ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్


ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్


ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు చేసిన అడవిపదిర పంటభూముల ధ్వంసాన్ని ఖండిస్తున్నాం...పోడుభూములకు పట్టాలివ్వాలి... పౌర హక్కుల సంఘం....

అడవిపదిర గ్రామం, వీర్నపల్లి మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాలో,గత పదిరోజుల క్రితం,100 మంది దళిత మరియు BC కుటుంబాల ప్రజలు 30 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్న భూముల్లో నుంచి ఖాళీచేయలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు దాడిచేసి పంటలను ధ్వంసం చేసి మరియు భూములను కందకాల గోతులు తవ్విన ఘటనపై,పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం కమిటి మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు, గురువారం 6,ఆగస్టు,2020 న అడవిపదిర గ్రామంలో గ్రామస్తులను, పొడుచేసి బ్రతుకుతున్న దళిత వెనుకబడిన వర్గానికి చెందిన రైతులనుకలిసి పోడు భూములను,పంటలను పరిశీలించి సేకరించిన నిజనిర్దారణ వివరాలు...
30 సంవత్సరాల నుంచి అడవిపదిర గ్రామంలోని నిరుపేద 40 దళిత కుటుంబాలకు చెందిన ప్రజలు మరియు 60 మంది వెనుకబడిన కుటుంబాలకు చెందిన100 కుటుంబాల ప్రజలందరు భూమిలేక అడవి పదిర ఊరు పక్కనే ఉన్న గుట్టల శ్రేణిని విస్తరించిన అడవిలోఅంచున గలా గుట్టల సముదాయం కింది భాగంలో 30 సంవత్సరాల నుంచి పొడుచేసిన భూముల్లో పత్తి,వరి పండిస్తూ జీవనంకోనసాగిస్తున్నారు. వీరందరిలో ఎక్కువ మంది దుబాయ్, మస్కట్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో అప్పులు చేసి కాయకష్టంతో సంపాదించిన డబ్బులతో వ్యవసాయం చేసిబ్రతుకుతున్నారు. వీరికి అర ఎకరం నుండి గరిష్టంగా 2 ఎకరాల వరకు భూమి సాగుచేస్తున్నారు.2017 న ఈ భూములకి కరెంట్ సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వానికి అర్జీలుపెట్టుకొని ఒక ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయించుకొని కరెంట్ పోల్స్ వేసుకొని 5 బోర్ లు వేసుకుని,కరెంట్ చార్జీలు కడుతూ వ్యవసాయం చేస్తున్నారు.2014 ఏప్రిల్ లో తెలంగాణ రాష్ట్ర మొదటి ఎన్నికల సందర్బంగా, KCR పోడుభూములకి పట్టాలిస్తానని అడవిపదిర రైతులకు హామీఇచ్చి నాడని, తిరిగి 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో,2019 న 17 వ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో KCR మరియు KTR లు అడవిపదిర గ్రామం లోపోడుభూములు సాగుచేస్తున్న దళిత & BC రైతులకు పట్టాలిస్తామని హామీలు ఇఛ్చినారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి KCR కొడుకు KTR ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గంలోనిదే ఈ అడవిపదిర గ్రామం.27 జులై,2020 సోమవారం నాడు ఉదయం200 మందిపోలీసులు,100 మంది ఫారెస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు అడవిపదిర గ్రామంలోని పొడుభూముల్లోని పంటలను ధ్వంసం చేసి,JCB మరియు ట్రాక్టర్ల తో భారీ కందకాలు తవ్వి,ఈ భూములనుండి వెళ్లిపోవాలని తీవ్రహెచ్చరికలు జారిచేసినారు.300 మంది గ్రామస్తులు,రైతులు ఈ దాడులను వ్యతిరేకించి, అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులతో బెదిరించి అడ్డుకుని ధ్వంసంచేసినారు...పౌర హక్కుల సంఘం తెలంగాణ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది.

1.ప్రభుత్వం పొడుభూములకు పట్టాలివ్వాలి.

2.పొడుభూముల్లోని పంటల వింధ్వంసానికి ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలి.ఈ గ్రామం, KTR నియోజకవర్గం అయిన సిరిసిల్లా అసెంబ్లీ లోనిది,కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయిన బండి సంజయ్ ప్రాతినిధ్యం లోనిదే ఈ అడవిపదిర గ్రామం.ఇద్దరు పొడుభూముల పంటలధ్వంసానికి బాధ్యులె.ఉమ్మడిగా జవాబుదారీతనం వహించాలి.

3.పొడుభూములు కాకుండా ఇదివరకే పట్టలైన భూములను కూడా కాళీచేసి వెళ్లాలని ఫారెస్ట్ వాళ్ళు తెల్లజెండాలు పాతినారు.ఇది ఉపసంహరించుకొవాలి...

4.రైతులను భయబ్రాంతులకు గురిచేయడం.,పోలీసులు మరియు ఫారెస్ట్ వాళ్లతో దాడులు చేయించడం ఆపివేయలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది......

1మాదనకుమారస్వామి ,రాష్ట్రసహాయకార్యదర్శి. పౌరహక్కుల సంఘం తెలంగాణ.

2.ఏనుగు మల్లారెడ్డి,ప్రధానకార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ,

3పొగుల రాజేశం,E. C. మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

4. కడ రాజయ్య, E. C.మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం,

5.మార్వాడి సుదర్శన్ రాష్ట్ర ప్రదానకార్యదర్శి దళితలిబరేషన్ ఫ్రంట్...

6:30 సాయంత్రం,6ఆగస్టు,2020.
అడవిపదిర గ్రామం,వీర్నపల్లి మండలం.
రాజన్న సిరిసిల్లాజిల్లా...

Keywords : CLC, Telangana, Rajanna sirisilla district
(2020-11-25 22:55:21)No. of visitors : 419

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
more..


ప్రజల