కంగనా అమ్మగారికి ఒక లేఖ


కంగనా అమ్మగారికి ఒక లేఖ

కంగనా

డియర్ కంగనా,
బాగున్నారనుకొంటాను. మీరు చేసిన ట్వీట్ గురించి మీకు నేను రాయాలనుకొన్నాను.
ఆగస్టు 23న ద ప్రింట్ వ్యవస్థాపకుడు శేఖర్ గుప్తా ఒక వ్యాసాన్ని షేర్ చేశాడు. జర్నలిష్టు దిలీప్ మండల్ రాసిన ఆ వ్యాసం పేరు ʹకులం గురించిన ఒక పుస్తకాన్ని ఓప్రా విన్ ఫ్రే 100మంది అమెరికా సీయీవోలకు పంపింది, కానీ భారతీయులెవరూ ఇప్పటికీ ఆ పుస్తకం గురించి మాట్లాడటం లేదు.ʹ (ఓప్రా విన్ ఫ్రే ఆఫ్రికో అమెరికన్ టీవి వ్యాఖ్యాత, రచయిత్రి -అనువాదకురాలు)
దానికి సమాధానంగా తమరు ʹఆధునిక భారతీయులు కుల వ్యవస్థను తిరస్కరించారు. ఇక్కడి చట్టాలు ఈ వ్యవస్థను ఒప్పుకోవని చిన్న పట్టణాల్లో కూడా అందరికీ తెలుసు. కొంతమందికి మాత్రం ఇదే విషయం మాట్లాడటం ఒక ఉన్మాద ఆనందంగా ఉంటుంది. మన రాజ్యాంగం ఒక్కటే రిజర్వేషన్ల పేరుతో ఈ కుల వ్యవస్థను ఇంకా మోస్తోంది. దాని గురించి ఇక మాట్లాడదాంʹ అని రాసారు.
ఇంకా మీరు ʹమరీ ముఖ్యంగా డాక్టర్లు, ఇంజినీర్లు, పైలెట్ల వృత్తుల్లో అర్హత ఉన్నవాళ్లు ఈ రిజర్వేషన్ల వలన ఎంతో ఇబ్బందిపడుతున్నారు. మాలో ఉన్న తెలివితేటలుగలిగినవాళ్లు అయిష్టంగా అమెరికాకు పారిపోతున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయంʹ అని కూడా అన్నారు.
నేను ఒక దళిత కుటుంబం నుండి వచ్చాను. మా కుటుంబంలో ఎంఫిల్ చేసిన మొదటి మహిళను నేను. నా తల్లిదండ్రులు కూలీలు. మా అమ్మ ఇప్పటికీ కూలి పనికి వెళుతుంది. నట్టనడి వేసవిలో భవన నిర్మాణపనిలో ఆమె ఇసుకనూ, రాళ్లనూ మోస్తుంది.
నా తల్లిదండ్రులు చదువుకోలేదు. కానీ వాళ్ల పిల్లలు చదువుకోవటానికి ఏమి చేయాలో అదంతా చేశారు. మా పిల్లలందరిలో నేనే ఎక్కువ చదువుకొన్నాను. ఎంత పై స్థాయి వరకైనా చదువుకోవాలని నేను చాలా చిన్న వయసులోనే ప్రతిజ్న చేసుకొన్నాను. అయితే నేను ఎక్కబోతున్న నిచ్చన ప్రతి మెట్టూ ముళ్లతో కప్పబడి ఉందని అప్పటికి నాకింకా తెలియలేదు.
ఆధునిక భారతీయులు కులవ్యవస్థను ʹతిరస్కరించారనిʹ మీరు నమ్ముతున్నారు. కానీ అత్యంత ప్రగతిశీల ఉదారవాద పరివరణమైన అంతర్జాతీయ మీడియా సంస్థలో కూడా కులాన్ని పాటిస్తున్న ఆధునిక భారతీయులను నేను చూశాను. ఒక టీంలో పని చేస్తూ కూడా వాళ్లు నన్ను సమానంగా చూడలేకపోయారు. దళితురాల్ని కావటం వలనే నేను ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది.
సినిమాల్లో కూడా బలహీన వర్గాల నుండి ఒక్కటైనా పెద్ద పేరు వినబడదు. ఆధునిక భారతీయులు కులాన్ని తిరస్కరిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది?
కులాన్ని తిరస్కరించటం అంటే ఏమిటో మీకు అర్థం కావాలంటే ముందు మీకున్న రాజపుత్రుల గర్వాన్ని వదులుకోవాలి. మీ అస్తిత్వం గురించి గర్వపడే మీలాంటి వాళ్లు, ఇతర కులాల పేర్లను కూడా అవమానిస్తారు. ʹపాకీ దాని లాగా కనబడటంʹగురించి సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, యువరాజ్ సింగ్ లాంటి ʹఆధునిక మానవులుʹ ఏమన్నారో మీకు గుర్తుందా? కొంతమంది పాకీల పేరుతోనే ఇక్కడ ఉనికిలో ఉన్నారు. ఉండి ఇలా అవమాన పడుతున్నారు.
