రాముడిని విమర్షించాడనే కారణంతో కత్తి మహేష్ అరెస్ట్

రాముడిని

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో కత్తి మహేష్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కత్తి మహేష్ తన ట్విటర్‌లో రాముడు కరోనా ప్రియుడు అంటూ పోస్ట్ చేయడంతో ఐపిసి సెక్షన్ 153(a) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు.
కాగా తన అరెస్టుపై కత్తి మహేష్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు.

ʹʹఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన క్లోజ్డ్ మీటింగ్ (బహుజన రచయితల) లో రామాయణంలో రాముడి పాత్ర గురించి నా వ్యాఖ్యలకు సంబంధించి ఫిబ్రవరి 2020 లో తనపై వచ్చిన‌ ఫిర్యాదుపై ఈ ఉదయం సైబర్ పోలీసులు నన్ను తూసుకెళ్ళారు.

ఐమాక్స్ థియేటర్ వద్ద 2020, ఫిబ్రవరి 14 న నాపై కొంతమంది గూండాలు జరిపిన ప్రాణాంతకమైన భౌతిక దాడి గురించి పోలీసులు ఇంతవరకు ఏమి చేయలేదు

ఈ దేశంలో మనుషుల మీద ప్రాణాంతకమైన దాడుల కన్నా మతపరమైన సెంటిమెంట్లు ముఖ్యమైనవి. చాలా భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందిక్కడ. ʹʹ అని మహేష్ కత్తి తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

మరో వైపు కతి మహేష్ అరెస్టును వీక్షణం ఎడిటర్, కవి, రచయిత ఎన్ వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ వాల్ పై ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పూర్తి పాఠం...

ʹʹకత్తి మహేష్ అరెస్టును ఖండించండి

రాముడినో, రామాయణాన్నో విమర్శించాడనే ఆరోపణతో కత్తి మహేష్ ను అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. రాముడినీ, రామాయణాన్నీ విమర్శించినవారిలో కత్తి మహేష్ మొదటివారూ కాదు, చివరివారూ కాదు. స్వయంగా రామాయణం రాసిన వాల్మీకి కూడ రాముడి చర్యను ఖండించానని సీతకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా చూపుకున్నాడు. అనేక భాషా సాహిత్యాలలో ఉన్న మూడు వందల రామాయణాలను పరిశీలించి సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు ఎ కె రామానుజన్ గారు వాటి మధ్య ఉన్న అసంగతాలను చూపారు. తెలుగులోకే వస్తే త్రిపురనేని రామస్వామి, చలం, నార్ల వెంకటేశ్వర రావు, ఆరుద్ర, రంగనాయకమ్మ, ఓల్గా ల దాకా రాముడి పాత్ర చిత్రణలోని అనౌచిత్యాల మీద, రామాయణంలోని అసంగతాల మీద, తప్పుడు భావజాలం మీద ఎన్నో రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలోని ఉజ్వలమైన సంప్రదాయం అది. ఆ సాహిత్య విమర్శ ధార అలా ఉంచి, ప్రతి మనిషికీ సహజంగా ఉండే భావప్రకటనా స్వేచ్ఛ, దాన్ని చట్టబద్ధం చేసిన రాజ్యాంగం అమలయ్యే దేశంలో ఒక భావప్రకటనను నేరంగా భావించి అరెస్టు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం.

కత్తి మహేష్ మీద కేసు ఉపసంహరించుకుని, విడుదల చేయాలి.

భావాలను భావాలతోనే ఎదుర్కోవాలి గాని సంకెళ్ల ద్వారా, గొంతు నొక్కడం ద్వారా, తప్పుడు ఆరోపణలపై నిర్బంధాల ద్వారా కాదు.ʹʹ

Keywords : mahesh katti, rama, ramayan, police arrest, telangana
(2024-04-22 09:08:20)



No. of visitors : 662

Suggested Posts


తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !

గత కొన్ని రోజులుగా నోటికి వచ్చిన అబద్దాలు చెపుతూ, నేను ఎస్టీ అని లేదా ఎస్సి అని ఒక ʹపదంʹ అన్నందుకు అందరిని రెచ్చగొడుతున్న పరిపూర్ణానంద ఎక్కడి వాడు? అతడికి బహిష్కరణ లేదా ? అసలు బాబాలు, సన్యాసిలు రాజకీయంగా, హింసాపురితంగా మాట్లాడొచ్చా సర్.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాముడిని