ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు

ఢిల్లీలో

సీఏఏ, ఏన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలను అణగదొక్కడానికి ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాడి ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున హింస జరిగింది. ప్రజలపై దాడులు జరిగాయి. అనేక మంది మరణించారు. వాటికి మతఘర్షణల ముసుగు తొడిగి ఈ దాడులు చేశారు. అయితే ఈ హింస వెనక జరిగిన కుట్రను, అప్పుడు జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను ʹది కారవాన్ʹ పత్రిక చాలా వివరంగా బైటపెట్టింది. దాంతో ఆ పత్రిక మీద కక్షగట్టిన హింసోన్మాదులు ఈ నెల 11 న ఆ పత్రికకు చెందిన ఒక నహిళా జర్నలిస్టుతో సహా ముగ్గురు జర్నలిస్టులపై దుర్మార్గమైన దాడులు చేశారు. ఆ రోజు జరిగిన దాడికి సంబంధించిన కథనాన్ని కార్వాన్ తన వెబ్ సైట్ లో ప్రచురించింది. ఇంగ్లీష్ లో ఉన్న కథనాన్ని పద్మ కొండిపర్తి తెలుగులోకి అనువదించారు.

ఆగస్టు 11 మధ్యాహ్నం, ఈశాన్య ఢిల్లీ లోని ఉత్తర ఘోండా ప్రాంతంలో వున్న సుభాష్ మొహల్లాలో ది కారవాన్‌ పత్రికలో పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులపై ఒక గుంపు దాడి చేసింది. ఢిల్లీ హింసాకాండ గురించి ఫిర్యాదుచేసిన ఒకరి కథనాన్ని వీరు తయారుచేస్తున్నారు. సుమారు గంటన్నర పాటు, జర్నలిస్టులు-షాహిద్ తంత్రే, ప్రభుజిత్ సింగ్, ఒక మహిళా జర్నలిస్ట్ – మీద దాడి జరిగింది, మత పరమైన తిట్లు, చంపుతామనే బెదిరింపులకు, లైంగిక వేధింపులకు గురయ్యారు.
జర్నలిస్టులు ఆ ప్రాంతంలో కట్టిన కాషాయ జెండాల ఫోటోలు తీస్తుంటే , కొంతమంది వారి దగ్గరకు వచ్చి ఫొటోలు తీయడం ఆపమని చెప్పారు. వారిలో ఒకతను తాను ʹబిజెపి ప్రధాన కార్యదర్శిʹ గా చెప్పుకొని. తాంత్రేని ఐడెంటిటీ కార్డు చూపించమన్నాడు. తాంత్రే ముస్లిం అని తెలుసుకున్న ఈ గుంపు వారి మీద దాడిని ప్రారంభించింది. తరువాత, మహిళా జర్నలిస్టుపై కూడా దాడి చేసింది. జర్నలిస్ట్ యొక్క భద్రతకోసం ఆమె గుర్తింపును ఇక్కడ చెప్పడం లేదు.
మధ్యాహ్నం 2 గంటలకు ఈ దాడి ప్రారంభమైంది, స్థానికులైన పురుషులు,మహిళలు జర్నలిస్టులను చుట్టుముట్టారు, దాడి సమయంలో, మహిళా జర్నలిస్ట్ ఒక గేట్ ద్వారా పక్క సందులోకి పారిపోగానే ఆ ముఠా గేటును లాక్ చేసి, మిగతా ఇద్దరు జర్నలిస్టులను లోపల బంధించింది. ఆ మహిళా జర్నలిస్ట్ తన సహచరులను విడిచిపెట్టమని వేడుకొంటే ఒక వ్యక్తి ఆమె దుస్తులు పట్టుకొని మళ్ళీ గేటు లోపలికి లాగడానికి ప్రయత్నించాడు. ఆమె అక్కడ నుంచి పారిపోయి అలసట తీర్చుకోడానికి కాస్సేపు కూచోగానే కొంతమంది యువకులు ఆమెను చుట్టుముట్టి ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు.
ఆ గుంపులో ఒకడు తనఅంగాన్ని బయటకు తీసి ఆమెకు చూపిస్తూ నవ్వుతూ అభ్యంతరకరమైన మరియు అసభ్యకరమైన వ్యక్తీకరణలు చేయడం ప్రారంభించాడు. ఆవ్యక్తి నుండి తప్పించుకుని పారిపోయిన తరువాత, ఆమెకు భజన్‌పుర పోలీస్ స్టేషన్‌కు రమ్మని తాంత్రే నుండి ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి, తాంత్రే మరియు సింగ్‌లను పోలీసులు స్టేషన్కు తీసుకువెళుతున్నారు. ఆమె స్టేషన్‌కు ఎలా వెళ్ళాలని దారి అడుగుతుంటే ఆమెను చూసిన ఆ గుంపు మళ్ళీ వెంటబడి కొట్టింది.