ప్రైవేట్ సెక్టార్ లో ప్రతి రంగంలో కూడా ఇదే జరుగుతుంది. సుప్రీం కోర్టు 31 జడ్జిల్లో ఒకే జడ్జి దళితుడు. ఇద్దరు బీసీలు. ఒక్క ఆదివాసీ కూడా లేడు. ప్రధానస్రవంతి మీడియాలో ఒక్క దళిత ఎడిటర్ కూడా లేడు. మేము కాలు పెట్టగలిగిన ఒకే ఒక రంగం ప్రభుత్వ రంగం. రిజర్వేషన్ల వలన ప్రభుత్వం వత్తిడి చేయబడుతోంది కాబట్టి అదీను.
నా అనుభవం వలననే, ఢిల్లీ లాంటి మెట్రో నగరంలో పెరగటం వలననే నేను రిజర్వేషన్ల ప్రాముఖ్యత గురించి మీకు చెప్పగలుగుతున్నాను. విద్య గురించి, రిజర్వేషన్ల గురించి వదిలేయ్యండి. కోట్లాది దళితులు, బీసీలు అగ్ర కులాల ముందు నోరు కూడా ఎత్తలేరు.
...
రనౌత్ గారు, మీ ఇంట్లో బాత్ రూములు కడిగేవాళ్ల కులం ఎప్పుడైనా అడిగారా? అడగద్దులే. నేను చెబుతాను. వాళ్లు దళితులు. ఏం, ఎందుకు అగ్ర కులాల వాళ్లు ఈ పని చేయటం లేదు? దళితులే అలాంటి అమానవీయ పరిస్థితుల్లో బతుకుతూ చనిపోతున్నారు? మన సమాజానికి సంబంధించి ఈ వాస్తవాల గురించి తెలుసుకోవటం ఏమంత కష్టమైన పని కాదు. మీరు ఇంకా ఒప్పుకోక పోతే ఏదో ఒక దిన పత్రికను తీసుకోండి. అందులో కులాధార దాడి గురించి ఒక వార్త తప్పక దొరుకుతుందని నేను హామీ ఇస్తాను మీకు.
కులం వలన హత్యలు అవుతాయి. కుల సమాజం రోహిత్ వేముల, పాయల్ తాద్వి లాంటి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పిన కొన్ని వ్యవస్థాగత హత్యలు కూడా కొన్ని ఉంటాయి. నేను కూడా అదే దారి ఎన్నుకొన్నవారి చిట్టాలో ఉన్నాను. ʹఆధునిక భారతీయులుʹ మమ్మల్ని వేధించే, అవమానించే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు. ఒకవేళ మేము ఈ ఒత్తిడులు తట్టుకొని బతికి బయటపడ్డా కూడా మా నుండి విజయాన్ని లాక్కోవటానికి సమాజం ఎప్పుడూ ప్రణాళికలు వేస్తూ ఉంటుంది.
ఈ మధ్యనే డా. బీయార్ అంబేడ్కర్ రాసిన ʹవైటింగ్ ఫర్ వీసాʹ అనే పుస్తకం చదివాను. అతని డిగ్రీలు, విద్యార్హతలు, అతని సామర్ధ్యం, అతని చదువు -అతని కులం ముందు ఎలా దిగదుడుపు అయ్యాయో రాశారు. ఆ అనుభవాలే మన రాజ్యాంగంలో రిజర్వేషన్లు రావటానికి కారణం అయ్యాయి. అవి లేకపోతే మాలాంటి వెనుకబడిన సమూహాలం ఇప్పటిలాగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయేవాళ్లం. ఆ రిజర్వేషన్ల పుణ్యమాని నేను ఇక్కడివరకైనా వచ్చాను. ఆయన వలనే మేము ఈ మాత్రం ఇలా ఉన్నాము.
మేము కలలు కనటానికి వీలు లేదని సమాజం మాకు చెబుతుంది. మేము చదువుకొని ఒకవేళ మంచి ఉద్యోగాలు తెచ్చుకొన్నా ʹఆధునిక భారతీయులుʹ మమ్మల్ని కిందకు లాగడానికి కుట్రలు చేస్తారు. అలాంటి కుట్రలకు బలి అయిన వాళ్లలో నేనొకదాన్ని. అయినా బాబా సాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ బలంలో నేను మాట్లాడటానికి భయపడను.
రిజర్వేషన్లకు చరమగీతం పాడాలంటే మీ నుండి, మీలాంటి అగ్ర కుల సమూహాల నుండి మార్పు రావాలి. తమరు రాసిన దానికి వస్తున్న సమాధానాలు -ఆ విషయం గురించి మీరు ఆలోచించటానికి పనికి వస్తాయని ఆశిస్తున్నాను.
భవదీయురాలు
మీనా కోట్వాల్
(మీనా కోట్వాల్ ఒక స్వతంత్ర జర్నలిష్టు. ఈ వ్యాసం ద వైర్ నుండి. తెలుగు అనువాదం రమా సుందరి)

