నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌


నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌

నాజీ


ఈమె పేరు ʹ ఇసాబెల్ వికెర్సన్ ʹ.అమెరికన్ పౌరురాలు.జర్నలిజమ్ లో ఇచ్చే ప్రఖ్యాత ʹ పులిట్జర్ ʹ అవార్డ్ అందుకున్న మొదటి ఆఫ్రికన్ -అమెరికన్ మహిళ.
ʹThe warmth of other Suns : The epic story of America ʹs Great migration ʹ అనే పుస్తక రచయిత్రి.1915 నుండి 1970 వరకు అమెరికా కు వలస వెళ్ళిన ఆరు మిలియన్ల జనాభాలో వివిధ జాతులకు , దేశాలకు, మతాలకు, ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసి ఇసాబెల్ ఈ పుస్తకం రూపొందించారు.ఈ బుక్ కు ʹమార్క్ లింటోన్ హిస్టరీ ప్రయిజ్.. హార్ట్ ల్యాండ్ అవార్డ్..డే టన్ లిటరరీ పీస్ ప్రైజ్ లాంటి అనేక అవార్డులు వచ్చాయి...
ఇప్పుడు ఇసాబెల్ వికర్సన్ రాసిన ఇంకో పుస్తకం అమెరికా లో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఎందుకంటే ఆమె రాసిన పుస్తకం...
"Caste : The Origins of our Discontents".
భారతీయ కుల వ్యవస్థ నాజీ ల పాలన కన్నా ఎంత దుర్మార్గమైనదో , దాని ప్రభావం అమెరికాలో ఎంత ఉందో చాలా వివరంగా చెప్పింది. ʹ భారతీయ కుల వ్యవస్థ ʹ గురించి ఎందరో విదేశీయులు మాక్స్ వెబర్, లూయి డ్యూమాంట్, నికోలస్ డిర్క్..లాంటి వాళ్ళు ఇంతకు ముందే రాశారు.అయితే ʹఇసాబెల్ ʹ తన ʹబ్లాక్ ఐడెంటిటీ ʹ తో కులవ్యవస్థ ను పోల్చుతూ అద్భుతమైన విశ్లేషణ చేశారు.చాలా విస్తృతంగా పరిశోధించి, ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఈ పుస్తకం రాశారు.
ఈ పుస్తకం లో ʹఇండియా ʹ ని 136 సార్లు ప్రస్తావిస్తే, caste / కులం పదాన్ని ʹ1469 ʹ సార్లు వాడారు.మనుస్మృతి అన్న పదాన్ని 16 సార్లు వాడారు.
కుల వ్యవస్థ తీరుతెన్నులు..ʹసోషల్ స్ట్రేటిఫికేషన్ʹ, ʹhierarchy( నిచ్చెన మెట్ల వ్యవస్థ), inclusion , ఎక్సక్లూజన్, ఫ్యూరిటీ వంటి ఎన్నో విషయాలు చర్చిస్తారు.
బ్లాక్స్ పట్ల వివక్ష..దళితులు ఎదుర్కొనే సోషల్ స్టిగ్మా ..సామాజిక వ్యవస్థల పై కులం ప్రభావం...చాలా వివరంగా విశ్లేషించారు.కేవలం ʹపుట్టుక ʹవల్ల (వన్ డ్రాప్ రూల్ ) ఒక వ్యక్తి ఉన్నతుడిగా.. ఇంకొక వ్యక్తి నీచుడిగా పరిగణించే ʹ Heritability ʹ లో ఉన్న డొల్లతనాన్ని ఆవిష్కరించారు.
దళితుల్లో ఉండే ʹinherent inferiorityʹ కి కారణాలు..అనేక పద్ధతుల వ్యవస్థీకృత కంట్రోల్ ద్వారా అగ్రకులాలు తమ స్థానాన్ని పదిలపరుచుకోవడం...ʹబాటమ్ రంగ్ʹ లో ఉండే దళితుల విజయాల పట్ల అసహనం...ʹTentacles of Casteʹ చాప్టర్ లో చర్చించారు.
Occupational Hierarchy లో అమెరికా లో ʹ జిమ్ క్రూ ʹ సమయం లో నల్లవాళ్లని ఎట్లా కూలీలుగా బానిసలుగా చూసేవాళ్ళో అదేవిధంగా దళితులను వెట్టిచాకిరీ కి, పాకీ పనికి ఇతర చాలా చిన్నచూపు చూసే పనులకు కుదించడం..ఆధిపత్యాన్ని స్థిరపరుచుకోవడమే అంటారు.