దాడి ప్రారంభమైన సందులో, ఆ వ్యక్తి తనను ఐడి కార్డు చూపించమని అడగడానికి ముందే ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై మంది వున్న గుంపు అక్కడ వుందని సింగ్ వివరించాడు. తాము ముగ్గురు జర్నలిస్టులమనీ, ప్రెస్ సభ్యులమనీ, చట్టవిరుద్ధంగా ఏమీ చేయడం లేదనీ, మేము బయట ఎగురుతున్న జెండాల ఫోటోలను మాత్రమే తీసుకుంటున్నాము తప్ప, ఎవరి ఇంటిలోపల తీయడం లేదు అని సింగ్ వారికి వివరణ నిచ్చారు.
కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ʹమీలాంటి పనికిరాని జర్నలిస్టులను ఎంతో మందిని చూశాను. నేను బిజెపి ప్రధాన కార్యదర్శిని, మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు.ʹʹ అని కాషాయరంగు కుర్తా వేసుకున్న వ్యక్తి అన్నాడు. ప్రెస్ కార్డ్‌లో షాహిద్‌పేరు చూడగానే అతను ముస్లిం అని గుర్తించి ʹతు తో కటువా ముల్లా హైʹ అని అరిచాడు, ʹకటువాʹ అంటే సున్తీ, ʹముల్లాʹ అంటే ముస్లిం మనిషి అని అర్థం. ఈ రెండు పదాలను సాధారణంగా ముస్లింలకు వ్యతిరేకంగా తిట్లుగా ఉపయోగిస్తారు. ఆ వ్యక్తి వెంటనే ఇతరులను పిలవడంతో నిమిషాల్లో యాభై మందికి పైగా చేరారు. మతపరమైన తిట్లు ప్రారంభించారు.
దాదాపు తొంభై నిముషాల పాటు, ఈ ముఠా ఇద్దరు జర్నలిస్టులను చుట్టుముట్టి, తాంత్రేని తిట్టడం, చెంపదెబ్బలు కొట్టడం, తన్నడం చేశారు. సింగ్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతన్ని కూడా తన్నారు. జర్నలిస్టులు ఉపయోగిస్తున్న కెమెరాను విరగ్గొడతామని బెదిరింఛారు. తాంత్రే తాను తీసిన అన్ని ఫోటోలను తొలగిస్తానని చెప్పాడు. ఆ సందు నుండి గేటు అవతలి వైపుకు పారిపోయిన మహిళా జర్నలిస్ట్, విరగ్గొడతారనే భయంతో తాంత్రే దగ్గర వున్న కెమెరాను తీసుకెళ్లిపోయింది.
కెమెరా తీసుకోడానికి గేట్ వరకు వెళ్ళడానికి గుంపు అనుమతివ్వడంతో తాంత్రే మహిళా జర్నలిస్టు గేటు మీదుగా ఇచ్చిన కెమెరాలో వున్న ఫోటోలను తీసేశాడు. కెమెరాను విరగ్గొడతామని వారు బెదిరించినప్పుడు తాంత్రే తన మెమొరీ కార్డును యిచ్చేయాల్సి వచ్చింది. అయినా వారు జర్నలిస్టులను కొట్టడం అపలేదు. "కొంత మంది కొడుతుంటే మరికొందరు కెమెరా పట్టీతో నా గొంతు కోసి చంపడానికి ప్రయత్నించారు" అని తాంత్రే చెప్పారు
అప్పుడు ఇద్దరు పోలీసులు అదనపు సబ్ ఇన్స్పెక్టర్ జాకీర్ ఖాన్ మరియు హెడ్ కానిస్టేబుల్ అరవింద్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చారు. "వారు హింసాత్మక, గుంపును శాంతింపచేయడానికి ప్రయత్నించారు" అని సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. "కానీ కాషాయ రంగు కుర్తాలోని వ్యక్తి మహిళలను మాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఇద్దరు మహిళలు మళ్ళీ షాహిద్ కెమెరాను లాక్కోవడం ప్రారంభించారు. పోలీసులు ఉన్నప్పటికీ గుంపు ఏ మాత్రం అదుపులో లేదు. ʹ
చివరకు, అధిక సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనాస్థలానికి చేరుకున్నాక ఇద్దరు జర్నలిస్టులను గుంపుకు దూరంగా తీసుకెళ్లగలిగారు. వారిని తీసుకెళ్తుండగా, "మీరు వారిని ఎలా తీసుకెళ్తారు ?" అని గుంపులో వాళ్ళు నిరసన తెలిపితే ఒక పోలీసు అధికారి, ʹమేము వారిని స్టేషన్‌కు తీసుకువెళుతున్నాము. మేము వారిని అక్కడ ప్రశ్నిస్తాము.ʹ అని సమాధాన పరిచాడు. తాంత్రే, సింగ్‌లను భజన్‌పురా పోలీస్స్టేషన్‌కు తీసుకెళ్లారు, అక్కడ ఈ సంఘటన గురించి ఫిర్యాదులో, సింగ్ "నేను అక్కడ లేనట్లయితే, ఆ కాషాయ రంగు కుర్తా ధరించిన వ్యక్తి నేతృత్వంలోని గుంపు షాహిద్‌ను ముస్లిం కాబట్టి చంపేసేది." అని రాశారు.
