ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు డాక్టర్ పికె విజయన్, రాకేశ్ రంజన్‌లకు ఎన్ఐఏ సమన్లు పంపడాన్ని ఖండించండి!

ఢిల్లీ

భీమా కోరెగావ్ పేరిట విద్యావేత్తలు, కార్యకర్తల వేధింపులను ఆపివేయాలి!
రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి!

భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసుకు సంబంధించి ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకులు డాక్టర్ పి.కె. విజయన్, రాకేశ్ రంజన్లకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమన్లు పంపడాన్ని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సిఎఎస్ఆర్) ఖండిస్తూంది. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హనీ బాబును ఇటీవల అరెస్టు చేసిన తరువాత, దర్యాప్తులముసుగులో విశ్వవిద్యాలయ అధ్యాపకులపై కొనసాగుతున్న వేధింపు చర్యలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రజాస్వామిక, ప్రగతిశీల ప్రజలతో సహా విశాల ప్రజానీకంలో భయోత్పాతాన్ని కలిగించడానికే ఉద్దేశించబడ్డాయి.
సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై స్పందించే వారిని, విమర్శనాత్మక ఆలోచనను పెంచి పోషించే సంస్థల నుండి వెలువడే అసమ్మతి స్వరాలను నిశ్శబ్దం చేయడానికి కూడా ఇది ప్రయత్నిస్తుంది. అంతేకాక విశ్వవిద్యాలయ సముదాయంలో వున్న సంఘీభావ బంధాలను విచ్ఛిన్నం చేయడానికే అరెస్టు చేసిన, లేదా లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులతో సంబంధం ఉన్న వారిలో భయ వాతావరణాన్ని సృష్టిస్తున్నది.
హిందూ కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు డాక్టర్ పి.కె. విజయన్, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌ లో ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాకేశ్ రంజన్‌లు ఇద్దరూ విశ్వవిద్యాలయ సముదాయానికి దశాబ్దాల జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్తలు. వారు ప్రజాస్వామిక హక్కులు, ఉన్నత విద్య అందుబాటు మరియు కుల, వర్గ, సముదాయ ప్రాతిపదికన వివక్ష వంటి సమస్యలపై పని చేశారు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం ప్రత్యేకించి డియు ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబా విడుదల కోసం ఇద్దరూ ఎంతగానో శ్రమించారు.
రెండేళ్లుజైలు శిక్ష అనుభవిస్తున్నవారిపై నిరంతర దర్యాప్తులు జరుగుతూ, బెయిల్ నిరాకరించబడుతుంటే, మొదట మహారాష్ట్ర పోలీసులు, ఇప్పుడు ఎన్ఐఏలపై గృహ మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్య తీసుకోకపోవడమే కాదు, అవాస్తవ సాక్ష్యాలతో అత్యుత్సాహంతో వారు జరుపుతున్న దర్యాఫ్తులను మెచ్చుకొని సన్మానిస్తోంది. కోర్టులో ప్రాసిక్యూషన్ నిరంతరం తమ ఆరోపణలను నిరూపించడంలో విఫలమౌతున్నప్పటికీ, ఖైదులో వున్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తెల్తుంబ్డే, గౌతమ్ నవ్లఖా, మహేష్ రావత్‌ల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, వారి జీవితాలకు ఏమాత్రం విలువలేనివ్వడం లేదు. ఢిల్లీలాంటి నగరాల్లో COVID-19 విపత్తు వుధృతంగా ఉన్న సమయంలో NIA సమన్లు యివ్వడం ఈ ఉపాధ్యాయుల జీవితాలను ప్రమాదంలో పడేయడమేకాక, వారి కుటుంబాలను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. అయినప్పటికీ దర్యాప్తు పేరిట ఈ వేధింపులు కొనసాగుతూనే వున్నాయి.
భీమా కోరెగావ్‌లో హింసకు కారణమైన మనోహర్ "సంభాజీ" భిడే, మిలింద్ ఎక్బోటేలను స్వేచ్ఛగా వదిలేసారు. కానీ భీమా కోరెగావ్ లేదా ఎల్గార్ పరిషత్‌తో వాస్తవానికి ఏ మాత్రం సంబంధం లేని మేధావులు, జైల్లో వున్నారు లేదా జైలు నిర్బంధానికి గురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇదంతా వేధింపులు, బెదిరింపులు, నోరు మూయించడం, ఇతరులను కేసులో ఇరికించమని బలవంతం చేయడానికి చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది. భీమా కోరెగావ్ -ఎల్గార్ పరిషత్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామి వంటి పౌర హక్కుల కార్యకర్తలను, ఢిల్లీ హింసాకాండ కేసులో ప్రొఫెసర్ అపూర్వానంద్ వంటి విద్యావేత్తను, అనేకమంది యితరులను లక్ష్యంగా చేసుకోవడమనేది పాలక శక్తులు అవలంబిస్తున్న సర్వసాధారణ ఎత్తుగడగా తయారయింది.
ఈ నాడు, భీమా కోరెగావ్-ఎల్గార్ పరిషత్ అనే విస్తారమైన వల విశ్వవిద్యాలయ సముదాయాన్ని పూర్తిగా ముంచేసే, అసమ్మతి స్వరాలను నిశ్శబ్దం చేసే, విమర్శనాత్మక ఆలోచన, కార్యకలాపాల్ని మింగేసే ప్రమాదముంది. ఒకవైపు ఈ దేశ ప్రజలపై ఘోరమైన దారుణాలకు పాల్పడుతున్న వారిని రాజ్య వ్యవస్థలు కాపాడుతూ, మెచ్చుకుంటూంటే, మరోవైపు బ్రాహ్మణ హిందూత్వ ఫాసిస్టు ఏజెంట్లుగా మేధో వ్యతిరేకత, జాతిదురహంకారం, మూర్ఖత్వం చోటు చేసుకొంటున్నాయి.
భీమా కోరెగావ్, ఢిల్లీ హింసాకాండ కేసుల ద్వారా భిన్నాభిప్రాయం, విమర్శనాత్మక ఆలోచన, ప్రజాస్వామ్య హక్కులపై తీవ్రతరమవుతున్న దాడుల నేపథ్యంలో, సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులు సమైక్యమవ్వాలనీ, అరెస్టుల పరంపరను, దర్యాప్తు పేరిట వేధింపులను, విద్యావేత్తలు, కార్యకర్తలు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కవులు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలనేకమందిని వెంటాడుతున్న అరెస్ట్ బెదిరింపులను ఖండించాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (CASR)విజ్ఞప్తి చేస్తోంది.
మన డిమాండ్లు:
1. కల్పిత భీమా కోరెగావ్ కేసులో అభియోగాలు మోపిన కార్యకర్తలు, మేధావులందరినీ వెంటనే విడుదల చేయాలి.
2. CAA, NRC, NPR వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలి.
3. రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి. వెంటనే జైళ్ళలో రద్దీని తగ్గించాలి.
4. UAPA, PSA, NSA తదితర క్రూర చట్టాలన్నింటినీ రద్దు చేయాలి.