Keywords : kangana ranout, meena kotwal, dalit, caste
(2020-09-20 18:20:26)No. of visitors : 409

Suggested Posts


దిల్ వాలేః ఒక వైపు నిరసనలు, మరో వైపు కలక్షన్లు

షారూఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు 21 కోట్ల రూపాయల కలక్షన్లు వసూలు చేసి బాజీరావు మస్తానీ ని మించి పోయింది. దేశంలో అసహనం ఉందన్న షారూఖ్ ఖాన్ మాటలకు....

దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌

ʹప్రేమʹ ఈ పదానికి ఆర్.ఎస్.ఎస్ దీక్షనరిలో చోటు లేదు. కానీ ఇక్కడ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త అయిన హీరో మాత్రం అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ కులమే అని దర్శకుడు తల్లి పాత్రతో చూపిస్తాడు లెండి. లేకపోతే కుల సంకరం జరిగిపోదు. అమ్మాయిని ఏకాంత ప్రదేశానికి ఈ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త తీసుకుపోయి అక్కడ కౌగిలింతలు. ముద్దులు అబ్బో అన్ని పాశ్చ్యాత సంస్కృతి పనులు చేస్తుంటాడు. ....

కేసు కోసం 25 కోట్లు ఖర్చు పెట్టాం - సల్మాన్ తండ్రి చెప్పిన నిజాలు

హిట్ అండ్ రన్ కేసులోంచి నిర్దోషిగా బయటపడ్డాడు నిజమే కానీ అది అంత సులభంగా జరగలేదట, ఈ కేసుకోసం సల్మాన్ ఖాన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. ఈ విషయం వేరెవరో చెబితే నమ్మలేమేమో కానీ .....

చిన్నారి పెళ్లికూతురు ఆత్మహత్య

టీవీ సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. హిందీలో బాలికావధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ తో ఆనందిగా ఫేమస్ అయిన....

సల్మాన్ నిర్దోషి సరే
మరి రవీంద్రపాటిల్ చావుకు కారణమెవరు ?

సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. పెద్దలు చాలా మంది ఆనందం ప్రకటిస్తున్నారు. న్యాయం గెలిచిందని తీర్పులిచ్చేస్తున్నారు. మరి ఈ కేసులో దోషులెవరు ? ప్రత్యక్ష సాక్షి మరణానికి కారణమెవరు ?అసలు ప్రత్యక్ష సాక్షి ఎవరు ? అతనేమయ్యాడు ? ......

పైరసీ సినిమాలు చూడటం తప్పుకాదు - హైకోర్టు

ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం శిక్షార్హం కాదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. పైరసీ ప్రింట్లను ఆన్ లైన్ లో వీక్షించిన వారు శిక్షార్హులని గత నెలలో ఐఎస్పీలు ప్రకటించిన నేపథ్యంలో....

ʹసల్మాన్ కారు మద్యం తాగిందిʹ

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువడినప్పటినుండి సోషల్ మీడియాలో విమర్షలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిడెంట్ సమయంలో సల్మాన్....

Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter

At the outset Sir, congratulations on finally being able to release your magnum opus ʹPadmaavatʹ – minus the ʹiʹ, minus the gorgeous Deepika Padukoneʹs uncovered slender waist, minus 70 shots you apparently had to cut out.....

అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?

అమెరికాలో తెల్ల జాతి పోలీసు నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను హత్య చేసిన తర్వాత ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ అంటు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై భారతీయులు అనేక మంది తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


కంగనా