జనసమూహం తనపై దాడి చేస్తూంటే, ఒక పోలీసును చూసి అతని దగ్గరకు పరుగెత్తితే. అతను మీరూ మీరూ మాట్లాడుకొని పరిష్కరించుకోండి అని చెప్పాడని, అక్కడకు వచ్చిన రెండవ పోలీసు అధికారి తనను భజన్‌పుర పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళాడని మహిళా జర్నలిస్ట్ తన ఫిర్యాదులో వివరించింది.
ఢిల్లీలో జరిగిన హింసకు సంబంధించిన కేసులో ఒక మహిళ చేసిన ఫిర్యాదు గురించి సింగ్ మరియు తాంత్రే ఇటీవల రాసిన కథనంపై ఆ ముగ్గురు జర్నలిస్టులు ఫాలో-అప్ రిపోర్టింగ్ తయారు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తాము దాఖలు చేసిన ఫిర్యాదుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని అడగటానికి ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో ఆగస్టు 8 రాత్రి భజన్‌పురా పోలీస్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు పోలీసు అధికారులు తమను కొట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ. ఆగష్టు 5-6 మధ్య రాత్రి, అయోధ్యలోని రామాలయ శిలాన్యాస వేడుకలో భాగంగా, హిందువులు మతపరమైన నినాదాలు చేసి, పొరుగున ముస్లింలుండే ప్రాంతం వైపు గేటు దగ్గర ఒక ఆర్ఎస్ఎస్ జెండాను కట్టారు. ఆ విషయాన్ని ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మహిళలకు పోలీసులు ఫిర్యాదుపై సంతకం చేసిన కాపీని మాత్రం ఇచ్చారు, కాని ఎఫ్‌ఐఆర్ చేయాలని అడగడంతో పోలీసు సిబ్బంది తల్లి, కూతురు మరొక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
జర్నలిస్టులు చేసిన ఫిర్యాదులపై భజన్‌పురా స్టేషన్‌లోని పోలీసు సిబ్బంది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరించారు. జర్నలిస్టులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానికులు కూడా ఫిర్యాదు చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు ఇరువైపుల ఫిర్యాదులను పరిశీలించాల్సిన అవసరం ఉందని భజన్‌పురా స్టేషన్-హౌస్ అధికారి అశోక్ శర్మ ʹది కారవాన్ʹ సిబ్బందికి చెప్పారు. స్థానికులు తమ ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు చేశారో తెలియదు.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన జాతీయ లాక్డౌన్ సమయంలో కూడా, ఢిల్లీ హింస సమయంలో ముస్లింలు లక్ష్యంగా జరిగిన దాడులపైనా, దాడి చేసిన వారికి వున్న పోలీసుల సహకారంపైనా నివేదికలు తయారు చేయడంలో ʹది కారవాన్ʹ ముందంజలో ఉంది.
హింసాకాండ సమయంలో ముస్లింలపై జరిగిన కాల్పులు, దాడిలో పాల్గొన్నట్లు స్పష్టంగా మాట్లాడిన ఒక హిందూ వ్యక్తి సాక్ష్యాన్నీ, ముస్లింలపై దాడి చేయడానికి పోలీసులు ప్రోత్సహించారనీ తాంత్రే, మరొక జర్నలిస్టుతో కలిసి చేసిన ఒక వీడియో కథనంలో గుర్తించారు. అలాగే ʹది కారవాన్ʹ కోసం మరొక నివేదికలో, తాంత్రే, తన సహోద్యోగితో కలిసి హింస సమయంలో బుల్లెట్ గాయంతో ఒక కన్ను కోల్పోయిన ముస్లిం వ్యక్తి యొక్క కథనంలోనూ, ఈ కేసుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో ఉన్న అంతరాలపై నివేదిక తయారు చేశారు.

