ఆరెస్సెస్ ను విమర్షించినందుకు జర్నలిజం విద్యార్థి అరెస్ట్


ఆరెస్సెస్ ను విమర్షించినందుకు జర్నలిజం విద్యార్థి అరెస్ట్

ఆరెస్సెస్

ʹʹఆరెస్సెస్ నుండి స్వేచ్చ కావాలిʹʹ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఓ జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో జర్నలిజం చదువుతున్నఓ విద్యార్థిని భారతదేశం 74 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న‌ రోజు ఆగస్టు 15 తెల్లవారుజామున‌ ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు 12 గంటల పాటు మానసికంగా హింసించారు.

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రథమ సంవత్సరం జర్నలిజం విద్యార్థి మొహమ్మద్ మిస్బా జాఫర్ ఆగస్టు 15 న ఒక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 14 న ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. స్వాతంత్ర్య దినోత్సవం సాయంత్రం ʹస్వాతంత్ర్య దినోత్సవ సందేశంʹ పేరుతో ఫేస్‌బుక్ లైవ్ ప్లాన్ చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) మార్గదర్శకత్వంలో ఏర్పడిన విద్యార్థుల సంస్థ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కలీం తుమ్కూర్ ఫేస్ బుక్ లైవ్ లో ప్రసంగం చేయాల్సి ఉంది. 15న ఫేస్ బుక్ లైవ్ ఉందని చెబుతూ #RSSseAzadi , #HindutvaGovtseAzadi అని హ్యాష్‌ట్యాగ్లు పోస్ట్ చేశాడు జాఫర్.

ఆగస్టు 15 తెల్లవారుజామున 2:20 గంటలకు, పది మంది పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లోని జార్వాల్‌లోని జాఫర్ నివాసానికి చేరుకున్నారు.

ʹవారు అర్ధరాత్రి వచ్చి మా తలుపు తట్టారు. నా అన్నయ్య తలుపు తెరిచినప్పుడు, పోలీసులు నన్ను విచారించాలనుకుంటున్నామని చెప్పారు. నేను [జాఫర్] స్వేచ్ఛ కోరుకుంటే, నేను జైలుకు వెళ్ళవచ్చని, ʹమేము అతనికి స్వేచ్ఛ ఇస్తాముʹ అని నా అన్నతో అన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే దారిలో పోలీసులు అసభ్యకరమైన భాష ఉపయోగించారు. ʹʹమీకు ఆహారం, ఆశ్రయం ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి మీరు ఎందుకు కృతజ్ఞత చూపరు? మీరు ఇమ్రాన్ ఖాన్ చట్టాలను భారతదేశానికి వర్తింపజేయాలనుకుంటున్నారా? ఇవన్నీ చేయటానికి మీ వెనుక ఏ సంస్థ ఉంది? అని అడిగారు పోలీసులు. నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని వారితో చెప్పాను. అది దేశ వ్యతిరేకమని మీరు అనుకుంటే, అది మీ సమస్య ʹʹ అని తాను చెప్పినట్టు జాఫర్ ది వైర్‌తో అన్నారు.

పోలీసులు జాఫర్‌ను క్షమాపణ నోట్ రాయమని కోరారు, తాను తప్పు చేశాన‌ని అనుకోనందున అతను క్షమాపణ నోట్ రాయడానికి జాఫర్ ఒప్పుకోలేదు. ʹనేను రాసిన విషయాల వల్ల‌ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని నేను ఊహించలేదని తెలియక అలా రాశానని అని వారికి రాసివమన్నారు అలా చేయక పోతే దేశద్రోహ కేసులు పెడతామని నా తండ్రి ఆస్తులను జప్తు చేస్తామని బెధిరించారు అప్పుడు నేను ప్రభుత్వాన్ని విమర్శించడం దేశ వ్యతిరేకమైంది ఎలా అవుతుంది అని ప్రశ్నించానుʹʹ అని జాఫర్ తెలిపాడు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సెక్షన్ 151 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట అతన్ని హాజరు పర్చి చలాన్ చేసిన తరువాత జాఫర్ ను వదిలేశారు. ఈ సెక్షన్.. నేరం జరగకుండా ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయడానికి అనుమతి ఇస్తుంది.

జార్వాల్ రోడ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ అధికారి ది వైర్‌తో మాట్లాడుతూ, ʹʹఫిర్యాదుదారు ఎవరు అనేది ప్రైవేట్ విషయం దానిని మేము బహిరంగపరచలేము. మేము అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు, అతన్ని పోలీస్ స్టేషన్కు పిలిచాము భవిష్యత్తులో ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఎటువంటి పనులు చేయొద్దని సలహా ఇచ్చాము.ʹʹ అన్నాడు. అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారులు ఒకరు కాదని నఏక మంది ఉన్నారని SO ధృవీకరించాడు.

అయితే జాఫర్ ఇప్పుడు భయపడుతున్నాడు. భవిష్యత్ లో జర్నలిస్టుగా ప్రతిసారీ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. కానీ పోలీసులు తనను ఇబ్బందులు పెడతారని అతను అనుకుంటున్నాడు. "పోలీసులు ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతున్నారు. క్రిమినల్ నేపథ్యం ఏ మాత్రం లేని నా లాంటి ఓ జర్నలిజం విద్యార్థిని వాళ్ళు ఇలా బెధిరించారంటే రేపు ఇంకా ఏమైనా జరగవచ్చు. అలా జరుగుతుందని నాకు తెలుసు ఎందుకంటే నేను యుపిలో నివసిస్తున్నాను.ʹʹ అన్నాడు జాఫర్

Keywords : uttarapradesh,journalism student, rss, police, hindutva
(2020-09-20 10:32:47)No. of visitors : 268

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


ఆరెస్సెస్