Campaign Against State Repression
(Organising Team: AISA, AISF, APCR, BCM, Bhim Army, Bigul Mazdoor Dasta, BSCEM, CEM, CRPP, CTF, Disha, DISSC, DSU, DTF, IAPL, IMK, Karnataka Janashakti, KYS, Lokpaksh, LSI, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, Mehnatkash Mahila Sangathan, Morcha Patrika, NAPM, NBS, NCHRO, Nowruz, NTUI, Peopleʹs Watch, Rihai Manch, Samajwadi Janparishad, Satyashodak Sangh, SFI, United Against Hate, WSS)

Keywords : bhima koregaon, delhi university, pk vijayan, rakesh ranjan
(2024-04-14 10:44:40)



No. of visitors : 1008

Suggested Posts


భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు

దళితుల ఐక్యత కు, పోరాటానికి చిహ్నమైన భీమా కోరేగావ్.. పాలకులను ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన భీమా కోరేగావ్ లో దళితులు నిర్వహించిన‌ విజయోత్సవాలపై దుర్మార్గమైన దాడులు చేసి దళితుల మరణానికి, వందలాది మంది గాయాలపాలవ్వడానికి కారణమైన హిందూ మతోన్మాద ఉగ్రవాదులను వదిలేసిన పోలీసులు దళితులకు మద్దతుగా నిలబడ్డవారిపై విరుచుకపడుతున్నారు.

Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee

We would like to extend our appreciation of the directions made by you on 12.05.2020, liberalizing the conditions for the release of undertrial prisoners in Maharashtra jails, and also clarifying that those undertrials who are otherwise excluded from this category (including those who are charged under Special Acts such as UAPA, NDPS etc) are eligible to

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...

భీమా కోరేగావ్ / ఎల్గర్ పరిషథ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసింది ఎన్ ఐ ఏ. కళా కారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే రమేష్ గైచోర్ల ను నిన్న(సెప్టంబర్7, 2020) అరెస్టు చేయగా కళాకారిని, రచయిత, దళిత కార్యకర్త జ్యోతీ జగతాప్ ను ఈ రోజు (సెప్టంబర్ 8, 2020)అరెస్టు చేశారు. దీంతో భీమా కోరేగావ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టయినవాళ్ళ సంఖ్య 15కు చేరుకుంది.

ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ

భీమా కోరే గావ్ కేసులో నిన్న అరెస్టు కాబడిన కబీర్ కళా మంచ్ కళాకారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే , షాహిర్ రమేష్ గైచోర్ లను ఎన్ ఐ ఏ కొంత కాలంగా విచారణ పేరుతో వేధిస్తోంది. ప్రధాని హత్యకు కుట్ర కేసులో సాక్షులుగా మారాలని

కరోనా కాలంలో...ఆనంద్ తేల్తుంబ్డే కు తాత్కాలిక బెయిల్ తిరస్కరించిన కోర్టు

ఎల్గర్ పరిషత్ - భీమా కోరెగావ్ కేసులో నిందితుడు విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే వైద్య కారణాలపై దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టు అతన్ని తలోజా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

హానీ బాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా అన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. మిరాండా హౌస్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

స్టాన్ స్వామి మృతికి నిర‌స‌న‌గా జైల్లో నిరాహార దీక్ష‌

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో నిందితులుగా తలోజా జైల్లో ఉన్న పది మంది హక్కుల కార్యకర్తలు నిరాహార దీక్ష‌కు దిగారు. త‌మ‌తో పాటు స‌హ నిందితుడిగా ఉన్న‌ ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్యంతో మృతి చెంద‌డానికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ వీరు ఒక రోజు నిరాహార దీక్ష‌ను చేప‌ట్టారు.

ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc

వరవరరావు, ప్రొఫెసర్‌ షోమాసేన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌ టెల్టుంట్లే, గౌతమ్‌ నవలాఖా లాంటి మేధావులను,సుధా భరద్వాజ్‌ లాంటి న్యాయవాదులను, మరికొద్దిమంది బుద్ధిజీవులను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైళ్ళలో నిర్పంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన గురిని మరికొద్దిమందిపైకి ఎక్కుపెట్టింది. మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమకారు

అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹ

ఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అవడానికి వెళ్లబోతూ, ఈ వారం బైట గడపడానికి, నాకొక వారం స్వేచ్ఛ ఇవ్వడానికి ఏప్రిల్ 8న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇచ్చిన తీర్పుకు సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, ఈ లాక్ డౌన్ సమయంలో కూడ, ఒక వారం రోజుల స్వేచ్ఛ అంటే చాల విలువైనది.

Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR

The Campaign Against State Repression (CASR) condemns the arrest of Professor Hany Babu MT at Mumbai by the National Investigation Agency (NIA) in connection with the Bhima Koregaon-Elgaar Parishad case.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఢిల్లీ