Keywords : delhi attacks, CAA, NRC, police, journalists, caravan
(2024-04-11 19:12:50)



No. of visitors : 1057

Suggested Posts


జర్నలిస్టులకు ఆత్మహత్యలే గతా?

ఇక్కడ ఫంక్షన్ అవడం లేదు.. వీళ్ళంతా వారంరోజులుగా నిద్రాహారాలు మాని తమ బతుకు కోసం కొట్లాడుతున్నారు. ఇంట్లో ఆకలితో పడుకున్న భార్యాపిల్లలు.... ఆరునెలలుగా జీతాలు లేక ఇంటి కిరాయీలు కట్టక సామాన్లు బైటపడేస్తామంటూ ఓనర్ల బెధిరింపులు భరిస్తూ....

అరుణ్ సాగర్ అమర్ రహే !

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో వినూత్న ఒరవడులకు కారకుల్లో అగ్రగామిగా నిలిచిన అరుణ్ సాగర్ మృతి మీడియా రంగానికి తీరని లోటు. ప్రజా ఉద్యమాల పట్ల అరుణ్ సాగర్ సునిశిత పరిశీలనా వైఖరి, ప్రజా పక్షపాత దృక్పథం, అణగారిన వర్గాలపట్ల ఆయన కమిట్ మెంట్ అనిర్వచనీయమైంది....

ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !

మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడైపోతున్న తీరును బట్టబయలు చేసిన వార్తలు, కొందరు విలేకరులు ధైర్యసాహసాలతో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వార్తల నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థి పేరు స్మరించుకోవడం

పత్రికా స్వేచ్ఛపై దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

పత్రికా స్వేచ్ఛపై, అసాంఘిక, సంఘ విద్రోహ చర్యలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన పాత్రికేయులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ దేశరాజధానిలో బుధవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు

ప్రముఖ జర్నలిస్టు, రచయిత రానా అయూబ్ ను హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలోబెదిరింపులకు దిగారు కొందరు దుర్మార్గులు. ఈ విషయంపై ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఢిల్లీలో