Narcissism of Caste గురించి , సంస్కృతి, సంప్రదాయాలు ఎట్లా అగ్రకులాల/ dominant caste జీవనశైలి చుట్టూ తయారు కాబడి ఉన్నాయో..వాటిని నమ్మకంగా ʹidealizeʹ( ఆదర్శంగా) చేసుకుని దళితులు / oppressed/ పీడితులు ఎట్లా ఒక విధమైన ʹ Stockholm Syndromeʹ లోకి తరతరాలుగా నెట్టివేయబడి ఉన్నారో వివరించారు.
కులాల నడుమ అపనమ్మకం,ఒకరిపట్ల ఒకరికి ఉన్న ద్వేషం క్రూరమైన నేరపూరిత జ్యూడిషియల్ వ్యవస్థ ల తయారీకి ఎట్లా కారణంగా మారుతాయో చెప్పారు.కులాన్ని ఇదివరకు రాసిన వాళ్ళలాగా ఒక వ్యవస్థ లాగా పేర్కొనరు ఇసాబెల్.కులం ఒక ʹ క్రానిక్ డీసీస్ʹ( దీర్ఘకాలిక వ్యాధి) అని చికిత్స అత్యవసరం అని చెప్తారు.కులం గుప్పిట్లో ఉన్న సామాజిక వ్యవస్థలు ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఇసాబెల్ అంటారు.
రేస్ ( జాతి) ని , కులాన్ని చాలా నిశితంగా గమనించిన ఆమె రెండింటికీ తేడాలు చెప్పి, " Caste is the Bone..While Race is the skin " ( ఆధిపత్యం అనే శరీరానికి కులం ఎముక వంటిదైతే జాతి చర్మం వంటిది ) అని వివరించారు.
ʹInstant american Classic ʹ గా విమర్శకులు అభివర్ణిస్తున్న ఈ పుస్తకం 10 బెస్ట్ బుక్స్ ఆఫ్ ద ఇయర్ గా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
బెనజీర్ భుట్టో కుమార్తె ʹ ఫాతిమా భుట్టోʹ ఈ పుస్తకాన్ని " painfully resonant Book " అన్నారు.
అయితే విచిత్రంగా , ఆగస్ట్ 4 న విడుదలై దేశవిదేశాల్లో వేల కాపీలు అమ్ముడైన ఈ పుస్తకం గురించి భారతీయ అమెరికన్లు నోరుమెదపడం లేదు.భారతదేశం లో కేవలం ʹముంబై మిర్రర్ʹ ʹ స్వరాజ్ ʹ పత్రికలు మాత్రమే రివ్యూ లు రాసాయి.కావాలని చూపెడుతున్న ఈ ʹindifferenceʹ కి కారణం కూడా భారతీయుల్లో గూడు కట్టుకున్న కులవిద్వేషమే అంటున్నారు ఇసాబెల్.
పబ్లిషర్ ప్రఖ్యాత అమెరికన్ టీవీ షో నిర్వాహకురాలు ʹ ఓప్రా విన్ ఫ్రె ʹ ఈ పుస్తకం 100 కాపీలు అమెరికా లోని 100 అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీ CEO లకు బహుమతిగా పంపారు.
Out standing work అని ప్రశంసలు అందుకుంటున్న ఈ పుస్తకం రాసినందుకు భారతీయ కులవ్యవస్థ పై ఇంత వివరంగా విస్తృతంగా చర్చించిన ʹ ఇసాబెల్ వికర్సన్ ʹ కు బోలెడు హగ్స్.
- రజిత కొమ్ము

Keywords : Caste : The Origins of our Discontents, Isabel Wilkerson,
(2020-09-20 18:20:29)No. of visitors : 494

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

What happens when youʹre about to die? Chemists explain exactly how death feels

The American Chemical Society has explained exactly what goes on in your brain when (for instance) somebody plunges a woodmanʹs axe into your torso.....

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


నాజీ