన్ని అందించడంతో పాటు నివారణా పద్ధతులపై సూచనలను కూడా అందిస్తున్నాయి. కరోనా విపత్తు గురించి ప్రజలలో అవగాహన పెర‌గడంతో అంటువ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గుతున్నది.
మీడియా సిబ్బంది తమ బాధ్యతలను నిర్వహిస్తూ, పరిపాలనా లోపాలను ప్రభుత్వమూ, ప్రజల ముందుకు తీసుకువస్తారు, తద్వారా వాటిని సకాలంలో సరిదిద్దవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా, అనేక జిల్లాల్లోని పరిపాలనాధికారులు వారి లోపాలను బహిర్గతం చేసిన మీడియా వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. వార్తలు రాయడం లేదా చూపించడం చేసినందుకు కేసులు పెడుతున్నారు.

ఇటీవల జర్నలిస్టులపై పెట్టిన కొన్ని బూటకపు కేసుల వివరాలు:

* ఉత్తరాఖండ్ వార్తాపత్రిక పర్వత్‌జన్ సంపాదకుడు శివ ప్రసాద్ సోమ్‌వాల్‌పై సెక్షన్ 268, 500, 503, 504 అలాగే 120 బి సెక్షన్ల క్రింద, దోపిడీతో సహా 6 కేసులు బూటకపు కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండునెలల జైలు జీవితం గడిపిన తరువాత అతనికి బెయిల్ లభించింది. సెమ్వాల్‌పై మళ్లీ రాజద్రోహం కేసు పెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డెహ్రాడూన్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ బెదిరింపుల నేపథ్యంలో గత రెండు వారాలుగా సెమ్వాల్ కనబడడం లేదని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్ చట్టం (Uttar Pradesh Gangsters and Anti-Social Activities (Prevention) Act, 1986 )కింద అరెస్టు చేయడానికి పోలీసులు వెతుకుతున్నారు.
* కోట్‌ద్వార్‌లో ప్రభుత్వ మైనింగ్ విధానాన్ని ప్రశ్నించినందుకు, మైనింగ్ మాఫియా గురించి వార్తలు రాసినందుకు జర్నలిస్ట్ రాజీవ్ గౌర్‌పై దాడి చేశారు. మైనింగ్ డబ్బును కొల్లగొట్టిన కేసు పెట్టి అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
* క్రైమ్ స్టోరీ ఎడిటర్ రాజేష్ శర్మ, జర్నలిస్ట్ ఉమేష్ కుమార్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. జర్నలిస్ట్ రాజేష్ శర్మను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితుడు, మాజీ సలహాదారు హరేంద్ర రావత్ ఒక బలహీనమైన ఆధారంతో అతన్ని అరెస్టు చేయించాడు. ఉమేష్ శర్మను అరెస్టు చేయడానికి అనేక టీమ్‌లను ఏర్పాటు చేశారు . పహార్ టీవీలో పని చేస్తున్న దీప్ మైథానీ మీద 504, 151 సెక్షన్లతో బూటకపు కేసు నమోదు చేశారు.
లాక్డౌన్ కాలంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జర్నలిస్టులపై నకిలీ కేసులు నమోదు చేసి, మీడియాను పదేపదే బెదిరిస్తూ, జర్నలిస్టులను వేధిస్తోంది. జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు ముప్పు తెస్తాయి.
(janchowk.com సౌజన్యంతో)

Keywords : uttarakhand, Journalists, CM,gangesters, Police,trivendra singh rawat, Rajesh sharma
(2024-04-13 06:50:27)



No. of visitors : 854

Suggested Posts


ఈ బీజేపీ మంత్రి బీకాంలో ఫిజిక్సే కాదు అధికార మదంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా !

తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా అని ప్రశ్నించగా టీచర్‌ మైనస్‌ అని చెప్పగా ఠాఠ్ మైనస్ ఎట్లైవుతది ప్లస్ అవుతది . ఇది కూడా రాని నీవు లెక్కల టీచర్ ఎట్లైనవ్ అని హూంకరిచిండు. ఆ తర్వాత మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత అని ప్రశ్నించాడు....

Maoist posters in Nainital: Police conduct raids across district

District police have raided several locations, including the house of a research scholar, three days after a government vehicle was set on fire in Nainitalʹs Dhari village by persons suspected to have Maoist links...

లాక్ డౌన్ కాలంలో పేదలకు ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థి నేతపై కేసులు నమోదు

ప్రణాళిక లేని అనూహ్యమైన లాక్ డౌన్ తో దేశంలో పేదల, వలస కార్మికులతో సహా అనేక మంది ప్రజల జీవనం అస్థవ్యస్తమైంది. అనేక మంది ఆకలితో మాడి పోతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు, వేరే ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు, పేదలందరికి ఆహారం అందించాలని డిమాండ్ చేసినందుకు ఓ విద్యార్థి నాయకుని పై కేసులు నమోదు చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు.

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో అగ్రవర్ణాల వారితో కలిసి భోజనం చేశాడ‌న్న కోపంతో ఓ అగ్రకుల మూక‌ ఓ దళితుడిని కొట్టి చంపింది.

అలా అయితే, మీరు వండితే మేమూ తినం - దళిత విద్యార్థుల తిరుగుబాటు

ఉత్తరాఖండ్ లోని ఓ స్కూల్ లో అగ్రవర్ణ వంటమనిషి వండిన భోజనాన్ని తాము తినబోమని భోజనాన్ని బహిష్కరించారు దళిత విద్యార్థులు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పాలకుల